E-Paper
Advertisement

Stranger Things Season 5 Vol 2 on OTT : ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో మోస్ట్ అవైటింగ్ సిరీస్ స్ట్రీమింగ్… ఏ ఎపిసోడ్ ఎన్ని గంటలంటే ?

Stranger Things Season 5 Vol 2 on OTT : ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో మోస్ట్ అవైటింగ్ సిరీస్ స్ట్రీమింగ్… ఏ ఎపిసోడ్ ఎన్ని గంటలంటే ?
Advertisement

Stranger Things Season 5 Vol 2 on OTT : ‘స్ట్రేంజర్ థింగ్స్’ సీజన్ 5 రెండవ వాల్యూమ్ గురించి ఓటీటీ మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మంత్ ఎండింగ్ లో కొత్త ఎపిసోడ్స్ రిలీజ్ కాబోతున్నాయని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. మరికొన్ని గంటల్లో ఈ సిరీస్ సెకండ్ వాల్యూమ్ రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో ట్రెండింగ్ లో ఉంది. మరి ఆ అప్డేట్స్ ఏంటో తెలుసుకుందాం పదండి.

మూడు ఎపిసోడ్లు మాత్రమే

డిసెంబర్ 26న విడుదల కానున్న ఈ నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌ను డఫర్ బ్రదర్స్ రూపొందించారు. మిల్లీ బాబీ బ్రౌన్, ఫిన్ వోల్ఫ్‌హార్డ్, గేటెన్ మాటరాజ్జో, కాలేబ్ మెక్‌లాఫ్లిన్, నోహ్ ష్నాప్, వినోనా రైడర్ మరియు డేవిడ్ హార్బర్ తదితరులు ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. వాల్యూమ్ 2 ఎపిసోడ్ 5 నుండి ఎపిసోడ్ 7 వరకు మూడు ఎపిసోడ్‌లతో స్ట్రీమింగ్ కానుంది. సీజన్‌లోని ఎనిమిదవ, చివరి ఎపిసోడ్ 2026 జనవరి 1న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల అవుతుంది. అంతేకాదు ఈ సిరీస్ కొన్ని థియేటర్స్ లో స్క్రీనింగ్‌ కానుంది.

Advertisement

ఇండియాలో ఈ ఎపిసోడ్‌లు డిసెంబర్ 26న ఉదయం 6:30 గంటలకు అందుబాటులో ఉంటాయి. ఈ సిరీస్ తెలుగుతో సహా అనేక భారతీయ భాషలలో ప్రసారం అవుతుంది. ఈ వాల్యూమ్‌లోని ప్రతి ఎపిసోడ్ ఒక గంట కంటే ఎక్కువ నిడివి ఉంటుంది. ఎపిసోడ్ 5 – షాక్ జాక్ – 1 గంట 8 నిమిషాలు, ఎపిసోడ్ 6 – ఎస్కేప్ ఫ్రమ్ కామజోట్జ్ – 1 గంట 15 నిమిషాలు, ఎపిసోడ్ 7 – ది బ్రిడ్జ్ – 1 గంట 6 నిమిషాల నిడివితో సాగుతాయి. అలాగే ఈ ఎపిసోడ్‌లు నేరుగా సిరీస్‌లోని చివరి అధ్యాయానికి దారితీస్తాయి.

Read Also : థియేటర్లలో బిగ్గెస్ట్ డిజాస్టర్ ఈ 2 గంటల 30 నిమిషాల కామెడీ థ్రిల్లర్… ఇప్పుడు ఓటీటీలోకి

కథలోకి వెళ్తే…

Advertisement

“స్ట్రేంజర్ థింగ్స్” వెబ్ సిరీస్ కథ 1980ల నాటి అమెరికాలోని హాకిన్స్ అనే చిన్న పట్టణంలో జరుగుతుంది. ప్రారంభంలో, హాకిన్స్ సైలెంట్ గానే ఉంటుంది. అయితే హాకిన్స్ నేషనల్ ల్యాబ్ కారణంగా పట్టణంలో వింత సంఘటనలు జరగడం ప్రారంభమైనప్పుడు కథ మలుపు తిరుగుతుంది. ఈ ల్యాబ్ ప్రభుత్వ పరిశోధనలను నిర్వహిస్తుంది. కానీ ఈ పరిశోధన ప్రమాదకరమైన పరిణామాలకు దారితీస్తుంది. అప్‌సైడ్ డౌన్ అనే మరో ప్రపంచానికి తలుపులు తెరుస్తుంది.

మొదటి సీజన్‌లో నలుగురు స్నేహితులు ఉంటారు. అందులో విల్ బైయర్స్ అనే పిల్లవాడు అదృశ్యమవుతాడు. విల్ తల్లి జాయిస్, పోలీసు అధికారి జిమ్ హాప్పర్ విల్ కోసం వెతుకుతున్నప్పుడు, అతను అప్‌సైడ్ డౌన్‌లోకి ప్రవేశించాడని తెలుసుకుంటారు. ప్రపంచాన్ని రక్షించే శక్తి ఉన్న ఎలెవెన్ అనే యువతి విల్ స్నేహితులతో చేరుతుంది. ఆమె సహాయంతో వారు విల్ కోసం వెతుకుతారు.

రెండవ సీజన్‌లో, విల్ తిరిగి వస్తాడు, కానీ అప్‌సైడ్ డౌన్ ప్రపంచం అతనికి లింకు అయ్యి ఉంటుంది. అప్‌సైడ్ డౌన్ నుండి వచ్చిన ప్రమాదకరమైన రాక్షసుడు మైండ్ ఫ్లేయర్, వాస్తవ ప్రపంచానికి హాని కలిగించడానికి తన శక్తులను ఉపయోగించడం ప్రారంభిస్తాడు. విల్ స్నేహితులు మళ్ళీ మైండ్ ఫ్లేయర్‌ను ఓడించి, మరో ప్రపంచానికి తలుపులు మూసేస్తారు. మూడవ సీజన్‌లో, హాకిన్స్‌లో కొత్త స్టార్‌కోర్ట్ మాల్ నిర్మితమవుతుంది. అక్కడ రష్యన్లు అప్‌సైడ్ డౌన్ తలుపును తిరిగి తెరవడానికి ఒక ప్రయోగశాలను నిర్మిస్తారు. ఇంతలో మైండ్ ఫ్లేయర్ ప్రజలను వెంటాడటానికి తిరిగి వస్తాడు.

నాల్గవ సీజన్‌లో కథ మరింత భయానకంగా మారుతుంది. ఈ సీజన్‌లో వెక్నా అనే కొత్త శత్రువు కనిపిస్తాడు. ఐదవ సీజన్‌లో కథ కొనసాగుతుంది. ఇందులో విల్ మరియు ఎలెవెన్ స్నేహితులు వెక్నాను ఓడించడానికి ట్రై చేస్తారు.

 

Tags

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×