E-Paper
Advertisement

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?
Advertisement

2027 Tata Nexon Project Garud: కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో టాటా నెక్సాన్‌కు ప్రత్యేకమైన స్థానం ఉంది. 2017లో మార్కెట్లోకి వచ్చిన ఈ SUV ఇప్పటికే రెండుసార్లు పెద్ద అప్‌డేట్లను అందుకుంది. ఇప్పుడు టాటా మోటార్స్ మరోసారి నెక్సాన్‌ను పూర్తిగా మార్చేందుకు సిద్ధమవుతోంది. కొత్త తరం నెక్సాన్‌ను కంపెనీ ‘ప్రాజెక్ట్ గరుడ్’ పేరుతో అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త మోడల్ 2027లో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. కొత్త నెక్సాన్‌ లో డిజైన్ నుంచి టెక్నాలజీ, పవర్‌ట్రెయిన్ వరకు పలు కీలక మార్పులు ఉండనున్నాయి.

మరింత బాక్సీగా కొత్త డిజైన్

ప్రస్తుత నెక్సాన్‌కు కూపే తరహా డిజైన్ ఉంది. అయితే, కొత్త తరం మోడల్‌ లో టాటా మరింత నిటారుగా, బాక్సీగా ఉండే డిజైన్‌ ను తీసుకురావచ్చని తెలుస్తోంది. ఇప్పటికే కనిపించిన టెస్ట్ వాహనాల్లో A-పిల్లర్, C-పిల్లర్, వెనుక విండ్‌ స్క్రీన్ ప్రాంతాల్లో మార్పులు కనిపించాయి. వెనుక భాగం మరింత నిటారుగా ఉండటం వల్ల కారు లోపల హెడ్‌ రూమ్ పెరగడంతో పాటు క్యాబిన్ మరింత విశాలంగా అనిపించే అవకాశం ఉంది.

పూర్తిగా కొత్త క్యాబిన్

Advertisement

కొత్త నెక్సాన్‌లో ఇంటీరియర్ కూడా ప్రస్తుత మోడల్‌తో పోలిస్తే భారీగా మారే అవకాశం ఉంది. కొత్త డ్యాష్‌బోర్డ్ డిజైన్, అప్‌డేటెడ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కనెక్టెడ్ కార్ ఫీచర్లు ఇందులో ఉండవచ్చు. టాటా న్యూ జెనరేషన్ SUVలలో అందిస్తున్న ఆధునిక డిజైన్, టెక్నాలజీని నెక్సాన్‌లో కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది.

పెట్రోల్, CNGకి ప్రాధాన్యం

కొత్త నెక్సాన్‌లో పెట్రోల్, CNG ఆప్షన్లు కొనసాగుతాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఇందులో 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది 120hp పవర్, 170Nm టార్క్‌ను అందిస్తుంది. టర్బోCNG వెర్షన్ కూడా సుమారు 100hp, 170Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. దీంతో రోజువారీ వినియోగదారులకు ఇంధన ఖర్చును తగ్గించుకునే అవకాశం ఉంటుంది.

డీజిల్‌కు గుడ్‌బై చెప్పే ఛాన్స్

Advertisement

కొత్త నెక్సాన్‌లో డీజిల్ ఇంజన్ కొనసాగుతుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఉన్న 1.5 లీటర్ డీజిల్ ఇంజన్‌ను భవిష్యత్ పొల్యూషన్ నిబంధనలకు అనుగుణంగా మార్చాలంటే ఖర్చు పెరిగే అవకాశం ఉంది. అందుకే టాటా పెట్రోల్, CNGతో పాటు కొత్త ఎలక్ట్రిఫైడ్ పవర్‌ట్రెయిన్‌లపై దృష్టి పెట్టవచ్చని తెలుస్తోంది.

గేర్‌బాక్స్ ఆప్షన్లలో మార్పులు

ప్రస్తుతం నెక్సాన్ మాన్యువల్, AMT, DCT గేర్‌ బాక్స్‌ లతో లభిస్తోంది. కొత్త తరం మోడల్‌లో కూడా వివిధ ట్రాన్స్‌ మిషన్ ఆప్షన్లను కొనసాగించే అవకాశం ఉంది. అయితే ఈసారి కేవలం పవర్ పెంచడంపైనే కాకుండా మైలేజ్, డ్రైవింగ్ సౌకర్యం, రిఫైన్‌మెంట్, రోజువారీ వినియోగంపై టాటా ఎక్కువగా దృష్టి పెట్టవచ్చు.

పోటీ మరింత పెరిగిన వేళ..

నెక్సాన్‌ కు ప్రస్తుతం మహీంద్రా XUV 3XO, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, స్కోడా కైలాక్ లాంటి మోడళ్ల నుంచి గట్టి పోటీ ఉంది. అందుకే కొత్త నెక్సాన్‌లో కేవలం డిజైన్ మార్పులు కాకుండా స్పేస్, టెక్నాలజీ, సామర్థ్యం, డ్రైవింగ్ లోనూ కీలక మార్పులు తీసుకురావాలని భావిస్తోంది.

Read Also: టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

Tags

Related News

విడా నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. జస్ట్ 100 యూనిట్లే!

కొత్త రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ వచ్చేసింది, మైలేజ్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 హైపర్‌ షిఫ్ట్ విడుదల.. ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

ఆడి Q3 అదిరిపోయే ఎంట్రీ.. సేఫ్టీ ఫీచర్లు చూస్తే షాకవ్వాల్సిందే!

టీఎఫ్‌టీ డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్.. హీరో ఎక్స్‌ ట్రీమ్ 250ఆర్ కార్బన్ అదిరింది గురూ!

ఇండియన్ మార్కెట్ లో ఇక ఈ కారు కనిపించదు, MG ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందంటే?

హీరో ఎక్స్‌ ట్రీమ్ 160R 4V కొత్త మోడల్ వచ్చేసింది, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

హోండా 0 ఆల్ఫా SUV లాంచ్ డేట్ ఫిక్స్.. రేంజ్, ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×