Rajat Patidar: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League Tournament 2026) నేపథ్యంలో ఇవాళ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ ( Royal Challengers Bengaluru vs Lucknow Super Giants) మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. బెంగళూరులోని ఇచ్చిన స్వామి స్టేడియం ( M.Chinnaswamy Stadium, Bengaluru) వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఊహించని షాక్ తగిలింది. బెంగళూరుకు సంబంధించిన ఓపెనర్ విరాట్ కోహ్లీకి వైరల్ ఫీవర్ సోకినట్లు తెలుస్తోంది. ఈ మేరకు బెంగళూరు కెప్టెన్ రజత్ పటిదార్ సంచలన ప్రకటన చేశారు. విరాట్ కోహ్లీకి ( Kohli fever) 105 డిగ్రీల జ్వరం వచ్చిందని.. ప్రస్తుతం మంచానపడ్డాడని రజత్ పటిదార్ ( RCB Captain Rajat Patidar)పేర్కొన్న వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. దీంతో విరాట్ కోహ్లీ ( Virat Kohli) అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ఇలాంటి మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఆడకపోతే, తాము స్టేడియానికి కూడా రాబోమని అంటున్నారు.
Also Read: Akhtar On Naqvi: భూతద్దాలు పెట్టుకోని చూడు..పెట్రోల్ విషయంలో ఇండియా కాలి గోటికి కూడా పాక్ సరిపోదు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్లో భాగంగా ఇవాళ రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య సాయంత్రం ఏడున్నర గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇలాంటి క్రమంలో రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు కెప్టెన్ రజత్ పటిదార్ సంచలన ప్రకటన చేశాడు. విరాట్ కోహ్లీకి 105 డిగ్రీల జ్వరం ఉందని బాంబు పేల్చాడు. అతడు మ్యాచ్ ఆడేది డౌట్ అంటూ అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చాడు రజత్ పటిదార్. ప్రస్తుతం మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న విరాట్ కోహ్లీ, లక్నోపై మ్యాచ్ ఆడబోడని రజత్ పటిదార్ పేర్కొన్నట్లు ఓ పోస్టు వైరల్ గా మారింది. నెక్స్ట్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఆడే అవకాశాలు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియదు కానీ బెంగుళూరు కెప్టెన్ రజత్ పటిదార్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ రెండు వారాలు పూర్తికాగానే విరాట్ కోహ్లీ లండన్ వెళ్లినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విరాట్ కోహ్లీ, ఐపీఎల్ టోర్నమెంట్ నుంచి మధ్యలోనే వైదొలి గాడని అంటున్నారు. మెడికల్ ట్రీట్మెంట్ కోసం గాను లండన్ వెళ్లినట్లు చెబుతున్నారు. ఇందులో కూడా ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరగాల్సిన ఇవాల్టి మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీ ఆడకపోతే, కొత్త ప్లేయర్ రంగంలోకి దిగనున్నాడు. వెంకటేష్ అయ్యర్ ను ఓపెనర్ గా బరిలోకి దించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read: Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వైభవ్ కు కూడా లవ్ స్టోరీ…ఔట్ కాగానే కన్నీళ్లు పెట్టుకుంది కదరా