E-Paper
Advertisement

Prasanth Varma : నిర్మాతలతో హనుమాన్ డైరెక్టర్ గొడవలు.. ‘జై హనుమాన్’ ఇప్పట్లో రాదా..?

Prasanth Varma : నిర్మాతలతో హనుమాన్ డైరెక్టర్ గొడవలు.. ‘జై హనుమాన్’ ఇప్పట్లో రాదా..?
Advertisement

Prasanth Varma : టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. గత ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన బ్లాక్ బాస్టర్ చిత్రాల్లో తేజా సజ్జా ప్రధాన పాత్రలో నటించిన హనుమాన్ ఒకటి. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. హనుమాన్ మూవీ కలెక్షన్స్ దాదాపుగా 400 కోట్ల వరకు రాబట్టింది. ఈ సినిమా అసలు స్టోరీని సీక్వెల్ గా రాబోతున్న జై హనుమాన్ సినిమాలో చూస్తారని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఎప్పుడో చెప్పాడు . కానీ ఇప్పటికి ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసినట్లు కనిపించలేదు. కొన్ని నెలల క్రితం ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి కీలక పాత్రలో నటించబోతున్నాడు అంటూ అనౌన్స్ చేశారు. ఆ తర్వాత ఎక్కడ ఈ సినిమా ప్రస్తావన వినిపించలేదు.. ఈ సినిమాని పక్కనపెట్టి వేరే సినిమాలపై డైరెక్టర్ ఫోకస్ చేసినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో కొత్త చర్చ మొదలైంది. అదేంటంటే నిర్మాతలతో ప్రశాంత్ వర్మ గొడవ అంటూ ఓ వార్త సంచలనంగా మారింది. అసలు ఆ గొడవలకు కారణమేంటి? నిర్మాతలతో గొడవపడితే తర్వాత సినిమాలు చేస్తాడా లేదా? అన్న ప్రశ్నల గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..

నిర్మాతలతో ప్రశాంత్ వర్మ గొడవలు..

హనుమాన్ చిత్రం భారీ విజయాన్ని అందుకోవడంతో ఎక్కువ మంది నిర్మాతలు ప్రశాంతవర్మతో సినిమా చేసేందుకు ముందుకు వచ్చారు. మా బ్యానర్ లో సినిమా చేయాలి అంటూ బంపర్ ఆఫర్లు ఇచ్చారు. చాలామంది నిర్మాతలు ఆయనకు డబ్బులు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పటివరకు ఏ బ్యానర్ లోనో సినిమాలు ప్రకటించలేదు. నిరంజన్ రెడ్డి, సుధాకర్ చెరుకూరి, డి.వి.వి.దానయ్య, మైత్రీ మూవీ మేకర్స్‌, హంబలే ఫిల్మ్స్‌.. ఇలా పేరున్న సంస్థలే ప్రశాంత్ని నమ్మాయి. కోరినంత అడ్వాన్సులు ఇచ్చాయి. కొత్త నిర్మాతల సంగతైతే లెక్కే లేదు. ఆ అడ్వాన్సులు అన్నీ కలుపుకొన్నా దాదాపు రూ 80 నుంచి రూ.100 కోట్ల వరకూ ఉంటాయి. ఇంతమందితో ఒకేసారి సినిమా అంటే కష్టమే. అయితే అందరి దగ్గర డబ్బులు తీసుకున్న డైరెక్టర్.. నేను డైరెక్టర్గా చెయ్యను కానీ దర్శకత్వం పరివేక్షణ చేస్తాను. వేరే వాళ్ళు ఈ సినిమాను డైరెక్ట్ చేస్తాడు అంటూ నిర్మాతలకు ఆప్షన్ లో ఇస్తున్నాడట. అది నిర్మాతలకు నచ్చలేదు. దాంతో వర్మనే సినిమా చేయాలి అంటూ పట్టు పట్టి కూర్చున్నారు. అలా చేయలేని పక్షంలో మా దగ్గర తీసుకున్న అడ్వాన్స్ అమౌంట్లను వెంటనే తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు సినీ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవైపు నిర్మాతలతో పెద్ద రచ్చ జరుగుతున్నా సరే ప్రశాంత వర్మ మాత్రం మౌనంగా ఉండటం అందరినీ ఆలోచనలో పడేస్తుంది. ఎందుకు ప్రశాంత్ వర్మ ఇలా చేస్తున్నాడు? నిర్మాతలకు మాటివ్వడం డబ్బులు తీసుకోవడం అంతా బాగానే ఉంది ఇప్పుడు మాత్రం మౌనం ఎందుకు వహిస్తున్నాడు అని జనాల్లో కూడా ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Also Read : మీనాక్షి కోసం చక్రధర్ వేట.. పల్లవికి కరెంట్ షాక్.. మీనాక్షిని చంపేయ్యాలని ప్లాన్..?

‘జై హనుమాన్’ మూవీ లేనట్టే..? 

ప్రశాంత్ వర్మ తెలుగులో దర్శకత్వం వహించాల్సిన సినిమా జై హనుమాన్. హనుమాన్ మూవీ రిలీజ్ అయ్యి రెండేళ్లు అవుతున్న కూడా ఇంకా జై హనుమాన్ సినిమాకు కొబ్బరికాయ కొట్టలేదని తెలుస్తుంది. ఈ సినిమా కన్నా ముందు మరికొన్ని సినిమాలు చేయాలి అని ఆయన అనుకున్నారని ఓ వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది. అనుకున్నట్లుగానే కొన్ని సినిమాలను ప్రకటించాడు. వాటి రిజల్ట్ మాత్రం ఇంతవరకు బయట పెట్టలేదు. మరి జై హనుమాన్ షూటింగ్ ఎప్పుడు మొదలు పెడతారు అని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఆమధ్య స్క్రిప్టు పూర్తి అయ్యిందని ఓ పోస్ట్ చేశాడు. అలాగే రిషబ్ శెట్టి ఇందులో కీలక పాత్రలో నటించబోతున్నాడు అంటూ మరో పోస్టర్ని రిలీజ్ చేశారు. అదే ఈ సినిమా నుంచి వచ్చిన చివరి అప్డేట్. ప్రస్తుతం ఈ మూవీ ఎలా ఉంది? షూటింగ్ ఇప్పటిలో మొదలవుతుందా లేదా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం నిర్మాతలతో గొడవలు కారణంగా ఈ సినిమా ఇక లేనట్టే అంటూ మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఏది ఏమైనా ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరకాలంటే డైరెక్టర్ ప్రశాంత్ వర్మ నోరు విప్పాల్సిందే.. ఈయన ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి..

Related News

‘గాడ్ ఆఫ్ వార్’లో ఎన్టీఆర్‌తో నటించే హీరోయిన్ ఎవరో తెలుసా ?

ఐశ్వర్య రాజేష్ మొరను ఆలకించిన డైరెక్టర్.. బాలయ్య మూవీలో క్రేజీ రోల్!

‘విక్రమ్ 1’ ర్యాకెట్ ప్రయోగంలో జబర్దస్త్ సత్యశ్రీ చెల్లి కీలక పాత్ర.. ఆ ఫొటోలు షేర్ చేస్తూ నటి ఎమోషనల్!

నటిగా పీవీ సింధు.. ఆసక్తిని రేకెత్తిస్తున్న పోస్ట్!

చిన్న వయసులోనే గొప్ప మనసు చాటుకున్న సితార.. మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్!

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

Big Stories

Advertisement
×