BigTV English
Advertisement

Peddi: రెండో టెస్ట్ కూడా పాస్ అయిన పెద్ది.. ఇక తిరుగులేదు

Peddi: రెండో టెస్ట్ కూడా పాస్ అయిన పెద్ది.. ఇక తిరుగులేదు

Peddi: గేమ్ ఛేంజర్ లాంటి భారీ డిజాస్టర్ తరువాత రామ్ చరణ్ పెద్ది సినిమా చేస్తున్నాడు అంటే చాలామంది డౌట్ ఫుల్ గా చూసారు. ఆ సినిమానే  హిట్ అవ్వలేదు.  ఇది కూడా లానే ఉండబోతుందని ట్రోల్స్ చేశారు. ఉప్పెన సినిమాతో నేషనల్ అవార్డును అందుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు సానా కూడా చరణ్ ను మేనేజ్ చేయలేడని, ఇదంతా వర్క్ అవుట్ అవ్వదని చెప్పుకొచ్చారు. ఇక పెద్ది ఫస్ట్ లుక్ రావడంతో   అచ్చుగుద్దినట్లు రంగస్థలంలానే ఉంది.. కొత్తగా ఏముంది.. అబ్బే  సెట్ అవ్వదు అని పెదవి విరిచారు. ట్రోలర్స్ అయితే ఎప్పుడెప్పుడు టీజర్, సాంగ్స్ వస్తాయా అందులో తప్పులు ఎంచి ట్రోల్ చేయాలా అని కంకణం కట్టుకొని కూర్చున్నారు.


ఇక పెద్ది నుంచి మొదట ఫస్ట్ షాట్ పేరుతో ఒక చిన్న గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్లు అందరూ ఇది కనుక టెస్ట్ పాస్ అయితే ఈ సినిమాపై అంచనాలు పెరుగుతాయి. ట్రోల్స్ తగ్గుతాయని వేచి చూసారు. అనుకున్నట్లుగానే పెద్ది ఫస్ట్ షాట్ రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. చరణ్ బ్యాట్  పట్టుకొని కింద కూర్చొని లేచి షాట్ కొట్టే సీన్ కి వెనుక రెహమాన్ అందించిన మస.. మసా.. మసా.. పెద్ది.. పెద్ది మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు.  ఫస్ట్ షాట్ పై అందరూ పాజిటివ్ టాక్ నే ఇచ్చారు. చరణ్ లుక్, మ్యూజిక్, బుచ్చి టేకింగ్.. ఇలా ప్రతిదీ సెట్ అయ్యాయని చెప్పడంతో ఫస్ట్ షాట్  పాస్ అయ్యి.. ట్రోల్స్ రాకుండా  అంచనాలను మరింత పెంచేసి మొదటి టెస్ట్ పాస్ అయ్యింది.

ఇక ఇప్పుడు రెండో టెస్ట్ కూడా చరణ్ పాస్ అయ్యాడు. నిన్ననే పెద్ది నుంచి చికిరి చికిరి సాంగ్ రిలీజ్ అయ్యింది. ఈ సాంగ్ ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. చరణ్ స్టెప్స్, లిరిక్స్, జాన్వీ కపూర్ అందాలు..  ఆ విజువల్స్.. చరణ్ లుక్ అన్ని ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసాయి. సాధారణంగా స్టార్ హీరో సినిమా నుంచి సాంగ్ కానీ, టీజర్ కానీ వస్తే.. దానిని ట్రోల్ చేయడానికి కొంతమంది వస్తారు. అది బాలేదు.. ఇది బాలేదని.. కానీ, చికిరి సాంగ్ విషయంలో మాత్రం అలా జరగలేదు. చరణ్ గ్రేస్ కి, డ్యాన్స్ కి ట్రోలర్స్ సైతం ఫిదా అయ్యారు. ఈ లెక్కన చరణ్ రెండో టెస్ట్ కూడా పాస్ అయ్యాడు. ఇక పెద్ది విషయంలో అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పొచ్చు. ఇది ఇలానే కొనసాగుతూ వచ్చిన ప్రతి ప్రమోషన్ కంటెంట్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే పెద్దికి తిరుగులేదు అని చెప్పొచ్చు. మరి ఈసారి పెద్దితో చరణ్ హిట్ ను అందుకుంటాడో లేదో చూడాలి.


Related News

Gouri Kishan : జర్నలిస్ట్ కు హీరోయిన్ ఘాటు రిప్లై.. అలా చేస్తే ఊరుకొనేది లేదు..

Jaanvi Swarup Ghattamaneni: అందమే అసూయపడేలా ఘట్టమనేని వారసురాలు.. జాన్వీ యాడ్ చూశారా.. ?

Vijay Sethupathi: అప్పుడు విజయ్.. ఇప్పుడు అజిత్ కి విలన్ గా సేతుపతి.. ?

Dilraju: ఓల్డ్ ఈజ్ గోల్డ్.. వెనక్కి వెళ్తున్న దిల్ రాజు.. ఈ ఆలోచన వర్కౌట్ అవుతుందా?

Nawazuddin Siddiqui: ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా.. కానీ!

Nikhil Siddarth : నిఖిల్ అన్న ఏమైపోయావ్.. స్వయంభు ఇంకెన్ని రోజులు..?

Rashmika: భర్తగా రావాలంటే యుద్ధాలు చేయాలా.. మరి విజయ్ పరిస్థితేంటో?

Big Stories

×