E-Paper
Advertisement

Nora Fatehi: నోరాఫతేహి ఇంట్లో విషాదం.. నా ప్రయాణంలో ప్రతి అడుగు నీవేనంటూ ఎమోషనల్ పోస్ట్!

Nora Fatehi: నోరాఫతేహి ఇంట్లో విషాదం.. నా ప్రయాణంలో ప్రతి అడుగు నీవేనంటూ ఎమోషనల్ పోస్ట్!
Advertisement

Nora Fatehi:ప్రముఖ సినీనటి, సింగర్, డాన్సర్, మోడల్, రియాలిటీ షో జడ్జ్ గా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు నోరా ఫతేహి (Nora Fatehi). టెంపర్ సినిమాలో “ఇట్టాగే రెచ్చిపోదాం” అనే స్పెషల్ సాంగ్ తో అందరిని మైమరిపించిన ఈమె కిక్ 2, లోఫర్, ఊపిరి వంటి చిత్రాలలో ఆడి పాడింది. ఇక బాహుబలి సినిమాలో “మనోహరీ” పాటతో విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది నోరా ఫతేహి. ప్రస్తుతం స్పెషల్ సాంగ్ లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈమె తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ అంటూ పలు చిత్రాలలో అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిపోయింది. ఇటీవల ఒక వీడియోని షేర్ చేస్తూ ప్రపంచశాంతి గురించి మాట్లాడితే కోపం ఎందుకు అంటూ ఒక వీడియోని రిలీజ్ చేసి వార్తల్లో నిలిచిన ఈమె.. ఇప్పుడు సడన్గా తన కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి అంటూ ఎమోషనల్ పోస్ట్ పంచుకుంది. తన స్నేహితుడు, సోదర సమానమైన వ్యక్తి మరణించడంతో ఆ విషయాన్ని అభిమానులతో పంచుకుంది. నా ప్రతి అడుగులో నీవేనంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది నోరా ఫతేహి.

ఆయన మరణంతో దిగ్భ్రాంతికి లోనైన నోరాఫతేహి..

తాజాగా తన ఇంస్టాగ్రామ్ స్టేటస్ ద్వారా.. ఈరోజు నేను అత్యంత ప్రియమైన స్నేహితుడిని , ఒక సోదరుడిని , ఒక నమ్మకస్తుడిని కోల్పోయాను. మొదటి రోజు నుండి నా ప్రయాణంలో భాగమైన వ్యక్తి. మీరందరూ కూడా ఆయన నాతో ఉన్నప్పుడు మా బంధాన్ని గమనించే ఉంటారు. నా వ్యక్తిత్వంలోని ఉత్తమ కోణాన్ని బయటకు తీసిన వ్యక్తి. మీరు అతన్ని నాతో చూసిన ప్రతిసారి నేను ఎప్పుడూ నవ్వుతూనే కనిపిస్తూ ఉంటాను. మేము ప్రతిదీ కూడా కలిసే చేశాము . ఇంతకుముందు ఎప్పుడూ కూడా నేను ఒక స్నేహితుడిని కోల్పోలేదు. కానీ ఈ బాధాకర సమయం నుండి ఎలా బయటపడాలో అర్థం కావడం లేదు. ఈరోజు నా ప్రియమైన మిత్రుడు మార్స్ పెడ్రోజో (Marce pedrozo) ఆత్మకు శాంతి చేకూరాలని.. మీరందరూ కోరుకుంటారని భావిస్తున్నాను. ఇప్పుడు నా స్నేహితుడు నాతో లేరు. ఆయన స్వర్గస్తులయ్యారు . ఈ సమయం నన్ను మరింత దిగ్భ్రాంతికి గురిచేస్తోంది అంటూ నోరాఫతేహి ఒక ఎమోషనల్ పోస్ట్ పంచుకుంది.

Advertisement

 

Advertisement

 

ఆయనతో ఉన్న బంధం ఏమిటంటే..

అసలు విషయంలోకి వెళ్తే.. నోరా ఫతేహి హెయిర్ అండ్ మేకప్ స్టైలిస్ట్ గా మార్స్ పెడ్రోజో మంచి పేరు సొంతం చేసుకున్నారు. నోరా ఫతేహికి హెయిర్ స్టైలిస్ట్ మాత్రమే కాదు ఒక కుటుంబ సభ్యుడిగా గా కలిసిమెలిసి ఉండేవారు. ముఖ్యంగా నోరా ఫతేహి లుక్స్ స్టైలింగులో మార్స్ కీలకపాత్ర పోషించేవారు. అలాంటి ఈయనా నేడు మరణించారని తెలిసి నోరా మరింత దుఃఖింతరాలవుతోంది . ఈయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటుంది. ఇక ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు సైతం అసలు మార్స్ కి ఏం జరిగింది? ఎలా చనిపోయారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ALSO READ:Dhurandhar: ధురంధర్ 2 క్లైమాక్స్ లో దిమ్మతిరిగే ట్విస్ట్.. డైరెక్టర్ ప్లాన్ అదుర్స్!

మార్స్ మరణంపై బాలీవుడ్ ప్రముఖుల సంతాపం..

ఇకపోతే మార్స్ ఆకస్మిక మరణం పై వరుణ్ ధావన్ కూడా స్పందించారు. ఈయన తోపాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు కూడా స్పందిస్తూ మార్స్ ఆకస్మిక మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×