UIDAI: ఇంటర్ పాసైన నిరుద్యోగ అభ్యర్థులకు ఇది సువర్ణవకాశం. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన వారికి ఇది అద్భుతమైన అవకాశం అని చెప్పవచ్చు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం కూడా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. వెంటనే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి. నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, పోస్టులు – వెకెన్సీలు, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, ముఖ్యమైన తేదీలు, దరఖాస్తు విధానం గురించి స్పష్టంగా తెలుసుకుందాం.
యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI).. CSC ఈ-గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ ఆధార్ సూపర్ వైజర్, ఆపరేటర్ పోస్టుల భర్తీకి చేసేందకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 203 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆగస్టు 1 లోగా దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం పోస్టుల సంఖ్య: 203 (తెలంగాణలో జనగాంలో 1, జోగులాంబ గద్వాల జిల్లాలో 1, ములుగు జిల్లాల 1, నాగర్ కర్నూల్ జిల్లాలో 1, నిర్మల్ జిల్లాలో 1, పెద్దపల్లిలో 1, సంగారెడ్డిలో 1, వికారాబాద్ లో 1 పోస్టు వెకెన్సీ ఉంది. )
పోస్టులు- వివరాలు..
ఆధార్ సూపర్ వైజర్/ ఆపరేటర్: 203 పోస్టులు
విద్యార్హత: ఆధార్ సూపర్ వైజర్, ఆపరేటర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు ఇంటర్ పాసై ఉంటే సరిపోతుంది లేదా.. ఐటీఐ లేదా డిప్లొమా చేసిన అభ్యర్థులు అయిన దరఖాస్తు చేసుకోవచ్చు.
వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వయస్సు కనీసం 18 ఏళ్ల వయస్సు నిండి ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక విధానం: ఆధార్ సూపర్ వైజర్/ఆపరేటర్ పోస్టులకు ఎంపిక సాధారణంగా రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు. అభ్యర్థులు UIDAI నిర్వహించే సూపర్ వైజర్, ఆపరేటర్ సర్టిఫికేషన్ పరీక్షలో పాసైన వారికి ఉద్యోగం ఇస్తారు. ఈ ఎగ్జామ్ NSEIT నిర్వహించనుంది.
ఎలా అప్లై చేయాలంటే..?
CSC ఇ-గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ (csc.gov.in) లేదా UIDAI అధికారిక వెబ్ సైట్ కి వెళ్లి లాగిన్ అవ్వాలి. అనంతరం Aadhaar Supervisor/Operator Recruitment 2025 నోటిఫికేషన్‌ను ఓసారి క్లియర్ కట్‌గా చదవండి. అప్లికేషన్ లింక్‌ను క్లిక్ చేసి, అవసరమైన వివరాలతో ఫారమ్ పూర్తి చేయండి. అవసరమైన అన్ని డాక్యుమెంట్స్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా అప్లికేషన్ ఫీజు చెల్లించి అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫారమ్‌ను సబ్మిట్ చేసి ప్రింట్ అవుట్ తీసుకోండి.
వేతనం: UIDAI ఆధార్ సూపర్ వైజర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది. రూ. 50,000 పైగా జీతం ఉండే అవకాశం ఉంది.
అప్లికేషన్ లింక్: https://csc.gov.in/ask
అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు.. వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.
ALSO READ: Bank Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి భారీ నోటిఫికేషన్.. జస్ట్ వారం రోజులే ఇంకా.. రూ.85వేల జీతం