Nawazuddin Siddiqui: సాధారణంగా ఒక మనిషి జీవితంలో ఎత్తు పల్లాలు అనేవి సహజం. అయితే కష్టం వచ్చినప్పుడు వాటిని ధైర్యంగా ఎదుర్కొన్నప్పుడే.. జీవితంలో ముందడుగు వేయగలం. కష్టం వచ్చింది కదా అని అక్కడే ఆగిపోతే.. భవిష్యత్తులో మనం అనే వ్యక్తి సమాజంలో కనిపించరు అనడంలో సందేహం లేదు. అందుకే ఎలాంటి కష్టాలు వచ్చినా సరే ధైర్యంగా ముందడుగు వేస్తేనే మనకంటూ ఒక గుర్తింపు ఉంటుంది అంటూ చాలామంది నిరూపిస్తున్నారు. ఈ క్రమంలోనే తాను కూడా కెరియర్ తొలినాళ్ళల్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని.. భరించలేక ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నానని.. కానీ సడన్గా తన జీవితంలో చోటు చేసుకున్న పరిణామాలు జీవితంపై ఆశ చిగురించేలా చేశాయని చెప్పుకొచ్చారు.
ఆయన ఎవరో కాదు ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో నవాజుద్దీన్ సిద్ధికి(Nawazuddin Siddiqui) .. 1999లో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో నటనలో కోర్స్ పూర్తి చేసిన నవాజుద్దీన్.. టీవీ సీరియల్స్ లో అవకాశాల కోసం ముంబైకి వెళ్ళాడు. అలా 1999లో అమీర్ ఖాన్ (Aamir khan) హీరోగా వచ్చిన ‘సర్ఫారోష్’ అనే సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టారు.. బాలీవుడ్ చిత్రాలలోనే కాదు తెలుగు చిత్రాలలో కూడా కీ రోల్ పోషించి అందరినీ ఆకట్టుకున్నారు నవాజుద్దీన్. ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన తాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు.
నవాజుద్దీన్ సిద్ధికి మాట్లాడుతూ..” కెరియర్ ఆరంభంలో ఆర్థికంగా నేను ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాను. సినిమాలలో అవకాశాలు రాక నిరాశలో కూరుకుపోయాను. ఒకవేళ ఏదైనా సినిమాలో అవకాశం వచ్చినా.. మళ్లీ ఆ అవకాశం చేజారి పోతుందనే భావన నాలో ఎక్కువగా ఉండేది. దానిని తట్టుకోలేక.. కష్టాలు ఎదుర్కోలేక.. ఆత్మహత్య ఆలోచనలు కూడా వచ్చాయి. అయితే సరిగ్గా అదే సమయంలో ఒక సినిమాలో అవకాశం రావడం.. ఆ సినిమా సక్సెస్ అవ్వడంతో మళ్లీ జీవితం పై నాకు ఆశ చిగురించింది. ముఖ్యంగా 2012 నుంచి వచ్చిన గ్యాంగ్ ఆఫ్ వాస్సేపూర్, కహానీ, తలాష్ వంటి చిత్రాలు వరుసగా సక్సెస్ అందుకోవడంతో.. ఇక మళ్ళీ అలాంటి ఆలోచనలు చేయలేదు” అంటూ నవాజుద్దీన్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈయన సూసైడ్ చేసుకోవాలనుకున్నట్లు చెప్పడంతో అభిమానుల సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
also read:Rashmika: భర్తగా రావాలంటే యుద్ధాలు చేయాలా.. మరి విజయ్ పరిస్థితేంటో?
1974 మే 19వ తేదీన బుధాన , ముజాఫ్ఫార్ నగర్ , ఉత్తరప్రదేశ్లో జన్మించారు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా. గురుకుల కాంగ్రి విశ్వవిద్యాలయాల నుండి చదువు పూర్తి చేసిన ఈయన 1999 నుండి ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇటీవల తెలుగులో వెంకటేష్ 75వ చిత్రం గా వచ్చిన సైంధవ్ అనే సినిమాలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన అటు తమిళంలో పేట అనే సినిమాలో కూడా నటించారు. ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిన ఈయన.. అందులో భాగంగానే కెరియర్ తొలినాళ్లలో తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చారు.