E-Paper
Advertisement

Prabhas: ఇండియాలో కాకుండా.‌. ఆ దేశంలో ఆస్తులు కొనుక్కుంటున్న రెబల్ స్టార్..!

Prabhas: ఇండియాలో కాకుండా.‌. ఆ దేశంలో ఆస్తులు కొనుక్కుంటున్న రెబల్ స్టార్..!
Advertisement

Prabhas:ప్రస్తుతం ప్రభాస్ వరస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో ప్రభాస్ గురించి చిన్న వార్త కూడా ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతూ ఉంటుంది అన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ప్రభాస్ పర్సనల్ విషయాలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూ అందరిని ఆకట్టుకుంటూ ఉంటాయి. ఈ క్రమంలో ప్రభాస్ భవిష్యత్తు గురించి వస్తున్న ఒక వార్త అందరిని ఆశ్చర్యపరుస్తోంది.

అక్కడ సెటిల్ అవ్వాలి అనుకుంటూ ఉన్న హీరో..!

తాజాగా వస్తున్న రూమర్స్ ప్రకారం, ప్రభాస్ యూరప్‌లో స్థిరపడాలని ఆలోచిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఇటలీలో సెటిల్ అవుతారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. అక్కడ మరో కొత్త ప్రాపర్టీ కొనుగోలు చేయబోతున్నారని కూడా కొన్ని కథనాలు చెబుతున్నాయి. అయితే ఈ విషయంపై ప్రభాస్ లేదా ఆయన టీమ్ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు.

Advertisement

ఇటలీ అంటే ప్రభాస్‌కు ప్రత్యేకమైన ఇష్టం ఉందని చాలామంది చెబుతుంటారు. షూటింగ్ మధ్యలో బ్రేక్ వచ్చినప్పుడు ఆయన అక్కడికి వెళ్లడం ఇష్టపడతారని టాక్ ఉంది. అక్కడి నేచర్, ప్రశాంతత, జీవన విధానం ఆయనకు నచ్చుతాయని అంటున్నారు. ఈ కారణంగా గతంలోనే ఆయన అక్కడ ఒక విల్లా కొనుగోలు చేశారనే వార్తలు కూడా వచ్చాయి.

అంతేకాదు విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. షూటింగ్‌లకు మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు ప్రభాస్ ఆ విల్లాలో కొంత సమయం గడుపుతారని చెబుతారు. మిగతా సమయంలో ఆ ప్రాపర్టీని అద్దెకు ఇస్తారని కూడా వినిపిస్తుంది. అయితే ఈ విషయాలపై ప్రభాస్ ఎప్పుడూ స్పందించలేదు. అందుకే ఇవన్నీ ఇప్పటికీ రూమర్స్‌గానే ఉన్నాయి.

Advertisement

ఇప్పుడు మరోసారి ఇటలీలో కొత్త ఇల్లు కొనబోతున్నారని ప్రచారం రావడంతో, ఆయన అక్కడే సెటిల్ అవుతారనే అనుమానాలు పెరిగాయి. అలాగే, కొన్ని సందర్భాల్లో వైద్య చికిత్స కోసం కూడా యూరప్‌కి వెళ్తారని వినిపించడం ఈ వార్తలకు మరింత బలం ఇస్తోంది.

అయితే నిజానికి ప్రభాస్ పూర్తిగా సినిమాలపై దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఆయన భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఒక్కో సినిమాకు భారీ పారితోషికం తీసుకుంటున్న ఆయన, రియల్ ఎస్టేట్‌లో కూడా పెట్టుబడులు పెడుతున్నారని సమాచారం.

ALSO READ: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ తో మరో సినిమా ప్లాన్ చేస్తున్న హరీష్ శంకర్.. ఇంత సాహసం అవసరమా..!

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×