Dragon NTR Look Leak : ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలందరూ కూడా పాన్ ఇండియా చిత్రాలలో నటిస్తూ వస్తున్నారు. ఈమధ్య హీరోల సినిమాల నుంచి అప్డేట్స్ కన్నా ఆ సినిమాల నుంచి హీరోల లుక్ లీక్ అవుతుంది.. స్టార్ హీరోల సినిమాలు అంటే కచ్చితంగా లీకుల బెడద ఉంటుంది. ఇప్పటికే ఎంతోమంది హీరోల సినిమాల నుంచి లుక్ తో పాటుగా సాంగ్ షూటింగు ఏదో ఒకటి లీక్ అవుతూ వస్తుంది.. మొన్న ప్రభాస్ సినిమా రాజా సాబ్ నుంచి ఆయన లుక్ లీకైంది. తాజాగా గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ నటించిన డ్రాగన్ మూవీ నుంచి ఆయన లుక్ పిక్స్ లీక్ అయ్యాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ లుక్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..
డైరెక్టర్ ప్రశాంత్ నీల్, గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా డ్రాగన్.. ఈ కాంబోలో మూవీ రాబోతున్న నేపథ్యంలో అభిమానులు ఈ సినిమా కోసం ఎంతగానో ఆ ఎదురుచూస్తున్నారు.. కొన్ని ఘటనల కారణంగా సినిమా షూటింగ్ ఆగిపోయిందని వార్తలు కూడా వినిపించాయి.. అయితే ఇప్పుడు మళ్లీ షూటింగ్ మొదలు పెట్టినట్లు తెలుస్తుంది. తాజాగా ఈ మూవీ నుంచి ఎన్టీఆర్ లుక్ లీక్ అయింది. గుబురు గడ్డంతో సిగరెట్ పట్టుకుని, స్లిమ్ బాడీతో స్టైల్గా కారు దగ్గర నిలబడుకున్నట్లు ఆ ఫోటోలు కనిపిస్తుంది.. చూస్తుంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ లవ్ లాగా చాలా స్టైల్ గా కనిపించనున్నట్లు తెలుస్తుంది.. మొత్తానికి ఈ ఫోటోలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. గతంలో ఎన్టీఆర్ చేసిన సినిమాలకు ఈ లుక్ చాలా డిఫరెంట్ గా ఉండడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. మరి స్టోరీ ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో చేయాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
Also Read :నిర్మాతలతో హనుమాన్ డైరెక్టర్ గొడవలు.. ‘జై హనుమాన్’ ఇప్పట్లో రాదా..?
అయితే ఈ డ్రాగన్ మూవీ షూటింగు ఇటీవల ఆగిపోయింది అన్న విషయం తెలిసిందే.. అందుకు కారణం కూడా లేకపోలేదు.. హీరోకి అవుట్ ఫుట్ నచ్చలేదని డైరెక్టర్ తో గొడవకు దిగినట్లు వార్తలు వినిపించాయి. దానివల్ల షూటింగు పోస్ట్ పోన్ అయింది.. అయితే ఇప్పుడు ఈ మూవీ షూటింగు మరో వారంలో పునః ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం. నార్త్ యూరప్ లో భారీ యాక్షన్ సీన్స్ చేసేందుకు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ స్కెచ్ వేశారట. దీంతో విదేశాలకు జూనియర్ ఎన్టీఆర్ వెళ్లబోతున్నారని టాలీవుడ్ టాక్.. రెండు నెలల వరకు ఎన్టీఆర్ అక్కడే ఉంటాడని సమాచారం..మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా రుక్మిణి వసంత్ నటిస్తుంది. ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ రేంజ్ పూర్తిగా మారిపోయింది. ఆ తర్వాత వచ్చిన దేవర సినిమా భారీ హైప్ తో థియేటర్లలోకి వచ్చింది. కానీ ఆ సినిమా అనుకున్న టాక్ ను అయితే సొంతం చేసుకోలేదు.. ఆ తర్వాత వార్ 2 సినిమాతో బాలీవుడ్లోకి ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా కూడా ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేదు.. ప్రస్తుతం తెరకెక్కుతున్న డ్రాగన్ మూవీ పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు సినీ అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు నీకైనా లుక్ అభిమానులని ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ డిఫరెంట్ గా కనిపించబోతున్నాడని తెలుస్తుంది.. మరి ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ అభిమానులని మెప్పించేలా సినిమాను తీస్తాడో లేదో తెలియాల్సి ఉంది..