E-Paper
Advertisement

Top 10 Heroins : ఈ ఏడాది తోపు హీరోయిన్లు వీళ్లే.. టాప్‌లో ఎవరున్నారో తెలుసా..?

Top 10 Heroins :  ఈ ఏడాది తోపు హీరోయిన్లు వీళ్లే.. టాప్‌లో ఎవరున్నారో తెలుసా..?
Advertisement

Top 10 Heroins: ప్రముఖ మార్కెట్ రీసెర్చ్ సంస్థ ఓర్మాక్స్ మీడియా నవంబర్ 2025 నెలకు గాను విడుదల చేసిన ‘మోస్ట్ పాపులర్ ఫీమేల్ స్టార్స్’ జాబితా ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరి హవా కొనసాగుతోంది? ఎవరి గ్రాఫ్ పడిపోయింది? అనే విషయాలపై ఈ సర్వే ఒక స్పష్టతనిచ్చింది.

సమంత నంబర్ 1:
వరుసగా రెండోసారి కూడా సమంత రుత్ ప్రభు అగ్రస్థానాన్ని కైవసం చేసుకుని తన రేంజ్ ఏంటో నిరూపించుకుంది. కేవలం నటిగానే కాకుండా నిర్మాతగా, ఓటీటీ స్టార్‌గా సత్తా చాటుతున్న సామ్.. తాజాగా దర్శకుడు రాజ్ నిడిమోరును వివాహం చేసుకుని వార్తల్లో హాట్ టాపిక్‌గా నిలిచింది. కంటెంట్ ఉన్న పాత్రలను ఎంచుకుంటూ ఆమె సాగిస్తున్న ప్రయాణం ఆమెను ఇండియాలోనే మోస్ట్ పాపులర్ స్టార్‌గా నిలబెట్టింది.

Advertisement

రష్మికకు తప్పని నిరాశ
బాలీవుడ్‌లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న ఆలియా భట్ రెండో స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. అయితే నేషనల్ క్రష్ రష్మిక మందన్నాకు మాత్రం ఈ నెల కొంచెం నిరాశే ఎదురైంది. గతంలో టాప్ 2లో ఉన్న రష్మిక, ఈసారి మూడో స్థానానికి పడిపోయింది. 2026లో రాబోయే పాన్ ఇండియా ప్రాజెక్టులతో మళ్ళీ నంబర్ వన్ రేసులోకి రావాలని రష్మిక ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

 

Shambala Movie : ‘శంబాల’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..అనుకున్న సమయం కంటే ముందుగానే

Advertisement

40 ప్లస్ బ్యూటీల హవా
ఈ జాబితాలో మరో విశేషం ఏమిటంటే.. 40 ఏళ్లు దాటినా త్రిష (5వ స్థానం), నయనతార (7వ స్థానం) తమ క్రేజ్‌ను కాపాడుకుంటూ కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తున్నారు. ఇక ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తర్వాత వెండితెరపై పెద్దగా కనిపించని అనుష్క శెట్టి పదో స్థానంలో నిలిచి తన ఫ్యాన్ బేస్ చెక్కుచెదరలేదని నిరూపించింది.

ఓర్మాక్స్ టాప్ 10 ఫీమేల్ స్టార్స్
1. సమంత
2. ఆలియా భట్
3. రష్మిక మందన్నా
4. కాజల్ అగర్వాల్
5.త్రిష
6. దీపికా పడుకోన్
7. నయనతార
8. సాయి పల్లవి
9. శ్రీలీల
10. అనుష్క శెట్టి

Related News

పవన్ ఫ్యాన్స్‌కి పూనకాలే.. OG యూనివర్స్ నుంచి అదిరిపోయే ట్రీట్!

‘రోమాంచకం’కు రెండో రోజే షాక్.. కలెక్షన్లు ఇలా పడిపోయాయేంటి?

డాన్సర్స్ అసోసియేషన్‌లో మళ్లీ రచ్చ.. సుమలతపై రఘు మాస్టర్ కౌంటర్!

డ్రాగన్ పై ప్రశాంత్ నీల్ బిగ్ అప్డేట్…స్పీడుమీదున్న తారక్!

ఏంటి నాని.. ఇంత హైప్ అవసరమా? ‘ది ప్యారడైజ్’పై అప్పుడే డౌట్స్!

సినిమాలోనే మ్యాజిక్ ఉంది…ఆకట్టుకుంటున్న ఎపిక్ ట్రైలర్!

రూ.10 లక్షల ఇన్సూరెన్స్.. రూ.5 వేల పెన్షన్.. నట్టి కుమార్ ఆఫర్ ఇదే!

సమ్మర్ హీట్‌లో ప్రగ్యా జైస్వాల్ స్పెషల్ ట్రీట్.. నెట్టింట వైరల్!

Big Stories

Advertisement
×