E-Paper
Advertisement

Samsung Aurora Max: 16,600mAh బ్యాటరీతో శామ్‌సంగ్ ఆరొరా మ్యాక్స్… టైటానియం ఫ్రేంతో పవర్‌ఫుల్ ఎంట్రీ

Samsung Aurora Max: 16,600mAh బ్యాటరీతో శామ్‌సంగ్ ఆరొరా మ్యాక్స్… టైటానియం ఫ్రేంతో పవర్‌ఫుల్ ఎంట్రీ
Advertisement

Samsung Aurora Max: శామ్‌సంగ్ 2025లో తీసుకొస్తున్న గెలాక్సీ ఆరొరా మ్యాక్స్ అనే ఫోన్‌పై ఇప్పటి నుంచి చాలామంది అంచనాలు పెట్టుకున్నారు. సాధారణ ఫోన్లతో పోల్చితే పూర్తిగా వెరైటీగా, భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చూపిస్తూ వచ్చిన మోడల్‌లా ఇది కనిపిస్తోంది. ఈ ఫోన్ అందించే స్పెసిఫికేషన్స్ చూసిన వెంటనే ఇదే 2025లో బెస్ట్ ఫ్లాగ్‌షిప్ అయ్యే ఛాన్స్ అనిపించేస్తుంది. ఈ ఫోన్‌ని శామ్‌సంగ్ ప్రత్యేకంగా హై-ఎండ్ యూజర్ల కోసం తయారు చేసినట్టు స్పష్టంగా తెలుస్తుంది. పవర్, ప్రీమియం ఫీల్, లాంగ్ టైం యూజ్ కావాలి అనుకునే వారికి ఇది అందరికి సరిపోయేలా డ్రిజైన్ చేసినట్లు అనిపిస్తుంది. శామ్‌సంగ్ ఎప్పుడూ తీసుకొచ్చిన మోడల్స్‌లో ఇదొక అత్యంత అడ్వాన్స్‌డ్ ఆప్షన్‌గా కనిపిస్తోంది.

డిజైన్ .. టైటానియం గ్రేడ్ 5 ఫ్రేమ్‌

Advertisement

ఆరొరా మ్యాక్స్ 2025లో ముందు చూపే విషయం దాని బాడీ డిజైన్. టైటానియం గ్రేడ్ 5 ఫ్రేమ్‌ని ఉపయోగించడం వలన చేతిలోకి తీసుకున్నప్పుడు వచ్చే ఫీలింగ్ పూర్తిగా ప్రీమియం. ఇదే సమయంలో కఠిన పరిస్థితుల్లో కూడా స్ట్రాంగ్‌గా ఉండేలా నిర్మాణం చేశారు. ఇంత ప్రీమియం బాడీతో వస్తున్నా కూడా ఫోన్‌కి ఫీలయ్యే వెయిట్, గ్రిప్ అన్నీ బ్యాలెన్స్‌లో ఉండేలా ఇచ్చిన తీరు ప్రత్యేకంగా అనిపిస్తుంది.

అమోలెడ్ 2ఎక్స్ డిస్‌ప్లే

Advertisement

ఈ డిజైన్‌పై నిలబడే విధంగా ఇచ్చిన స్క్రీన్ కూడా మరో లెవెల్. భారీగా కనిపించే 7.3 అంగుళాల డైనమిక్ ఎల్‌టిపిఓ అమోలెడ్ 2ఎక్స్ డిస్‌ప్లే 4కె రెజల్యూషన్‌తో వస్తోంది. ఈ స్క్రీన్‌లో కలర్స్ షార్ప్‌గా, బ్రైట్నెస్ క్లియర్‌గా, బ్లాక్స్ లోతుగా కనిపించేలా ట్యూన్ చేశారు. పెద్ద స్క్రీన్ ఉన్నా కూడా హోల్డ్ చేసినప్పుడు అసౌకర్యం లేకుండా సన్నగా తయారు చేసిన తీరు గమనించదగ్గది.

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్

ఆరొరా మ్యాక్స్ ప్రధానంగా ఆకట్టుకునే విషయం దాని స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్. ఇవాళ మార్కెట్లో ఉన్న హెవీ గేమ్స్, హై-ఎండ్ అప్లికేషన్స్ అన్నీ ఈ చిప్‌సెట్‌లో చాలా స్మూత్‌గా రన్ అవుతాయి. స్క్రోలింగ్, యాప్ స్విచింగ్, టైమ్ ఎక్సెసివ్ పనులు అన్నీ డిలే లేకుండా సాగిపోతాయి. ఈ చిప్‌సెట్‌తో వచ్చే పవర్‌ను సరిగ్గా ఉపయోగించుకునేలా రామ్ ఆప్షన్స్ కూడా భారీగా ఇచ్చారు.

హై స్పీడ్ ఇంటర్నల్ మెమరీ

24జిబి రామ్ ఆప్షన్ అంటే మొబైల్‌లో ఎన్ని యాప్స్ తెరిచినా, ఎన్ని పెద్ద పనులు చేసినా ఒకటే స్మూత్ ఫ్లో కొనసాగుతుంది. స్టోరేజ్ కూడా 256జిబి, 512జిబి, 1టిబిలా భారీగా ఇచ్చారు. ఎక్స్‌టర్నల్ కార్డ్ ఆప్షన్ లేకపోయినా ఇంటర్నల్ మెమరీ స్పీడ్ చాలా వేగంగా ఉండటం ప్రత్యేకం.

ఇసోసల్ హెచ్‌పి2 సెన్సార్ కెమెరా

ఫోటోలు తీసే వారికి ఈ ఫోన్‌లో ఇచ్చిన సిస్టమ్ మరింత ఆసక్తినిస్తుంది. మెయిన్ కెమెరాలో 200ఎంపి శామ్‌సంగ్ ఇసోసల్ హెచ్‌పి2 సెన్సార్ ఉన్నందున డే లైట్, లో లైట్ అన్నీ టైములలోనూ క్లారిటీ సరిగ్గా రానుంది. దీని పక్కనే 50ఎంపి అల్ట్రా వైడ్, 50ఎంపి పెరిస్కోప్ టెలిఫోటో, 10ఎంపి టెలిఫోటో లెన్సులు ఉన్నందున ఆప్షన్స్ వైడ్‌గా ఉన్నాయి. ఈ లెన్సులతో తీసే ఫోటోలు వివరాలు కోల్పోకుండా రావడం కన్ఫర్మ్. ముందుభాగంలో ఉన్న 50ఎంపి సెల్ఫీ లెన్స్ చూస్తే కంటెంట్ క్రియేటర్స్‌కి ఇది బాగా సెట్ అయ్యేలా ఉంది.

Also Read: Amazon Sale Offer: కళ్లజోడులోనే కెమెరా, మినీ స్పీకర్స్.. రే-బాన్ మెటా ఏఐ గ్లాసెస్‌పై భారీ ఆఫర్..

16,600mAh బ్యాటరీ

ఈ ఫోన్‌లోని అత్యంత ఆకర్షణీయమైన అంశం 16,600mAh బ్యాటరీ. సాధారణంగా ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో కనిపించని సైజ్ ఇది. ఒకసారి ఛార్జ్ చేస్తే చాలా సుదీర్ఘంగా వాడుకునేలా ఉంటుంది. లాంగ్ ట్రావెల్, గేమింగ్, స్ట్రీమింగ్ ఏది చేసినా పవర్ అయిపోయే భయం ఉండదు. వైర్‌లెస్ ఛార్జింగ్ 15Wగా ఉన్నా, డైలీ యూజ్‌లో ఉపయోగించేలా సర్దుబాటు చేయబడింది.

సెక్యూరిటి పరంగా సేఫ్

సెక్యూరిటీ విషయంలో కూడా ఆరొరా మ్యాక్స్ స్పెషల్. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌తో పాటు ఫేస్ అన్‌లాక్, రెటీనా స్కాన్ వంటి భద్రతా లెవెల్‌ను పెంచే ఆప్షన్స్ ఇచ్చారు. ఈ మూడు ప్రొటెక్షన్‌లు కలిసి పనిచేయడం వల్ల ఫోన్‌లో ఉన్న డేటా బలంగా రక్షణ పొందుతుంది.

ఫోన్ కలర్స్ అదుర్స్

కలర్ ఆప్షన్స్ కూడా ప్రీమియం రేంజ్‌కే తగ్గట్టు ఉన్నాయి. టైటానియం బ్లాక్, గ్రే, వైట్ సిల్వర్, సిల్వర్ బ్లూ వంటి శాంతంగా కనిపించే కలర్లలో ఫోన్ అందుబాటులోకి రానుంది.

ఎప్పడు లాంచ్.. ధర ఎంతంటే?

ఈ మోడల్ 2025 చివరలో లాంచ్ అయ్యే అవకాశం ఉందని లీక్స్ సూచిస్తున్నాయి. స్టార్టింగ్ ప్రైస్ 449 డాలర్లుగా ఉండొచ్చు. భారత రూపాయల్లో చూస్తే సుమారు 38,000 రూపాయల వరకూ రావొచ్చు. ఇంత ప్రైస్‌లో ఇంత భవిష్యత్ లెవెల్ స్పెసిఫికేషన్ ఇవ్వడం శామ్‌సంగ్‌కి మరో పెద్ద ప్లస్. 2025లో ఫ్లాగ్ షిప్ రేసులో ఇది మాట్లాడుకునే టాప్ ఫోన్ అవ్వడం ఖాయం. భారీ స్క్రీన్ కావాలి, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ పవర్ కావాలి, 24జిబి రామ్ స్మూత్‌నెస్ కావాలి అంటే ఆరొరా మ్యాక్స్ 2025 మంచి ఆప్షన్‌గా నిలుస్తుంది.

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×