E-Paper
Advertisement

Manchu Manoj: కోడలు విద్యాకు అండగా మను మామ.. భావోద్వేగ పోస్ట్ చేసిన మనోజ్

Manchu Manoj: కోడలు విద్యాకు అండగా మను మామ.. భావోద్వేగ పోస్ట్ చేసిన మనోజ్
Advertisement

Manchu Manoj: మంచు మనోజ్ ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా నటుడిగా ఎంతో బిజీగా గడుపుతున్న మనోజ్ తాజాగా తన అక్క మంచు లక్ష్మి గురించి అలాగే తన మేనకోడలు విద్య నిర్వాణ(Vidya Nirvana) గురించి సోషల్ మీడియా వేదికగా ఒక భావోద్వేగ పోస్ట్ షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇటీవల మంచు లక్ష్మి కూతురు విద్యా నిర్వాణ ఓణీల వేడుకను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ వేడుకలో భాగంగా మంచు మనోజ్(Manchu Manoj) దంపతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

మేనకోడలు పై మనోజ్ ఎమోషనల్ పోస్ట్..

మేనమామగా మంచు మనోజ్ దగ్గరుండి ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా మంచు లక్ష్మి సోదరుడు మంచు విష్ణు దంపతులు వారి పిల్లలు ఎక్కడ కనిపించలేదు. అలాగే మంచు మోహన్ బాబు కూడా ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. తాజాగా మంచు మనోజ్ ఈ వేడుకకు సంబంధించిన వీడియోని తన ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేస్తూ తన అక్క గురించి అలాగే తన మేనకోడలు విద్య నిర్వాణ గురించి చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

దేవుడిచ్చిన వారిలో అక్క ఒకరు..

Advertisement

ఈ సందర్భంగా మంచు మనోజ్ స్పందిస్తూ.. దేవుడు నాకు ఇచ్చిన వారిలో మా అక్క మంచు లక్ష్మి కూడా ఒకరు. అక్క ఎల్లప్పుడూ నాకు ప్రేమ, ఆప్యాయత, తన మద్దతుని, బలాన్ని అందిస్తూనే ఉంది. ఇలా అక్క నుంచి వచ్చిన ప్రేమ ఆప్యాయతలను చూసినప్పుడు నేను కూడా అక్కకు తిరిగి అదే ప్రేమను పంచాలని కోరిక ఉండేది. అయితే మేనకోడలు విద్యా నిర్వాణ మా జీవితంలోకి వచ్చినప్పుడు నాకు అవకాశం లభించింది. తనకు మేనమామగ నా ప్రయాణం మొదలైంది. తనకు మేనమామ అనేది కేవలం బిరుదు మాత్రమే కాదు.. అది మాటలలో చెప్పలేని ఆనందం. తనకి ఎల్లప్పుడు ఒక మేనమామగా దర్శకుడిగా స్నేహితుడిగా ఊహించని ప్రేమను పంచే మను మామగా, అత్త ఎల్లప్పుడూ నీకు అండగా ఉంటారు. నీకు బలంగా, నీకు నిశ్శబ్దంగా నీ వెనకే నిలబడతాం.. లవ్ యూ బంగారు తల్లి అంటూ మనోజ్ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

?igsh=MTU0cHUxdzFjdmU0bA%3D%3D

Advertisement

ఇలా తన మేనకోడలు గురించి మంచు మనోజ్ ఈ పోస్ట్ చేయడంతో ఆయనకు తన అక్క అంటే ఎంత ప్రేమ అనేది స్పష్టమవుతుంది. మంచు మనోజ్ కష్టకాలంలో తన ప్రేమ విషయం ఎప్పటికప్పుడు మంచు లక్ష్మీ పూర్తి స్థాయిలో మద్దతుగా నిలబడుతూ మంచు మనోజ్ కు అండగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక మంచు లక్ష్మి స్వయంగా తన తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయిన భూమా మౌనికతో మంచు మనోజ్ పెళ్లిని ఘనంగా నిర్వహించారు. ఇక మంచు లక్ష్మి కూతురి వేడుకలో మోహన్ బాబు విష్ణు కనిపించకపోవడంతో మరోసారి వీరి కుటుంబంలో చోటు చేసుకున్నటువంటి విభేదాలు తెరపైకి వచ్చాయి. విభేదాలు కారణంగానే మోహన్ బాబు ఈ వేడుకకు దూరంగా ఉన్నారా అంటూ సందేహాలను వ్యక్తపరిస్తున్నారు.

Also Read: Manchu Manoj: కోడలు విద్యాకు అండగా మను మామ.. భావోద్వేగ పోస్ట్ చేసిన మనోజ్

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×