E-Paper
Advertisement

CM Revanth Reddy: సీఎం రేవంత్ పుట్టినరోజు.. PM నుండి CM వరకు శుభాకాంక్షలు

CM Revanth Reddy: సీఎం రేవంత్ పుట్టినరోజు.. PM నుండి CM వరకు శుభాకాంక్షలు
Advertisement

CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని యాదాద్రి జిల్లాలోని యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ప్రధాన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానం అధికారులు, అర్చకులు ముఖ మండపంలో ముఖ్యమంత్రి పేరున పూజలు చేసి, ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించారు. పూజల అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను అధికారులు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి పంపించారు.

Advertisement

సీఎం రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ, మమత బెనర్జీ
నేడు సీఎం రేవంత్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు ఉదయాన్నే జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ.. రేవంత్ ఆరోగ్యంగా ఉండాలని తెలిపారు.. అంతేకాకుండా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా విషెస్ తెలిపారు.

Advertisement

రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, మెగాస్టార్ చిరంజీవి, డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు రేవంత్ పుట్టిన రోజు సందర్భంగా లో ఎక్స్‌లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అని తెలియాజేశారు. అలాగే చిరంజీవి, పవన్ కళ్యాణ్ కూడా విషెస్ చేశారు. పవన్ కళ్యాణ్ ప్రజలను మరింత సేవ చేసే శక్తిని, సంపూర్ణ ఆరోగ్యాన్ని, సుఖ సంతోషాలను అందించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

రేవంత్ రెడ్డికి మంత్రి కోమటి రెడ్డి విషెస్
సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సోషల్ మీడియాలో గౌరవ రాష్ట్ర ముఖ్య మంత్రివర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అని తెలిపారు. అలాగే మీరు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ప్రజా జీవితంలో మరెన్నో విజయాలు సాధించాలని హృదయపూర్వంగా ఆకాంక్షిస్తున్నాను అన్నారు.

పలువురి నేతల విషెస్..
రేవంత్ రెడ్డికి పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటు పలువురు నేతలు సోషల్ మీడియాలో ట్విట్ చేశారు. వారు వైఎస్ శర్మిల, పొన్నం ప్రభాకర్, బండి సంజయ్, జిష్ణు దేవ్ వర్మ, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

Related News

సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై.. నిజామాబాద్ పోలీసులు యాక్షన్..!

కేసీఆర్‌ కుటుంబ ఆస్తులు స్వాధీనం చేసుకోవాలి! – మాజీ మంత్రి రవీంద్ర నాయక్

సాలార్ జంగ్ మ్యూజియంకు సరికొత్త రూపు.. ఓయూ విద్యార్థులకు కీలక పిలుపు!

దేశంలో అలజడులు సృష్టించే కుట్రలు సాగనివ్వం: రాంచందర్ రావు

కేజీబీవీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. త్వరలో మళ్లీ ఆర్డర్లు?

ముక్కు మూసుకుని బతుకమ్మ నిమజ్జనం చేసిన మహిళలు.. ఎందుకో తెలుసా..?

మా తీర్పులు కాగితాలకే పరిమితమా..? పీరియడ్ హైజీన్ ఉత్తర్వుల అమలుపై సుప్రీం కోర్టు ఫైర్!

తెలంగాణలో 429 ప్రభుత్వ ఉద్యోగాలకు ఆర్థిక శాఖ ఆమోదం.. త్వరలో నోటిఫికేషన్..?

Big Stories

Advertisement
×