E-Paper
Advertisement

Kawasaki Ninja 300 Offer: కవాసకీ నింజాపై క్రేజీ ఆఫర్.. 28 వేల తగ్గింపు, ఫ్రీ KYT హెల్మెట్!

Kawasaki Ninja 300 Offer: కవాసకీ నింజాపై క్రేజీ ఆఫర్.. 28 వేల తగ్గింపు, ఫ్రీ KYT హెల్మెట్!
Advertisement

Kawasaki Ninja 300 Discount: కవాసకీ మార్చి 2026 ఆఫర్లలో భాగంగ మరో అదిరిపోయే డిస్కౌంట్ ప్రకటించింది. MY24 నింజా 300 గ్రే కలర్ స్కీమ్‌పై రూ. 28,000 తగ్గింపును ప్రకటించింది. ఇప్పుడు, ఈ తగ్గింపునకు అదనంగా.. వినియోగదారులకు రూ. 8,888 విలువైన అలెక్స్ లోవ్స్ రెప్లికా KYT TT రెవో హెల్మెట్‌ను ఉచితంగా అందిస్తుంది. ఈ ఆఫర్లతో కొనుగోలుదారులను మరింత ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది కంపెనీ.

రైడర్ అలెక్స్ లోవ్స్‌ కు నివాళిగా హెల్మెట్

కవాసకీ KYT హెల్మెట్ ను WSBK రైడర్ అలెక్స్ లోవ్స్‌ కు నివాళిగా రూపొందించబడింది. దీనిపై అతని రేసింగ్ నంబర్ (22), పర్సనలైజ్ గ్రాఫిక్స్, కవాసకి బ్రాండింగ్ ఉంటాయి. ప్రస్తుతం ఉన్న MY24 స్టాక్‌ను క్లియర్ చేయడానికి ఈ ఆఫర్లను ప్రకటించినట్లు కవాసకీ ప్రకటించింది. తాజా తగ్గింపులతో ఈ మోటార్‌ సైకిల్ ధర రూ. 2,89,000 (ఎక్స్-షోరూమ్)గా ఉంది.  అయితే, MY24 నింజా 300 స్టాక్‌లు అన్ని కవాసకి డీలర్‌ షిప్‌ లలో అందుబాటులో ఉండకపోవచ్చు.

ఆఫర్ల కోసం ముందుగా తెలుసుకోండి!

Advertisement

ఒకవేళ మీరు ఈ తగ్గింపు ధరలతో కవాసకీ నింజా 300 కొనుగోలు చేయాలని భావిస్తే, మీ సమీపంలోని డీలర్‌ను సంప్రదించి, వారి దగ్గర మోటార్‌ సైకిల్ స్టాక్‌ మిగిలి ఉన్నాయో? లేదో? తెలుసుకోవాలని కంపెనీ సూచించింది. డిస్కౌంట్లు మినహా, ఈ బైక్ మెకానికల్‌ గా ఎలాంటి మార్పు లేకుండా అందుబాటులో ఉంది. ఇది ఇప్పటికీ అదే 296cc, లిక్విడ్ కూల్డ్, ప్యారలల్ ట్విన్ ఇంజన్‌ తో పని చేస్తుంది. ఈ బైక్ 38.4bhp పవర్, 26.1Nm గరిష్ట టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది.

Read Also: టాటాను వెనక్కి నెట్టిన మహీంద్రా, ఎలక్ట్రిక్ కార్లలో ఇప్పుడు టాప్ మోడల్ ఇదే!

కవాసకీ నింజా 300 మైనస్ లు ఏంటంటే?

Advertisement

నిజానికి కవాసకీ నింజా 300 మోడల్ లో అత్యాధునిక ఫీచర్లు లేవు. ఇది ఇప్పటికీ సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌ తో వస్తుంది. ఇందులో రైడింగ్ ఎయిడ్స్ లేవు. దీనివల్ల, పాత కాలపు రైడింగ్ అనుభవాన్ని కోరుకునేవారు, కవాసకికి వీరాభిమానులైన కొద్దిమంది రైడర్లకు మాత్రమే ఇది ఆకర్షణీయంగా ఉంటుంది. వీలైనంత వరకు ఈ బైక్ కొనే ముందు, లేటెస్ మోడల్ ను పరిశీలించి కొనుగోలు చేయడం మంచిది. అదే సమయంలో కవాసకీలోని ఇతర మోడల్స్ ను కూడా కంపార్ చేయడం ఇంకా బెస్ట్ అంటున్నారు ఆటో నిపుణులు.

Read Also: కొత్త స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్.. ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Related News

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

Big Stories

Advertisement
×