E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu Day 70 : బిగ్ బాస్ హౌస్ లో డబుల్ ధమాకా… నాగ చైతన్య కోసం బిగ్ బాస్ కు రీతూ బైబై… దివ్య జస్ట్ మిస్

Bigg Boss 9 Telugu Day 70 : బిగ్ బాస్ హౌస్ లో డబుల్ ధమాకా… నాగ చైతన్య కోసం బిగ్ బాస్ కు రీతూ బైబై… దివ్య జస్ట్ మిస్

Bigg Boss 9 Telugu Day 70 : ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండబోతోందని నాగార్జున నిన్నటి ఎపిసోడ్ లో అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. శనివారం నిఖిల్ షాకింగ్ ఎలిమినేషన్ జరగ్గా… నేడు ఎవరిని హౌస్ బయటకు పంపారు? అనే విషయాన్ని తెలుసుకుందాం పదండి.

ఇమ్మూ వర్సెస్ తనూజా

నాగార్జున మాస్ ఎంట్రీ తరువాత సండే ఫన్ డే మొదలయ్యింది. అయితే శనివారం రోజు రాత్రి తనూజా ‘నా పేరు ఎందుకు తీసుకొచ్చావ్? మనం అస్సలు మాట్లాడుకోవట్లేదు’ అంటూ ఇమ్మూపై ఫైర్ అయ్యింది. అతను వివరణ ఇవ్వబోతే ‘నా పేరు తీసుకొచ్చి నన్ను బ్యాడ్ చేయకు. ఏదైనా ఉంటే నామినేషన్స్ లో చెప్పుకో’ అంటూ వెళ్ళిపోయింది. ఈ తతంగం అంతా చూపించాక నాగ్, హౌస్ మేట్స్ ను రెండు టీంలుగా విడగొట్టారు. ఇమ్మాన్యుయేల్, తనూజా రెండు టీమ్స్ కు టీం లీడర్లు. ‘మూగ భాషలు’ అనే ఆటను ఆడించారు. అందులో నాగార్జున స్టార్ హీరోల పాపులర్ డైలాగ్స్ ను మ్యూట్ చేసి చూపిస్తారు. వాటిని రెండు టీంల నుంచి ఒక్కొక్కరూ వచ్చి, మొదట బెల్ కొట్టి ఆన్సర్ చెప్పాలి. ఇందులో ఇమ్మూ టీం విన్ అయ్యింది. ఆ తరువాత హర్ట్ చేసిన వాళ్ళకి పచ్చిమిర్చి తినిపించే కార్యక్రమం పెట్టారు. దివ్య భరణికి, భరణి తనూజాకి, రీతూ- డెమోన్ – ఇమ్మూ కళ్యాణ్ కు, తనూజ డెమోన్ కు, గౌరవ్ సంజనకు, సంజన గౌరవ్ కు, కళ్యాణ్ దివ్యకు, సుమన్ శెట్టి సంజనకు మిర్చి తినపించారు.

నాగ చైతన్య కోసం రీతూ రిస్క్

ఇక మొట్టమొదటిసారి ఈ బిగ్ బాస్ షోకు అక్కినేని నాగార్జున తనయుడు నాగ చైతన్య అతిథిగా విచ్చేశారు. స్టేజ్ పై నాగార్జునతో మాట్లాడుతూ “శివ రీరిలీజ్ గురించి ముందు మాట్లాడుకుందాం. అప్పట్లో నేను చిన్న పిల్లాడిని. మూవీని థియేటర్లో చూడలేదు. అందరూ ఇన్నాళ్ళూ కల్ట్ సినిమా అని చెప్పుకుంటున్న ఆ మూవీని ఇప్పుడు థియేటర్లో చూశాక గూస్ బంప్స్ వచ్చాయి. ఇక నాకు సినిమాలతో పాటు బైక్ రేసింగ్ లు అంటే కూడా చాలా ఇష్టం అని నీకు తెలుసు కదా. నాలుగేళ్ల క్రితం ఇండియన్ రేసింగ్ లీగ్ అని ఒక ఫెస్టివల్ ను స్టార్ట్ చేశారు. నేను హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ కి ఓనర్ ను. దీన్ని జియో హాట్ స్టార్ లో చూడవచ్చు” అంటూ నాగార్జునకు గుడ్ న్యూస్ చెప్పాడు చైతన్య. అంతేకాదు రేసింగ్ ఏవీతో పాటు టీంను కూడా పరిచయం చేశారు.

ఇక ఆ తరువాత హౌస్ మేట్స్ తో కూడా నాగ చైతన్య ముచ్చటించారు. రీతూ మీరంటే పిచ్చి అంతో మెలికలు తిరిగింది. అంతేకాదు ఏం మాయ చేశావే మూవీని చూశాక కార్తీక్ అనే పేరున్న బాయ్ ఫ్రెండ్ కావాలని కొన్ని రోజులు వెతికాను” అంటూ నాగ్ ముందే చెప్పేసింది. ‘కానీ నీ పేరు జెస్సి కాదు కదా’ అంటూ చైతన్య పంచ్ వేశాడు. అయితే నాగార్జున కలగజేసుకుని “నిన్నటిదాకా నేనంటే ఇష్టం అన్నావ్. ఇప్పుడు చై అంటున్నావ్. ఇంతకీ చైలో నీకు నచ్చింది ఏంటి?’ అని నవ్వుతూ అడిగారు. రీతూ వెంటనే అందుకుని ‘మీరు మీరే… ఆయన ఆయనే. సోగ్గాడే చిన్నినాయన మూవీలో నా ఫ్రెండ్ ఒక చిన్న క్యారెక్టర్ చేసింది. ఆమెతో పాటు మాస్క్ పెట్టుకుని షూటింగ్ కు వెళ్ళాను. అక్కడ చైను చూశాను. ఆయన కాళ్ళు చేతులు తెల్లగా భలే ఉంటాయ్ సార్. శిల్పం చెక్కినట్టు…” అంటూ ఇంకేదో చెప్పేలోపే ‘ఆ శిల్పాన్ని చెక్కింది నేను… కూర్చో’ అంటూ రీతూని కూర్చోబెట్టారు. అయితే “నాగ చైతన్యతో బైక్ రైడ్ కి వెళ్లే ఛాన్స్ ఇస్తా… కానీ నువ్వు హౌస్ నుంచి బయటకు రావాలి” అంటూ బంపర్ ఆఫర్ తో పాటు కండిషన్ కూడా పెట్టారు నాగార్జున. ‘అయితే ఓకే’ అంటూ ఏమాత్రం ఆలోచించకుండా బయటకు రావడానికి రెడీ అయ్యింది రీతూ. కానీ ‘నువ్వు బయటకు వచ్చాక కూడా బైక్ రైడ్ కి వెళ్లొచ్చు కదా. ఈ అవకాశాన్ని ఎందుకు వదులుకుంటావ్. గెలిచి రా’ అంటూ చైతన్య మరో బంపర్ ఆఫర్ ఇచ్చాడు.

గౌరవ్ – దివ్య డేంజర్ జోన్లో

నాగ చైతన్య అక్కడ ఉండగానే హౌస్ మేట్స్ కి మరో టాస్క్ పెట్టారు. నాగ్ పిక్ చూపించగానే, దానికి సంబంధించిన స్పెల్లింగ్ ను బోర్డుపై సెట్ చేయాలి హౌస్ మేట్స్. ఈ టాస్క్ లో కూడా ఇమ్మూ టీం గెలిచింది. టాస్క్ పూర్తి కాగానే నామినేషన్ టెన్షన్ మొదలైంది. నామినేషన్స్ లో ఉన్న అందరూ సేవ్ అయ్యి, చివరికి దివ్య – గౌరవ్ మిగిలారు. ఇద్దరిలో గౌరవ్ గుప్తా ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్ళాడు. తనూజా గోల్డెన్ బజర్ వాడే ఛాన్స్ తీసుకొని ఉంటే దివ్య ఎలిమినేట్ అయ్యేది. కానీ ఆమె ఆ పని చేయలేదు.

Read Also : అరుదైన పాండాను కిడ్నాప్ కి అంతర్జాతీయ ముఠా ప్లాన్… సైలెంట్ గా ఓటీటీలోకి జాకీ చాన్ మూవీ

Related News

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

ట్రోలర్స్ ఇనయా దిమ్మతిరిగే కౌంటర్.. కాన్ఫిడెంట్ కు మెచ్చుకోవాల్సిందే..!

Bigg Boss Soniya: గిన్నీస్ బుక్ లో సోనియా కూతురికి చోటు.. ఏం చేసిందో తెలుసా..?

Demon Pawan : వివాదంలో బిగ్ బాస్ కంటెస్టెంట్ డిమాన్.. ఆగని ట్రోల్స్..!

బిగ్ బాస్ నటితో సిరాజ్ డేటింగ్.. సంచలనం సృష్టిస్తున్న వీడియో!

Big Stories

×