E-Paper
Advertisement

నాని ‘ప్యారడైజ్’ అసలు కథ ఇదేనా?

నాని ‘ప్యారడైజ్’ అసలు కథ ఇదేనా?
Advertisement

The Paradise Story:ది ప్యారడైజ్ ..నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ ఫిలిమ్.ఇదివరకే వీరిద్దరి కాంబోలో వచ్చిన దసరా సినిమా ఊహించని వసూళ్లు సొంతం చేసుకుని ఏకంగా వంద కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఇక సినిమా ఏకంగా 150 కోట్ల పై చిలుకు బడ్జెట్ తో తెరకెక్కుతుందన్న వార్తలు రావడం, సినిమాలో మోహన్ బాబు, రాఘవ్ జుయాల్, సంపుర్నేష్ బాబు వంటి క్రేజీ స్టార్ నటిస్తుండటంతో సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు మూవీ లవర్స్.ఇక ఈ క్రమంలో సినిమా కథ ఇదేనా అంటూ ఒక క్రేజీ స్టోరీ ఇపుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.ఇంతకీ చక్కర్లు కొడుతున్న ఆ ఫ్యారడైజ్ కథ ఏంటో మనమూ చూసేద్దాం.

శికంజా మాలిక్ అనే ఒక క్రూరుడి చేతిలో

Advertisement

సినిమా కథ విషయానికి వస్తే ఇది 1980లో సికింద్రాబాద్ బ్యాక్ డ్రాప్ లో జరగనునట్టు తెలుస్తుంది.అక్కడ ఉండే ప్యారడైజ్ అనే ఒక మురికివాడలో కొన్ని వేల మంది బతుకుతుంటారు,కానీ వారెవరికీ అక్కడ ఎలాంటి హక్కులు ఉండవు.కారణం వారంతా ఒకప్పుడు అక్కడికి వలస వచ్చినవారే.

ఇక ప్రదేశం అంతా శికంజా మాలిక్ అనే ఒక క్రూరుడి చేతిలో ఉంటుంది.అతను చెప్పిందే అక్కడ వేదం.ఇక అతడి కొడుకైన విక్రం మాలిక్ చిన్నవాడైనా కూడా ఆ ప్రాంతంపై అజమాయిషీ చేసేవాడే.మొత్తంగా అక్కడు వారి భయాన్ని, ఆకలిని అడ్డం పెట్టుకుని అదే తమ బలంగా ఆ ప్రాంతాన్ని ఏలుతుంటారు.

ఏ గొడవ జరిగినా మనకెందుకు అనుకునే రకం

Advertisement

ఇక అక్కడే ఒక మురికివాడలో జడల్ తన తల్లితో కలిసి జీవిస్తూ ఉంటాడు.అక్కడ ఏ గొడవ జరిగినా మనకెందుకు అనుకునే రకం జడల్.అలాంటి జడల్ కి జరిగిన ఒక దారుణమైన సంఘటన కారణంగా అతను మారాల్సి వస్తుందట.శికంజా మాలిక్ ఒక కార్పోరేట్ కంపెనీకి ఇచ్చిన మాటలో భాగంగా జడల్ నివసిస్తున్న ప్రాంతాన్ని నేలమట్టం చేస్తాడట.అంతే కాకుండా, జడల్ తల్లిని ఘోరంగా అవమానించడం జడల్ సహించలేకపోతాడట.దాంతో ఎదురు తిరిగిన జడల్ ని చావబాదుతారట అక్కడ ఉన్న .శికంజా మాలిక్ మనుషులు.

దాంతో అప్పుడే డిసైడ్ అవుతాడట జడల్. ఏ ప్రదేశంలో తను అవమానానికి గురయ్యాడో, ఎక్కడ తన తల్లిని అవమానించారో అక్కడే తన సత్తా చూపించాలని ఫిక్స్ అవుతాడట.ఇక .శికంజా మాలిక్ మనుషులు అక్కడున్న వారందరినీ కాకులు అని పిలవడంతో ఆ కాకి గుర్తునే తమ గుర్తుగా మార్చుకుని పోరుకి సిద్దమవుతారట.

అప్పుడే వస్తుందట ఆయా షేర్ పాట.ఇక ఇందులో సుబ్బలక్ష్మి పాత్రలో నటిస్తున్న హీరోయిన్ కయాదు లోహార్ జర్నలిస్ట్ గా జడల్ కి సహాయం చేసే క్రమంలో వారిద్దరూ ప్రేమలో పడతారట.

వారిపై తిరుగుబాటు చేయడంమే

ఇక శికంజా మాలిక్ మీద జడల్ చేస్తున్న పోరాటంలో భాగంగా ఒకసారి అనుకోకుండా ఆ ప్రాంతం తమ పూర్వీకులకే సంబంధించిందని,ఆ ప్రాంతంపై శికంజా మాలిక్ కి అసలు ఎలాంటి హక్కులు లేవని,కేవలం తమ తాతలని మోసం చేసి దాన్ని కబ్జా చేశారని తెలుసుకున్న జడల్ ఆ ప్రాంతం కోసమే కాకుండా,తమ హక్కుల కోసం అక్కడి వారందరినీ ఒక జట్టుగా ఏర్పర్చుకుని వారిపై తిరుగుబాటు చేస్తాడట.

ఇక బిర్యాని అనే పాత్ర పోషిస్తున్న సంపూర్నేష్ బాబు ఒక సమయంలో జడల్ కి వెన్నుపోటు పోడుస్తాడని,కాని చివరికి అతడినే నాని కాపాడాల్సి వస్తుందట.

జడల్ తిరిగి మారడమే సినిమా కథ

ఇక ఇంటర్వెల్ సమయానికి రక్తాన్ని ఏరులైపాలించిన జడల్ ఆ ప్యారడైజ్ ప్రాంతానికి ఒక ఎదురులేని నాయకుడిగా మారతాడట.ఇక ఈ మధ్య సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ఏషనాగుల అనే పాట ప్యారడైజ్ ప్రాంతాన్ని జడల్ సొంతం చేసుకున్న సమయంలో వస్తుందని వినిపిస్తుంది.

also read :మల్లెపూలపల్లకి పాటకి ముట్టింది ఎంతో తెలుసా ?

అయితే నాయకుడు అయ్యి అధికారం చేతిలోకి వచ్చాక జడల్ కూడా మెల్లిగా శికంజా మాలిక్ లా మారిపోయేలా పరిస్థితులు దారి తీస్తాయట.అలా ఒకప్పుడు అణిచివేతకి గురైన జడల్ క్రమంగా అణచి వేసే శక్తి గా ఎదుగుతాడట. అయితే చివరలో తల్లి మాటలని గుర్తు చేసుకున్న జడల్ తిరిగి మారడమే సినిమా కథ అని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది.చూడాలి మరి ఈ స్టోరీ వెనుక అసలు నిజమేంటో మేకర్స్ ఏమైనా బయట పెడతారేమో !

Tags

Related News

సాహో ప్రపంచంలోకి ఓజీ..? ఏం ప్లాన్ చేస్తున్నావ్ సుజిత్ ?

మీరే నాకు స్ఫూర్తి… బాబాయ్ కు అబ్బాయ్ విషెస్!

ఒంటిమీద బట్టలు లాగేసి ఘోరంగా అవమానించారు – స్టార్ కమెడియన్ ఎమోషనల్!

పవన్ అభిమాని మృతి..గొప్ప మనసు చాటుకున్న ఎస్కేఎన్!

రజనీకాంత్ జైలర్ 2 వాయిదాపై మేకర్స్ క్లారిటీ..వెనక్కి తగ్గేదేలే!

ప్రభాస్ తో సుమంత్ ప్రభాస్.. ఒక్కమాటతో రియల్ క్యారెక్టర్ రివీల్!

నేపాల్ విధ్వంసం.. రంగంలోకి సోనూసూద్.. ప్రజలకు విజ్ఞప్తి!

Big Stories

Advertisement
×