E-Paper
Advertisement

Anushka Shetty : సొంత డబ్బులతో కాస్ట్యూమ్ కొనుక్కుంది, అందుకే అనుష్క అందరికీ స్వీటీ

Anushka Shetty : సొంత డబ్బులతో కాస్ట్యూమ్ కొనుక్కుంది, అందుకే అనుష్క అందరికీ స్వీటీ
Advertisement

Anushka Shetty : ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో యాక్టివ్ గా లేరు కానీ ఒకప్పుడు మంచి హీరోయిన్ గుర్తింపు సాధించుకుంది అనుష్క శెట్టి. అనుష్క శెట్టి ను లేడీస్ సూపర్ స్టార్ అని కూడా కొంతమంది పిలుస్తారు. అనుష్క కెరియర్ లో వచ్చిన అరుంధతి సినిమా ఏ రేంజ్ సక్సెస్ సాధించిందో కొత్తగా వివరించాల్సిన పనిలేదు. ఆ సినిమా తర్వాత అనుష్క రేంజ్ కంప్లీట్ గా మారిపోయింది.

పూరి జగన్నాధ దర్శకత్వంలో నాగార్జున నటించిన సూపర్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా గురించి పూరీని కలిసినప్పుడు మొదట ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోను ఇచ్చింది అనుష్క. నీ పేరేంటి అని పూరి అడిగితే స్వీటీ అని చెప్పింది. పూర్తి పేరు ఉంటుంది కదా అదేంటి అని అడిగారు పూరి. అదే పూర్తి పేరు అని చెప్పారు. పూరి నమ్మకపోతే తన దగ్గర ఉన్న పాస్పోర్ట్ కూడా తీసి చూపించారు.

Advertisement

అయితే సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నావు కాబట్టి స్వీటీ అనే పేరు చాలా చిన్నగా ఉంది నీకు ఏమైనా పేరు పెడదాం అని చెప్పి. అనుష్క అని పేరును పెట్టారు. అప్పటికే ఆ సెట్స్ లో ఎవరికో ఆ పేరు ఉంది. రెండు రోజులు స్వీటీని అందరూ అనుష్క అని పిలవడం మొదలుపెట్టారు. అది బాగా అనిపించడంతో అనుష్క శెట్టి అని నామకరణం సూపర్ సెట్స్ లో జరిగిపోయింది.

సొంత డబ్బులతో కాస్ట్యూమ్స్ 

అనుష్క అసలు పేరు స్వీటీ. అలానే తన క్యారెక్టర్ కూడా చాలా స్వీట్ గా ఉంటుంది. ఎంతోమందికి తను సాయం చేసినట్లు గతంలో కూడా వార్తలు వచ్చాయి. నిశ్శబ్దం సినిమా ఈవెంట్లో శ్యాం ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ తన గొప్పతనాన్ని చెప్పారు.

Advertisement

ఇక తాజాగా పంచాక్షరి సినిమా నిర్మాత చంద్ర ఒక ఇంటర్వ్యూలో తన గురించి ఆసక్తికర విషయాలు రివీల్ చేశారు. ఆ నిర్మాత దగ్గర అప్పటికే కేవలం రెండు లక్షల 50 వేల రూపాయలు ఉంటే. అనుష్క సొంతంగా రెండు లక్షల 50 వేల రూపాయలు పెట్టి పంచాక్షరి సినిమా కోసం కాస్ట్యూమ్స్ కొనుక్కున్నారట. మామూలుగా అయితే కాస్ట్యూమ్స్ బాధ్యత అనేది నిర్మాత తీసుకోవాల్సిందే.

కానీ ఒక అడుగు ముందుకు వేసి నిర్మాత గురించి కూడా ఆలోచించి అలా కాస్ట్యూమ్స్ కొనడం అనేది అనుష్క మంచితనానికి ప్రతీక అని చెప్పాలి.

కం బ్యాక్ ఇవ్వాల్సిందే 

అనుష్కకు మంచి ఫ్యాన్ బేస్ ఉంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఖచ్చితంగా ఆమె కం బ్యాక్ ఇచ్చి సినిమా చేయాలని చాలామంది అభిమానులు ఎదురుచూస్తున్నారు. తన నుంచి చివరగా వచ్చిన ఘాటి సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది.

క్రిష్ జాగర్లమూడి ఈ సినిమాతో కం బ్యాక్ ఇస్తాడు అని చాలామంది ఊహించారు కానీ అది కూడా జరగలేదు. కంచె సినిమా తర్వాత క్రిష్ కు చెప్పుకునే హిట్ సినిమా కూడా లేదు. కొన్ని ప్రాజెక్ట్స్ లో ఇన్వాల్వ్ వై మధ్యలో బయటకు వచ్చేయడం కూడా క్రిష్ కు బ్యాడ్ నేమ్ తీసుకువచ్చింది.

Also Read : Thalaivar173 : రంగంలోకి దిగిన రజిని అల్లుడు, ఇది అసలైన కాంబినేషన్

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×