E-Paper
Advertisement

New Movies and Collection : ఒక్క రోజే 15 సినిమాలు రిలీజ్.. మరి కలెక్షన్స్ సింగిల్ డిజిటే

New Movies and Collection : ఒక్క రోజే 15 సినిమాలు రిలీజ్.. మరి కలెక్షన్స్ సింగిల్ డిజిటే

New Movies and Collection : సినిమా వాళ్లకు శుక్రవారం తమ జీవితం ఏంటో తెలిపే రోజు. అన్నీ సినిమాలు శుక్రవారమే రిలీజ్ అవుతాయి. అలా.. ఈ వారం థియేటర్స్‌లో ఏకంగా 15 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో స్టార్ నటీనటులు ఉన్న సినిమాలూ ఉన్నాయి. మరి ఈ 12 సినిమలు కలిసి.. మొదటి రోజు ఎన్ని వందల కోట్ల కలెక్షన్లు తెచ్చిపెట్టాయో ఇప్పుడు చూద్దాం.

15 సినిమాలు రిలీజ్ అయ్యాయి బానే ఉంది. మరి వందల కోట్లు అన్నారు కదా… పైన నిజమేనా అని ఆలోచిస్తున్నారా..? వందల కోట్లు వచ్చేంత పరిస్థితి ఉందా అంటే లేదు. పోని ఈ 15 సినిమాలకు 100 కోట్లు అయినా… వచ్చాయా… అంటే లేదు.

అది కాదు.. తక్కువలో తక్కువ.. 15 సినిమా కాబట్టి కనీసం 10 కోట్లు అయినా వచ్చాయా అంటే… తల అడ్డం ఊపడమే అవుతుంది. పోని 15 సినిమాలు కదా… ఒక్కో సినిమా సగటున అర కోటి లెక్క వేసుకున్నా… 7 కోట్లు అయినా వచ్చాయా అంటే.. ఈ నెంబర్ కి కూడా తలెత్తి ;’YES’ అని చెప్పలేని పరిస్థితి.

అవును మీరు విన్నది నిజమే.. ఈ వారం నవంబర్ 21వ తేదీన సరిగ్గా 15 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ 15 సినిమాలన్నీ కలిపి కనీసం 5 కోట్లు కూడా రాబట్టలేకపోయాయి.

ఈ 15 సినిమాల్లో అల్లరి నరేష్ నటించిన 12A రైల్వే కాలనీ ఉంది. ప్రియదర్శి – ఆనంది నటించిన ప్రేమంటే మూవీ ఉంది. ఈ వారం ఎంతో హైప్ క్రియేట్ చేసిన రాజు వెడ్స్ రాంబాయ్ మూవీ కూడా ఉంది. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేసే రాజు తరుణ్ నటించిన పాంచ్ మీనర్ మూవీ ఉంది. అంతే కాదు.. యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా హీరోగా చేసిన మఫ్టీ పోలీస్ అనే మూవీ కూడా ఉంది. అయినా… 5 కోట్లు కూడా రాలేదు.

క్లైమాక్స్ ట్విస్ట్ అంటూ… రాజు వెడ్స్ రాంబాయ్ మూవీపై నానా హైప్ క్రియేట్ చేశారు. అలాంటి మూవీకి మొదటి రోజు కేవలం 78 లక్షల కలెక్షన్లు మాత్రమే వచ్చాయి. అంత హైప్ క్రియేట్ అయిన మూవీ కనీసం ఒక్క కోటీ రూపాయలు కూడా రాలేదంటే… ఆ సినిమా పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇక సీనియర్ హీరో అల్లరి నరేష్ నటించిన థ్రిల్లర్ మూవీ 12A రైల్వే కాలనీ మూవీపై కూడా గట్టి హోప్సే ఉండేవి. ఆ మూవీ కూడా ఫస్ట్ డే కోటి రూపాయలను కలెక్ట్ చేయడంలో ఫెయిల్ అయింది. ఆ మూవీ మొదటి రోజు 89 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది.

అలాగే కమెడియిన్ నుంచి హీరోగా టర్న్ అయి.. బలగం లాంటి సినిమాలు చేసిన ప్రియదర్శి నుంచి ఈ వారం ప్రేమంటే అనే మూవీ వచ్చింది. ఆ మూవీ ఫస్ట్ అయితే అర కోటి కూడా వసూళ్లు చేయలేదు. ఇది కేవలం 32 లక్షలు మాత్రమే వసూళ్లు చేసి షాక్ ఇచ్చింది. ఈ సినిమాలో స్టాన్ యాంకర్ సుమ కనకాల, స్టార్ కమెడియన్స్ హైపర్ ఆది, ఆటో రాం ప్రసాద్ లాంటి వాళ్లు ఉన్నా.. కలెక్షన్స్ పై ఎలాంటి ప్రభావం చూపలేదు.

రాజ్ తరుణ్ నటించిన పాంచ్ మినార్ మూవీ అయితే… మొదటి రోజు కేవలం 36 లక్షలు మాత్రమే కలెక్ట్ చేసింది. వీటితో పాటు రిలీజ్ అయిన మఫ్టీ పోలీస్, శ్రీమతి 21F, ఇట్లు మీ యెదవ, కలివనం, జనం, ది ఫేస్ ది ఫేసులెస్, మాస్క్, క్షమాపణగాధ, హ్యాపీ జర్నీ లాంటి సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడ్డాయి.

మొత్తంగా ఈ వారం ఈ 15 సినిమాలు కలిసి 4 కోట్ల వరకు కూడా కలెక్షన్లు రాబట్టలేకపోయంటే.. ఆ సినిమాల కంటెంట్ యే రేంజ్‌లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి సినిమాలు చేసి.. థియేటర్స్‌కు రండి అన్నా.. అంటే ‘ఎలా వస్తారు’ అనే మాటలు వినిపించకుండా ఉంటాయా ?

సీనియర్స్ హీరోలు, స్టార్ కాస్ట్ అండ్ క్రూ ఉన్నా.. భారీ బడ్జెట్ పెట్టినా… తక్కువ బడ్జెట్ పెట్టినా.. ఓ సినిమా కావాల్సింది మేలైన కంటెంట్ మాత్రమే. అదే ఉంటే పాజిటివ్ టాక్‌కు కానీ, కలెక్షన్స్‌కి కానీ, ఎలాంటి ఢోకా ఉండదు.

Related News

అభిమానిపై ‘రాకింగ్ స్టార్’ రియల్ ప్రేమా.. క్యాన్సర్ బాధితుడికి వీడియో కాల్ చేసిన యష్!

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

బన్నీ-లోకేష్ కనగారాజ్ సినిమా క్యాన్సిల్ అయిందా? …. అసలు నిజం తెలిస్తే షాకవ్వాల్సిందే!

చరణ్ ‘పెద్ది’ బాక్సాఫీస్ బ్యాటింగ్ స్టార్ట్.. సమంత, వరుణ్ తేజ్ రివ్యూస్ వైరల్.. ‘మెగా 158’ టీమ్ స్పెషల్ విష్

పెద్ది’ రిలీజ్ వేళ రచ్చ.. రామ్ చరణ్ విగ్రహంపై దారుణంగా ట్రోల్స్, క్షమాపణలు చెప్పిన ఫ్యాన్స్!

ఇది కదా క్యారెక్టర్ డెడికేషన్ అంటే! ‘పెద్ది’ గెటప్‌లో రోడ్లపై తిరిగిన జగ్గూభాయ్..

Big Stories

×