Pawan Kalyan: సినిమా వేదికలపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడటం ఒక ఎత్తైతే, తన వ్యక్తిగత ఇష్టాఇష్టాలను, భావోద్వేగాలను పంచుకోవడం మరో ఎత్తు. తాజాగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ తన జీవితంలో తనను అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తుల గురించి మాట్లాడుతూ, ప్రపంచ ప్రఖ్యాత పాప్ సింగర్ మైకేల్ జాక్సన్ పై తనకున్న అమితమైన ప్రేమాభిమానాలను బయటపెట్టారు. సాధారణంగా పవన్ కళ్యాణ్ హాలీవుడ్ నటులు అల్ పచినో, క్లింట్ ఈస్ట్‌వుడ్ వంటి వారిని ఆరాధిస్తారని అందరికీ తెలుసు. కానీ, డ్యాన్స్ విషయంలో తనకు మైకేల్ జాక్సన్ అంటే ఎంత పిచ్చో మొదటిసారి వివరించారు. “నా జీవితంలో నేను పిచ్చిగా ఆరాధించిన వ్యక్తుల్లో మైకేల్ జాక్సన్ ఒకరు. అసలు సినిమాల్లోకి రాకముందు, అసలు సినిమా ప్రపంచం గురించి ఏమీ తెలియనప్పుడు.. ఇంత అభిమానం సంపాదించుకోవచ్చా? అని నన్ను ఆలోచింపజేసింది ఆయనే. నేను ఈ మాత్రం ఒళ్ళు కదిలిస్తున్నానంటే దానికి కారణం మైకేల్ జాక్సన్ ఇచ్చిన స్ఫూర్తే.” అని పవన్ పేర్కొన్నారు.
Read also-TV Heroines : కన్నడ హీరోయిన్స్ లలో ఆమె రిచ్.. సీరియల్స్ తో అంత సంపాదించిందా..?
అంతేకాదు, మైకేల్ జాక్సన్ మరణించినప్పుడు తాను చాలా కుంగిపోయానని, కన్నీళ్లు పెట్టుకున్నానని పవన్ భావోద్వేగంతో చెప్పారు. తన డ్యాన్స్ వీడియోలను మైకేల్ జాక్సన్ స్టెప్స్‌తో పోలుస్తూ అభిమానులు చేసే ఎడిట్స్ చూసినప్పుడు.. ఆ లెజెండ్‌తో తనను పోల్చడం పాపమని, అది తనకు ఒక రకమైన భయాన్ని కలిగిస్తుందని వినమ్రంగా చెప్పారు. ఇక డ్యాన్స్ గురించి మాట్లాడుతూ, తన చిత్రంలోని కథానాయిక శ్రీలీల పై పవన్ కళ్యాణ్ సరదాగా ప్రశంసల జల్లు కురిపించారు. శ్రీలీల ఒక అద్భుతమైన డ్యాన్సర్ అని, ఆమె పక్కన డ్యాన్స్ చేయడం తనకు కష్టమని చమత్కరించారు.
అంతే కాంకుండా “నేను ముందే హరీష్ శంకర్‌కు చెప్పాను.. శ్రీలీల డ్యాన్స్ చేస్తే నేను డ్యాన్స్ చేయను. ఎందుకంటే ఆమె నన్ను డామినేట్ చేసేస్తుంది. స్క్రీన్ మీద నేనే కనిపించాలి కాబట్టి, ఆమె పక్కన నన్ను డ్యాన్స్ చేయమని అడగొద్దు” అని సరదాగా కండిషన్ పెట్టినట్లు వెల్లడించారు. తాను డ్యాన్స్ చేయనని ఎంత చెప్పినా, హరీష్ శంకర్ వినకుండా తనతో బలవంతంగా స్టెప్పులు వేయించారని, ఫ్యాన్స్ కోసం ఆ భయంతోనే డ్యాన్స్ పూర్తి చేశానని పవన్ నవ్వుతూ చెప్పారు. రాజకీయాల్లో బిజీగా ఉంటూనే, సినిమా షూటింగుల్లో పవన్ కళ్యాణ్ చూపిస్తున్న ఈ హుషారు అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ఒక పక్క తన రోల్ మోడల్స్ పట్ల ఉన్న వినయాన్ని చాటుకుంటూనే, మరోపక్క తోటి నటీనటుల ప్రతిభను అభినందించే పవన్ తీరు అందరినీ ఆకట్టుకుంటోంది.