E-Paper
Advertisement

Tirumala Kishore: ఇద్దరు హీరోయిన్స్‌తో డైరెక్టర్ మాస్ డ్యాన్స్… దెబ్బకు రవితేజ సినిమాలో ఛాన్స్

Tirumala Kishore: ఇద్దరు హీరోయిన్స్‌తో డైరెక్టర్ మాస్ డ్యాన్స్… దెబ్బకు రవితేజ సినిమాలో ఛాన్స్
Advertisement

Tirumala Kishore Dance: మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించి.. ఈ సంక్రాంతికి ఎన్నో అంచనాల మధ్య రాబోతున్న సినిమా భర్త మహాశయులకు విజ్ఞప్తి. కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు సరదా వినోదాన్ని కలిపి చూపించిన ఈ ట్రైలర్ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని పెంచింది. సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.

ఇక ఈ ట్రైలర్ ని ఒక ట్రైలర్ ఈవెంట్ పెట్టి మరి విడుదల చేశారు. ఈ ఈవెంట్లో దర్శకుడు కిషోర్ తిరుమల వేసిన డాన్స్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇద్దరు హీరోయిన్స్ తో కలిసి ఈ డైరెక్టర్ డాన్స్ వేశారు. నేను శైలజ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ దర్శకుడు.. సాధారణంగా ఎక్కడ కూడా బయట ఇంటర్వ్యూస్ లో పెద్దగా మాట్లాడినట్టు కూడా కనిపివ్వరు. అలాంటిది ఇప్పుడు ఏకంగా హీరోయిన్స్ తో కలిసి డాన్స్ వెయ్యడంతో.. ఈ టాలెంట్ ఊహించనే లేదు కదా అని కామెంట్ లో పెడుతున్నారు అభిమానులు. అంతేకాదు ఈ డాన్స్ చూసి రవితేజ తన తదుపరి సినిమాలో ఆల్రెడీ ఆఫర్ కూడా ఇచ్చాను అని చెప్పుకొచ్చారు. ఇక ఈ మధ్యనే కిషోర్ తిరుమల మిరాయి చిత్రంలో కూడా ఒక చిన్న పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ డాన్స్ తో రవితేజ సినిమాలో కూడా డాన్స్ దక్కించుకున్నారు ఈ డైరెక్టర్.

Advertisement

ఇక ట్రైలర్ విషయానికి వస్తే..ఈ ట్రైలర్లో కథలోని ముఖ్య ఉద్దేశం చాలా క్లియర్ గా చూపించాడు. ఇక కథ విషయానికి వస్తే..ఒక సాధారణ వ్యక్తి జీవితం ఎలా గందరగోళంగా మారుతుందో ఈ కథ చెబుతుంది. ఉద్యోగ పనిమీద విదేశాలకు వెళ్లిన హీరో అక్కడ ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు. కానీ తనకు ఇప్పటికే పెళ్లైందన్న నిజాన్ని ఆమెకు చెప్పడు. అదే సమయంలో ఇండియాలో ఉన్న తన భార్యకు కూడా ఈ విషయం తెలియకుండా దాచిపెడతాడు.

Advertisement

ఇక్కడే కథ మలుపు తిరుగుతుంది. విదేశాల్లో పరిచయమైన అమ్మాయి అనుకోకుండా ఇండియాకు వస్తుంది. అప్పుడు ఒక వైపు పెళ్లాం..మరో వైపు ప్రేయసి ఉండటంతో హీరో పరిస్థితి పూర్తిగా తారుమారవుతుంది. ఈ రెండు పాత్రల మధ్య హీరో ఎలా నలిగిపోతున్నాడో ట్రైలర్‌లో ఆసక్తికరంగా చూపించారు. నవ్వులు పూయించే సన్నివేశాలతో పాటు కుటుంబ అనుబంధాల విలువను కూడా గుర్తు చేసేలా ట్రైలర్ ఉంది.

ఈ సినిమాలో రవితేజ పాత్ర ఈసారి కొంచెం భిన్నంగా కనిపిస్తుంది. దర్శకుడు కిశోర్ తిరుమల ఈ కథలో మాస్ అంశాలకంటే కథా బలానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్టు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది.

రవితేజ సరసన డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. వీరిద్దరి పాత్రలు కథలో కీలకంగా ఉండనున్నట్టు ట్రైలర్ సూచిస్తోంది. అలాగే సత్య, సునీల్, వెన్నెల కిశోర్, మురళీధర్ గౌడ్ లాంటి నటులు తమదైన శైలిలో నవ్వులు పంచేందుకు సిద్ధంగా ఉన్నారు. భీమ్స్ అందించిన సంగీతం ట్రైలర్‌కు మరింత ఊపునిచ్చింది. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ పండగ సమయంలో కుటుంబంతో కలిసి హాయిగా చూడగలిగే సినిమా అన్న నమ్మకాన్ని ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ట్రైలర్ బలంగా కలిగిస్తోంది. సంక్రాంతి సందడిలో ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

ALSO READ: Anaganaga Oka Raju: రిలీజ్‌కు ముందే పోలిశెట్టి సినిమాకు లాభాలు.. సేఫ్ జోన్‌లో నిర్మాత నాగవంశీ

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×