Telangana:ఆడవారికి అత్యంత ప్రీతికరమైన వాటిలో చీరలు ప్రథమ స్థానాన్ని సొంతం చేసుకున్నాయి. అటు ఇంట్లో ఎన్ని చీరలు ఉన్నా.. ఏదో ఒక అకేషన్ పేరిట కచ్చితంగా ఒక చీర అయినా కొనాలని.. ఇంట్లో వారిని వేధిస్తూ ఉంటారు. వేల రూపాయలు ఖర్చు చేస్తూ తమకు నచ్చిన చీరలను సొంతం చేసుకొని, మురిసిపోతూ ఉంటారు. ఇప్పుడు అలాంటి వారి కోసమే మరొక హ్యాండ్లూమ్ షోరూమ్ ను ఘనంగా హైదరాబాదులో ప్రారంభించడం జరిగింది. అయితే ఇక్కడ ప్రత్యేకించి దేశీయ హ్యాండ్లూమ్ కళను ప్రోత్సహించే దిశగా ఈ షో రూమ్ ను ప్రారంభించడం గమనార్హం. నిజానికి చీరలలో ఎన్ని రకాలు వచ్చినా.. దేశీయ చీరలకు మంచి ప్రాధాన్యత ఉంటుంది. వీటిని కట్టుకోవడం వల్ల దేశీయ బ్రాండ్ ను ప్రోత్సహించడమే కాకుండా శరీరానికి కూడా ఎటువంటి హాని కలిగించవు. పైగా కట్టుకున్న మగువ హుందాతనం పెంచడంలో ఈ చీరలు ప్రథమ స్థానంలో ఉంటాయి.
దేశీయ హ్యాండ్ లూమ్ తో శ్రీ రాధాకృష్ణ సిల్క్ ప్యాలెస్ షోరూమ్ ప్రారంభం..
ఇక అందులో భాగంగానే సాంప్రదాయాన్ని ప్రతిబింబించే వస్త్రాలకు పేరుపొందిన ‘శ్రీ రాధాకృష్ణ సిల్క్ ప్యాలెస్’ తమ మూడవ షోరూంను హైదరాబాదులోని కూకట్పల్లిలో నెక్సస్ మాల్ సమీపంలో ప్రారంభించింది. డు ఓ సోయిరీ హోస్ట్ చేసిన ఈ లాంచ్.. నగరం సోషలైట్స్ , పేజ్ 3 ప్రముఖులతో సందడిగా సాగింది. సాంప్రదాయ చీరకట్టులో వారు తళుక్కుమని మెరిసారు. ముఖ్యంగా దేశీ హ్యాండ్ లూమ్ కళను ప్రోత్సహించే బ్రాండ్ గా పేరు సొంతం చేసుకున్న శ్రీ రాధాకృష్ణ సిల్క్స్ అత్యుత్తమ చీరల విక్రయానికి కేంద్రంగా నిలుస్తూ వచ్చిందని నిర్వాహకులు ఒకరు స్పష్టం చేశారు.
వేలాది కలెక్షన్స్ తో మగువలకు అందుబాటులో..
కూకట్పల్లిలో ఈ స్టోర్ ద్వారా తమ పరంపరను కొనసాగిస్తూ భారతీయ చేనేత వైభవాన్ని ఇక్కడకు తీసుకువచ్చిందని తెలిపారు. జార్జెట్ , కలంకారి, కోర, కోట, కాంచీవరం, బంధేజ్ , బనారసి, ఇక్కత్, గద్వాల్ వంటి వేలాది కలెక్షన్ లను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. ఇక ప్రతి చీర కూడా భారతీయ చేనేత సాంప్రదాయానికి ప్రతిబింబంగా నిలుస్తోందని స్పష్టం చేశారు. మొత్తానికైతే మగువలు మెచ్చే దేశీయ హ్యాండ్లూమ్ ఇప్పుడు కూకట్పల్లిలోనే అందుబాటులోకి రావడంతో మగువల ఆనందానికి అవధులు లేవని చెప్పవచ్చు. సరసమైన ధరలకే వీటిని అందిస్తామని షోర్ నిర్వాహకులు కూడా స్పష్టం చేశారు.
ALSO READ:Samantha: చైతూని మళ్ళీ కెలికిన సమంత.. పచ్చబొట్టుతో రెచ్చగొడుతూ!