E-Paper
Advertisement

Aravalli Mining: మోదీ సర్కార్ కీలక నిర్ణయం.. ఆరావళి మైనింగ్‌పై వెనక్కి తగ్గిన కేంద్రం..

Aravalli Mining: మోదీ సర్కార్ కీలక నిర్ణయం.. ఆరావళి మైనింగ్‌పై వెనక్కి తగ్గిన కేంద్రం..
Advertisement

దేశంలోనే అత్యంత పురాతనమైన పర్వత శ్రేణులుగా పేరుగాంచిన ఆరావళి పర్వతాలను కాపాడుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆరావళి పర్వత ప్రాంతాల్లో కొత్త మైనింగ్ లీజులపై కేంద్ర పర్యావరణ, అటవీ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ సంపూర్ణ నిషేధం విధిస్తూ సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. గుజరాత్ నుంచి ఢిల్లీ వరకు విస్తరించి ఉన్న ఈ మొత్తం పర్వత ప్రాంతాన్ని ఇకపై రక్షిత జోన్ గా పరిగణించనున్నారు.

గత కొన్ని దశాబ్దాలుగా ఆరావళి ప్రాంతంలో సాగుతున్న అక్రమ మైనింగ్ కార్యకలాపాల వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పర్వత శ్రేణులు ఎడారీకరణను అడ్డుకోవడంలోనూ, భూగర్భ జలాల పునరుద్ధరణలోనూ కీలక పాత్ర పోషిస్తాయి. మైనింగ్ వల్ల పర్వతాలు కనుమరుగైపోతుండటంతో.. వన్యప్రాణుల ఆవాసాలు ధ్వంసమవడమే కాకుండా, ఢిల్లీ వంటి నగరాల్లో కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో పర్యావరణ సమగ్రతను కాపాడేందుకు కేంద్రం ఈ కఠిన చర్యలు చేపట్టింది.

Advertisement

ఆరావళి పర్వతాల రక్షణ కోసం సోషల్ మీడియాలో ‘SAVE ARAVALI’ పేరుతో పెద్ద ఎత్తున క్యాంపెయిన్ జరిగిన విషయం తెలిసిందే. పర్యావరణ ప్రేమికులు, స్వచ్ఛంద సంస్థలు, సామాన్య ప్రజలు ఏకమై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. వేలాది మంది ప్రజలు ఈ క్యాంపెయిన్‌లో పాల్గొని, పర్వతాల వినాశనాన్ని ఆపాలని కోరారు. ప్రజల నుంచి వచ్చిన భారీ స్పందన, కోర్టుల హెచ్చరికల నేపథ్యంలో కేంద్రం సానుకూలంగా స్పందించి, మైనింగ్ లీజులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

తాజా ఉత్తర్వుల ప్రకారం.. ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వాలు ఆరావళి పరిధిలో ఎలాంటి కొత్త మైనింగ్ అనుమతులు ఇవ్వకూడదని కేంద్రం స్పష్టం చేసింది. ఇప్పటికే ఉన్న మైనింగ్ కార్యకలాపాలపై కూడా నిశిత నిఘా ఉంచాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. పర్వత శ్రేణులను ఒక నిరంతర భౌగోళిక శిఖరంగా (Continuous Geological Ridge) గుర్తించి, దాని సహజత్వాన్ని కాపాడడమే ప్రాధాన్యతగా కేంద్రం పేర్కొంది.

Advertisement

ఆరావళి పర్వతాలు కేవలం రాతి గుట్టలు మాత్రమే కావు, అవి ఉత్తర భారత దేశానికి రక్షణ కవచాలు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం పర్యావరణ ప్రేమికులకు పెద్ద ఊరటనిచ్చింది. ఈ నిషేధం వల్ల భావి తరాలకు స్వచ్ఛమైన గాలి, నీరు అందే అవకాశం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అభివృద్ధి పేరుతో ప్రకృతిని విస్మరించకూడదని, సుస్థిర అభివృద్ధి వైపు అడుగులు వేయాలని ఈ నిర్ణయం స్పష్టం చేస్తోంది.

ALSO READ: CM Revanth Reddy: బీఆర్ఎస్, కేసీఆర్ చరిత్ర ఇక ఖతమే.. కొడంగల్ సాక్షిగా ఇదే నా శపథం: సీఎం రేవంత్

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×