BigTV English

Pan India Star : 200 కోట్లు అప్పు చేసిన పాన్ ఇండియా స్టార్… ఎందుకు ఈ తిప్పలు సాబ్

Pan India Star : 200 కోట్లు అప్పు చేసిన పాన్ ఇండియా స్టార్… ఎందుకు ఈ తిప్పలు సాబ్

Pan India Star :సాధారణంగా ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా సరే ఒక సినిమా హిట్ అయింది అంటే చాలు..అందులో నటించిన నటీనటులు తమ తదుపరి సినిమాకు అమాంతం రెమ్యూనరేషన్ పెంచేస్తారు. ఇక వారి మార్కెట్ ను బట్టి నిర్మాతలు కూడా వారు అడిగినంత రెమ్యూనరేషన్ ఇవ్వడానికి సిద్ధమవుతూ ఉంటారు. అయితే అందులో కొంతమంది అలా వచ్చిన రెమ్యూనరేషన్ ను ల్యాండ్ లేదా ఇతర రంగాలలో ఇన్వెస్ట్ చేస్తే.. మరికొంతమంది వాటిని నీళ్లలా ఖర్చు చేస్తూ అప్పుల పాలు అవుతూ ఉంటారు. ఇప్పుడు సరిగ్గా ఒక హీరో కూడా అలాంటి పరిస్థితికి చేరుకున్నారు. వేల కోట్ల ఆస్తులు ఉన్నా.. వందల కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్న ఒక పాన్ ఇండియా హీరో.. ఇప్పుడు పదో పాతికో కాదు ఏకంగా రూ.200 కోట్లు అప్పు చేసినట్లు సమాచారం.


200 కోట్లు అప్పు చేసిన పాన్ ఇండియా హీరో..

పేరుకు పాన్ ఇండియా హీరో.. వరుసగా పాన్ ఇండియా చిత్రాలు చేస్తూ సినీ ఇండస్ట్రీలో భారీ పాపులారిటీ అందుకున్నారు. ముఖ్యంగా ఆయన ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ కూడా సినీ రంగానికి చెందింది కావడం గమనార్హం.. అంతేకాదు వారి పెద్దలు రాజకీయాలలో కూడా చక్రం తిప్పారు. ఇంతటి బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఈయన.. ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకత చాటుకుంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. వరుస సినిమాలతో వందల కోట్ల కలెక్షన్స్ వసూలు చేస్తూ.. భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటూ రికార్డు సృష్టిస్తున్నారు. దీనికి తోడు ఇటీవల ఒక పాన్ ఇండియా చిత్రంలో గెస్ట్ రోల్ కూడా చేసిన విషయం తెలిసిందే. అలాంటి ఈయన ఇప్పుడు ఏకంగా రూ.200 కోట్లు లోన్ పెట్టినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఫైల్ పెండింగ్లో ఉందని సమాచారం. అంతేకాదు అటు బ్యాంకు యాజమాన్యం కూడా ఇంత పెద్ద మొత్తంలో లోన్ ఇవ్వడానికి భయపడుతున్నట్లు ఇన్సైడ్ వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి.


అసలు కారణం తెలిస్తే షాక్..

అయితే ఈ విషయాలు తెలిసి నెటిజన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒక పాన్ ఇండియా స్టార్ అయ్యుండి.. ఏకంగా 200 కోట్లు అప్పుగా లోన్ పెట్టడం ఏంటి? అని, అసలు అంత అవసరం ఏమొచ్చిందని.. ఆరా తీయడం మొదలుపెట్టారు. ఇక మరొకవైపు ఇన్సైడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం.. ఆ పాన్ ఇండియా స్టార్ హీరో వ్యక్తిగత అవసరాల కోసం ఇంత పెద్ద మొత్తంలో లోన్ కి అప్లై చేసినట్లు తెలుస్తోంది. మరి వ్యక్తిగత అవసరాల కోసం రూ.200 కోట్లు అంటే మామూలు విషయం కాదు. చిన్నపాటి సినిమాలు నాలుగు, పెద్ద సినిమాలు రెండు తీసే అవకాశం కూడా లేకపోలేదు. ఇక బ్యాంకులు సైతం భయపడుతున్నాయి అంటే ఆ హీరోకి ఇంత పెద్ద మొత్తంలో లోన్ ముట్టదు అని ఇంకొంతమంది కామెంట్ చేస్తూ ఉండడం గమనార్హం. మొత్తానికైతే ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలోనే కాదు అటు సినీ ఇండస్ట్రీలో కూడా హాట్ టాపిక్ గా మారింది.

ALSO READ:Telangana: దేశీయ వస్త్రకళకు ప్రాధాన్యత.. మగువలు మెచ్చే హ్యాండ్లూమ్ షోరూం ప్రారంభం!

Related News

Director Bobby: ‘మన శంకర వరప్రసాద్‌ గారూ’ మూవీపై డైరెక్టర్‌ బాబీ రివ్యూ.. ఏమన్నారంటే!

OG Tickets : ఆంధ్రాలో ఓజి బుకింగ్స్ ఓపెన్, ఊచకోత మొదలైంది. తెలంగాణలో అప్పుడే

Deepika Padukone: దీపికా ఎక్కడా? నువ్వు స్పందించే టైం వచ్చింది..

Mirai – Kishkindhapuri : కలెక్షన్స్‌లో మిరాయ్‌ ని దాటేసిన కిష్కంధపురి.. ఇదెక్కడి ట్విస్ట్ అసలు

Kalki 2 Movie : దీపికను తప్పించడానికి కారణాలు ఇవే… 30 కోట్లు ప్లస్ టీంకు ఖర్చులు.. ఇంకా మరెన్నో

Malayalam Actress: మోహన్‌ లాల్‌పై సీనియర్‌ నటి సంచలన కామెంట్స్‌.. నా భర్త చనిపోతే.. స్వార్థ బుద్ధితో..

Deepika Padukone : తీసేస్తే తీశారు కానీ… కెరీర్‌‌పై గట్టి దెబ్బ కొట్టారు

Deepika Padukone: అయ్యో దీపికా.. టాలీవుడ్‌లో ఒకే ఒక్కడు సపోర్ట్… అయినా డ్యామేజ్ జరిగిపోయింది

Big Stories

×