OG 2 :అత్తారింటికి దారేది వంటి ఇండస్ట్రీ హిట్ పవన్ వరుసగా గోపాల గోపాల,సర్దార్ గబ్బర్ సింగ్ ,కాటమరాయుడు,అజ్ఞాతవాసి,వకీల్ సాబ్,భీమ్లా నాయక్,బ్రో,హరిహర వీరమల్లు అంటూ ఏకంగా ఎనిమిది సినిమాలు చేశాడు కానీ ఇదీ నా సాలిడ్ హిట్ అంటూ ఒక్క సినిమాని కూడా కాన్ఫిడెంట్ గా చెప్పలేకపోయాడు పవన్.
ఇక అభిమానులు కూడా సినిమా రిలీజ్ అయ్యాక ఆహ, ఓహో అనడమే కాని ఆ తర్వాత ఇదీ మా హీరో బ్లాక్ బస్టర్ అని ఒక్కటీ చెప్పుకొని పరిస్థితి. సినిమా వచ్చినప్పుడు నానా హంగామా చేయడమే తప్ప లాంగ్ రన్ , కాని పవన్ స్టామినాకి తగ్గట్టుగా వసూల్లని కొల్లగొట్టిన సినిమా ఒక్కటీ లేకుండా పోయింది.
అదిగో సరిగ్గా అ సమయంలో దిగాడు OG. ఓజాస్ గంభీర ఆలియాస్ మాస్టర్ ఒరోచి గెన్షిన్ అంటూ వచ్చిన పవన్ తన స్టామినా ఏంటో బాక్సాఫీస్ కి మరోసారి రుచి చూపించాడు.తనకి సరైన సినిమా గనుక పడితే వసూళ్ళ వర్షం ఇలా ఉంటుందా అంటూ ఏకంగా 300కోట్ల పై చిలుకు వసూల్లతో ట్రేడ్ వర్గాలని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. రన్ రాజా రన్ వంటి సూపర్ హిట్ తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సుజిత్ సాహో సినిమాతో పర్లేదనిపించినప్పటికీ “OG”సినిమాతో తన టేకింగ్ లో తిరుగు లేదంటూ ప్రూవ్ చేసుకున్నాడు.
గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా అభిమానులతో పాటు అందరికి పిచ్చిపిచ్చిగా నచ్చేయడం, పైగా సినిమా చివర్లో దీనికి సీక్వెల్ ఉంటుందని హింట్ ఇవ్వడంతో రెండో భాగం ఎప్పుడొస్తుందా అంటూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్.పైగా సినిమా ఖచ్చితంగా ఉండి తీరుతుందని పవన్ ఫుల్ క్లారిటీ ఇవ్వడం,పైగా సుజిత్ చేయాలనుకున్న బ్లడీ రోమియో అతీగతీ లేకపోడంతో ఈ సినిమా ఈ ఇయర్ లో సెట్స్ పైకి వెళ్ళడం పక్కా అని ఫిక్స్ అయిపోయారంతా.
ఇక సోషల్ మీడియాలో ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమాని హాలీవుడ్ లో తెరకెక్కించే యాక్షన్ ప్రాంచైజీగా డిజైన్ చేస్తున్నారని తెలుస్తుంది.ఇందులో భాగంగానే మొదటి భాగంలో గంభీర క్యారెక్టర్ ని పూర్తిగా రివీల్ చేయకుండా సస్పెన్ లో ఉంచారట మేకర్స్. ఇక ప్రస్తుతం తెరకెక్కించే ఓజి 2లో గంభీర అసలెందుకు గ్యాంగ్ స్టర్ గా మారాల్సి వచ్చింది, అతడి జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటనలు ఏంటి వంటి ఎన్నో ఆసక్తికరమైన ప్రశ్నలకి సుజిత్ సమాధానం చెప్పబోతున్నాడట.
అయితే ఈ సినిమాపై వినిపిస్తున్న మరో క్రేజీ న్యూస్ ఏంటంటే దీన్ని ఒక ప్రాంచైజీగా మాత్రమే కాకుండా ఒక క్రేజీ సినిమాటిక్ యూనివర్స్ గా సుజిత్ మార్చబోతున్నాడని వినిపిస్తుంది.ఈ క్రమంలోనే గతంలో సుజిత్ దర్శకత్వంలో వచ్చిన సాహో లోని అండర్ వరల్డ్ కి , ఓజి లోని గ్యాంగ్ స్టర్ ప్రపంచానికి లింక్ చేయబోతున్నాడని, ఈ క్రమంలోనే పవన్ , ప్రభాస్ ఇద్దరు కలిసి విలన్ గ్యాంగ్స్ పై ఎటాక్ చేయబోతున్నారన్న టాక్ వినిపిస్తుంది.
ఒకవేళ అదే నిజమైతే మాత్రం అటు రెబలోడి ఫ్యాన్స్ కి, ఇటు పవర్ స్టార్ ప్యాన్స్ కి అదొక మాంచి ఐఫీస్ట్ అవుతుంది అనడంలో ఆశ్చర్యం లేదు.తెలుగులో ఇప్పటి వరకూ రాని ఈ తరహ సీరియస్ యూనివర్స్ ని సుజిత్ తెరకెక్కిస్తే మాత్రం టాలీవుడ్ లో అదొక హిస్టారికల్ మూమెంట్ అనే చెప్పాలి.
also read :నాని ‘ప్యారడైజ్’ అసలు కథ ఇదేనా?
చూడాలి మరి ఈ రోజు పవన్ బర్త్ డే సందర్భంగా ఈ క్రేజీ సినిమాటిక్ యూనివర్స్ పై సుజిత్ ఏమైనా నోరు విప్పుతాడేమో!