E-Paper
Advertisement

Padayappa Reunion: నరసింహతో మరోసారి నీలాంబరి.. వైరల్ అవుతున్న ఫోటో..!

Padayappa Reunion: నరసింహతో మరోసారి నీలాంబరి.. వైరల్ అవుతున్న ఫోటో..!
Advertisement

Padayappa Reunion: 1999లో విడుదలైన పదయప్ప సినిమా ఇప్పటి కూడా ఎంతోమందికి ఫేవరెట్ సినిమాగా మిగిలింది అని చెప్పడంలో సందేహం లేదు. ఈ సినిమానే తెలుగులో.. నరసింహగా విడుదలే ఇక్కడ కూడా అప్పట్లో బ్లాక్ బస్టర్ సాధించింది. తాజాగా ఈ సినిమా రీ-రిలీజ్ కావడంతో థియేటర్లలో మరోసారి పండుగ వాతావరణం కనిపించింది. 25 ఏళ్ల తర్వాత కూడా ఈ సినిమా బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్ రావడంతో..సూపర్‌స్టార్ రజినీకాంత్ తన ఇంట్లో ప్రత్యేకంగా ఒక రీయూనియన్ పార్టీ ఏర్పాటు చేశారు.

నీలాంబరిని మరువగలమా..!

ఈ వేడుకకు సినిమా దర్శకుడు కేఎస్ రవికుమార్.. నీలాంబరి పాత్రతో చరిత్ర సృష్టించిన నటి రమ్యకృష్ణ.. హాజరయ్యారు. ముగ్గురు కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ చిత్రాలు చూసిన అభిమానులు నాస్టాల్జియాలో మునిగిపోయారు. ఇక ఈ పోస్టుకి వస్తున్న రెస్పాన్స్ పదయప్ప అంటేనే ఒక ఎమోషన్ అని మరోసారి నిరూపితమైంది. కాగా ఈ సినిమాలో రజనీకాంత్ తో పోటీపడి నటించింది రమ్యకృష్ణ. ఒకరకంగా ఈ సినిమాల్లో ఆయన కన్నా కూడా నీలాంబరి పాత్రకు ఎక్కువ పేరు వచ్చింది అని చెప్తే అతిశయోక్తి కాదేమో.

Advertisement

‘పదయప్ప’ సినిమా తమిళ మాస్ సినిమాకు కొత్త దిశ చూపించింది. రజనీకాంత్ స్టైల్, డైలాగ్స్, సంగీతం, కథనం అన్నీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా రమ్యకృష్ణ పోషించిన నీలాంబరి పాత్ర ఇప్పటికీ భారతీయ సినిమాలో అత్యంత గుర్తుండిపోయే మహిళా విలన్ పాత్రలలో ఒకటిగా నిలిచింది. శివాజీ గణేశన్, సౌందర్య వంటి నటుల నటన కూడా ఈ సినిమాకు బలంగా నిలిచింది.

ఇప్పటికి కూడా రమ్యకృష్ణ పేరు వినగానే ముందుగా నీలాంబరి పాత్ర గుర్తొస్తుంది. ఇంతలా గుర్తుంది పోయిన ఈ సినిమా.. ఇప్పుడు రీ రిలీజ్ కావడమే కాకుండా.. బ్లాక్ బస్టర్ సాధించి.. అలానే వీళ్ళందరూ కలిసి రీ యూనియన్ చేసుకోవడంతో.. అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోతున్నాయి.

మళ్లీ కనిపించిన ముగ్గురు..!

Advertisement

రజనీకాంత్ తన ఇంటికి సినిమా యూనిట్ సభ్యులను ఆహ్వానించి, వారితో సరదాగా గడపడం అభిమానులకు మరింత ఆనందాన్ని ఇచ్చింది. ఇంత పెద్ద విజయం సాధించిన సినిమాను మళ్లీ కలిసి సెలబ్రేట్ చేయడం నిజంగా ప్రత్యేకం అని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

ఇక రజనీకాంత్ ప్రస్తుతం తన కొత్త సినిమాలతో బిజీగా ఉన్నారు. త్వరలోనే ‘Jailer 2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అలాగే మరికొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులు కూడా లైన్లో ఉన్నాయి. అయితే, ఎంత కొత్త సినిమాలు వచ్చినా.. “పదయప్ప” లాంటి క్లాసిక్‌కు ఉన్న క్రేజ్ మాత్రం ఎప్పటికీ తగ్గదని ఈ రీ-రిలీజ్ మరోసారి రుజువు చేసింది.

ALSO READ: Tirumala Kishore: ఇద్దరు హీరోయిన్స్‌తో డైరెక్టర్ మాస్ డ్యాన్స్… దెబ్బకు రవితేజ సినిమాలో ఛాన్స్

Related News

పవన్ ఫ్యాన్స్‌కి పూనకాలే.. OG యూనివర్స్ నుంచి అదిరిపోయే ట్రీట్!

‘రోమాంచకం’కు రెండో రోజే షాక్.. కలెక్షన్లు ఇలా పడిపోయాయేంటి?

డాన్సర్స్ అసోసియేషన్‌లో మళ్లీ రచ్చ.. సుమలతపై రఘు మాస్టర్ కౌంటర్!

డ్రాగన్ పై ప్రశాంత్ నీల్ బిగ్ అప్డేట్…స్పీడుమీదున్న తారక్!

ఏంటి నాని.. ఇంత హైప్ అవసరమా? ‘ది ప్యారడైజ్’పై అప్పుడే డౌట్స్!

సినిమాలోనే మ్యాజిక్ ఉంది…ఆకట్టుకుంటున్న ఎపిక్ ట్రైలర్!

రూ.10 లక్షల ఇన్సూరెన్స్.. రూ.5 వేల పెన్షన్.. నట్టి కుమార్ ఆఫర్ ఇదే!

సమ్మర్ హీట్‌లో ప్రగ్యా జైస్వాల్ స్పెషల్ ట్రీట్.. నెట్టింట వైరల్!

Big Stories

Advertisement
×