IPL 2026: ఐపీఎల్ {IPL 2026} కోసం జరిగే వేలానికి ముందు రాజస్థాన్ రాయల్స్ – ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఓ పెద్ద ట్రేడ్ డీల్ పూర్తయినట్లు సమాచారం. గతంలో హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్ కి ట్రేడ్ అయిన సంఘటనను అందరూ గుర్తు చేస్తున్న నేపథ్యంలో.. మరోసారి అలాంటి పెద్ద ట్రేడ్ జరిగినట్లు తెలుస్తోంది. వచ్చే ఐపీఎల్ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు సంజు శాంసన్ గుడ్ బై చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పలు నివేదికలు చెబుతున్నాయి. సంజు శాంసన్ ఢిల్లీ క్యాపిటల్స్ కి మారడం దాదాపు ఖాయం అయినట్లు సమాచారం.
రాజస్థాన్ రాయల్స్ సంజు ని ఢిల్లీ క్యాపిటల్స్ కి ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు క్రీడా విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ విషయంలో ఇరు ఫ్రాంచైజీలు పరస్పర ఒప్పందానికి కూడా వచ్చినట్లు సమాచారం. గత సీజన్ నుంచి రాజస్థాన్ రాయల్స్ నుంచి సంజు వైదొలుగుతున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో సంజుని కొనుగోలు చేయడానికి ఢిల్లీ క్యాపిటల్స్ కూడా చాలా ఆసక్తిగా ఉందని.. కానీ ప్రధాన ఆటగాళ్లను రాజస్థాన్ కి ఇవ్వడానికి ఇష్టపడడం లేదని అంటున్నారు క్రీడా విశ్లేషకులు. సంజు ని ఢిల్లీకి అప్పగించి ప్రతిగా తన పది కోట్ల విలువైన ఆటగాడు ట్రిసాన్ స్టబ్స్ ను రాజస్థాన్ తీసుకోవడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఈ ట్రేడ్ సజావుగా సాగితే తొమ్మిది సంవత్సరాల తర్వాత సంజు తిరిగి ఢిల్లీకి రానున్నట్లు తెలుస్తోంది. గతంలో సంజు శాంసన్ 2016 – 17 సీజన్లలో ఢిల్లీ తరఫున ఆడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఐపీఎల్ నుంచి రాజస్థాన్ రాయల్స్ రెండు సంవత్సరాలు నిషేధించబడింది. ఈ రెండు సంవత్సరాలు సంజు ఢిల్లీ తరఫున ఆడాడు. దీనికి ముందు శాంసన్ రాజస్థాన్ లో భాగంగా ఉన్నాడు. ఇక 2018లో రాజస్థాన్ రాయల్స్ కి తిరిగి వచ్చాడు. ఇప్పుడు శాంసన్ మళ్లీ జట్లను మారుస్తున్నట్లు సమాచారం. 2016లో ఢిల్లీకి ఆడిన సంజు 14 మ్యాచ్ లలో 291 పరుగులు సాధించగా.. 2017లో 14 మ్యాచ్ లలో 386 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ కూడా ఉంది. ఇక 2018 మెగా వేలంలో సంజుని రాజస్థాన్ రాయల్స్ జట్టు కొనుగోలు చేసింది. అప్పటినుండి రాజస్థాన్ లో భాగంగా ఉన్నాడు. తాజాగా సంజుని ఢిల్లీ క్యాపిటల్స్ కి ఇచ్చి ఆ జట్టు నుంచి స్టబ్స్ ని తీసుకోవాలని రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ పట్టుదలతో ఉందని నివేదికలు వచ్చాయి.
Also Read: Smriti mandhana: జమీమా సక్సెస్ చూసి కుళ్ళుకుంటున్న స్మృతి మందాన.. టీమిండియాలో అంతర్యుద్ధం ?
ఢిల్లీ తన తూఫాన్ బ్యాట్స్మెన్లలో ఒకరిని సంజుకి బదులుగా రాజస్థాన్ కి మార్పిడి చేసి.. సౌత్ ఆఫ్రికా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ స్టబ్స్ ని తీసుకోబోతోంది. అతడు రాజస్థాన్ జట్టులో చేరతాడని నివేదికలు సూచిస్తున్నాయి. గత సీజన్ లో ఢిల్లీ తరఫున స్టబ్స్ 50 ఆవరేజ్, 150 స్ట్రైక్ రేట్ తో 300 పరుగులు చేశాడు. దీంతో ఈ ట్రేడ్ బలమైన ఎంపికగా కనిపిస్తుంది. అయితే స్టబ్స్ తో పాటు రాజస్థాన్ రాయల్స్ జట్టు మరో అన్ క్యాప్డ్ ప్లేయర్ ని కూడా చేర్చుకోవాలని కోరుకున్నట్లు సమాచారం. కానీ ఢిల్లీ ఈ డిమాండ్ ని తిరస్కరించిందని నివేదికలు పేర్కొన్నాయి.
🚨 REPORTS 🚨
Sanju Samson is likely to be traded to the Delhi Capitals, while Tristan Stubbs is expected to move to the Rajasthan Royals ahead of IPL 2026. 🏆#Cricket #Sanju #Samson #Sportskeeda pic.twitter.com/rvZIfXn4r7
— Sportskeeda (@Sportskeeda) November 1, 2025