Dragon Movie: అదిగో లుక్ అంటే ఇదిగో లీక్ అన్నట్టుగా సోషల్ మీడియాలో గాసిప్స్ ఎంత సర్క్యులేట్ అయినా నీల్ తారక్ మాత్రం కనీసం ఒక్కటంటే ఒక్క అప్ డేట్ కూడా వదలట్లేదు. దీంతో అసలు డ్రాగన్ షూటింగ్ జరుగుతుందా లేదా అన్న అనుమానాలు పెట్టేసుకున్నారు తారక్ ఫ్యాన్స్. ఒకానొక దశలో సినిమా అసలు ఉందా లేక ఆగిపోయిందా అన్న డౌట్స్ కూడా రైజ్ అయ్యాయ్. నిజానికి RRR తర్వాత సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశంలో ఉండాలి. కాని ఇప్పుడు పరిస్థితి వేరుగా ఉంది. సినిమా అనౌన్స్ చేసి ఏళ్లు గడుస్తున్నా, కనీసం టైటిల్‌ను కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు మూవీ టీమ్.
అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి
మరో వైపు అసలు షూటింగ్ ఎప్పుడు జరుగుతుందో, ఎప్పుడు వాయిదా పడుతుందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. మధ్యలో ప్రశాంత్ నీల్ కథను పూర్తిగా మార్చేశారని, స్క్రిప్ట్ వర్క్ మళ్ళీ మొదటి నుంచి జరుగుతోందనే రూమర్స్ ఈ సినిమాపై ఉన్న నమ్మకాన్ని మరింత దెబ్బతీసేదే. ఇక ఇలాంటి గందరగోళం మధ్య ఎన్టీఆర్ తన బాడీ బిల్డింగ్ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తే.. “అన్నా .. ఆ జిమ్ ఫోటోలు అదిరిపోయాయ్ కాని టీజర్ వదిలితే ఇంకా బాగుంటుంది” అంటూ ఫ్యాన్సే రివర్స్ లో సెటైర్లు వేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
క్యాస్టింగ్ కబుర్లు మాములుగా లేవుగా
ఇదిలా ఉంటే మరోవైపు కాస్టింగ్ రచ్చ మాములుగా లేదు. విషయంలో జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు నుండి మలయాళ స్టార్ టొవినో థామస్ ఎగ్జిట్ ఇచ్చానంటూ తనే అఫీషియల్ గా అనౌన్స్ చేయడంతో కథ నచ్చకే సినిమాని సైడ్ చేశాడా అన్న డౌట్స్ వస్తున్నాయ్. ఇక తాజాగా ఈ పాత్ర కోసం బాలీవుడ్ లవర్ బాయ్ షాహిద్ కపూర్ ని అప్రోచ్ అయ్యారని, అలాగే హీరోయిన్ అలియా భట్ ఈ సినిమాలో ఒక కీ రోల్ పోషిస్తుందన్న టాక్ నెట్టింట్లో హాట్ టాపిక్ అయిపొయింది. పై పెచ్చు తారక్ తో ఆలియాకి స్పెషల్ సాంగ్ ని కూడా ఫిక్స్ చేసేశారు మూవీ లవర్స్.
అయితే సినిమా నుండి ఎలాంటి షూటింగ్ అప్ డేట్ లేకపోయినా, ఇలా క్యాస్టింగ్ కథలు కుప్పలు తెప్పలుగా పుట్టుకురావడం ఆశ్చర్యం. ఇక ఈ సినిమా కథ థాయ్, లావోస్, మయన్మార్ సరిహద్దుల్లోని ‘గోల్డెన్ ట్రయాంగిల్’ మాదకద్రవ్యాల మాఫియా బ్యాక్ డ్రాప్ లో జరుగుతుందని, అందుకే దీనికి ‘డ్రాగన్’ అనే టైటిల్ పెడుతున్నారని నెట్టింట్లో ఆడియన్స్ డిబేట్స్ పెట్టేస్తున్నా ఇప్పటి వరకు అవుననో కాదనో కూడా క్లారిటీ ఇవ్వలేకపోయారు మేకర్స్
మేనెల 20న తారక్ బర్త్ డే సందర్భంగా సినిమా టీజర్?
ఇక ఇవన్ని ఇలా ఉంటే వచ్చే మేనెల 20న తారక్ బర్త్ డే జరగనున్న సందర్భంగా సినిమా టీజర్ వస్తుందని ప్రచారం కాస్త గట్టిగానే జరుగుతుంది. అయితే “టీజర్ సంగతి దేవుడెరుగు.. కనీసం సినిమా టైటిల్ ఏంటో, రిలీజ్ డేట్ ఎప్పుడో చెప్పండి చాలు” అంటూ సెటైర్స్ వేస్తున్నారు నెటిజన్స్. ఏది ఏమైనా ఇంతటి భారీ హైప్ ఉన్న సినిమాకి ఈ రేంజ్ వీక్ పబ్లిసిటీ సినిమా కి నెగెటివీ తెచ్చేదే అంటున్నారు ట్రేడ్ పండిట్స్. చూడాలి మరి డ్రాగన్ టీజర్ ఇప్పటికైనా లోడ్ అవుతుందా లేక ఎప్పటిలాగే పాత పాటే పాడతారో!
also read:రుక్మిణికి మిస్.. సారాకి ఛాన్స్ ! ధనుష్ సినిమాలో ఊహించని ట్విస్ట్