Pavithra Gowda:కన్నడ సినీ పరిశ్రమలో తీవ్ర సంచలనం సృష్టించిన రేణుకా స్వామి హత్య కేసులో మొదటి నిందితురాలిగా ఉన్న నటి పవిత్ర గౌడ (Pavithra Gowda) ధర్మాసనం ముందు బోరున విలపించింది. విచారణ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు హాజరైన ఆమె జైలులో తనకు రక్షణ లేదని, ప్రాణభయం వెంటాడుతోందని, ముఖ్యంగా జైలులో నైజీరియన్స్ ఖైదీల నుంచి తీవ్ర వేధింపులు ఎదుర్కొంటున్నానని తెలిపిన ఆమె, బెయిల్ అయినా ఇవ్వండి లేదా కాస్త విషయమైనా ఇచ్చి చంపేయండి అంటూ చేసిన కామెంట్లు ఇప్పుడు సినీ, న్యాయ వర్గాలలో తీవ్ర కలకలం రేపుతున్నాయి.
కేసు విచారణలో భాగంగా పవిత్ర గౌడ దాఖలు చేసిన పిటీషన్ ను 59వ సీసీహెచ్ కోర్టు విచారించింది. ఆ సమయంలో పవిత్ర తరఫు న్యాయవాదులు ఆమె వాదనలను వినిపిస్తూ.. “జైలు గోడల మధ్య పవిత్ర గౌడను నాశనం చేయడానికి కూడా కుట్రలు జరుగుతున్నాయి. ఆమె రక్షణ పై తీవ్రమైన ఆందోళన నెలకొంది ” అంటూ న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు.
అయితే దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రతినిధులు స్పందిస్తూ.. కోర్టు మునుపు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ముందస్తు భద్రతా చర్యలలో భాగంగానే పవిత్రను ఇప్పటికే వేరే బ్యారక్ కి మార్చామని స్పష్టం చేశారు. ఇరుపక్షాల వాదనలను విన్న కోర్టు తదుపరి విచారణను వాయిదా వేసింది. మొత్తానికి అయితే నైజీరియన్ మహిళా ఖైదీల నుంచి తనకు తీవ్ర వేధింపులు ఎదురవుతున్నాయని, ఇక్కడి నుండి మార్చండి లేదా బెయిల్ ఇవ్వండి లేదా పూర్తిగా విషమిచ్చి చంపేయండి అంటూ ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
అప్పటికే వివాహమైన కన్నడ హీరో దర్శన్ తో పవిత్ర గౌడ రహస్య రిలేషన్ మెయింటైన్ చేయడం దర్శన్ అభిమానులు జీర్ణించుకోలేకపోయారు.. ముఖ్యంగా అందులో రేణుకా స్వామి అనే అభిమాని పవిత్ర గౌడను సోషల్ మీడియా వేదికగా టార్గెట్ చేస్తూ పంపిన అసభ్యకర మెసేజ్లు ఆమెను మరింత ఆగ్రహానికి గురిచేసాయి. ఇక కోపంలో ఏం చేస్తోంది అనే విషయం కూడా ఆలోచించకుండా దర్శన్ తో కలిసి మరో కొంతమంది వ్యక్తులతో రేణుకా స్వామిని కిడ్నాప్ చేయించి మరి అత్యంత దారుణంగా హత్య చేయించింది. ముఖ్యంగా ఒక షెడ్డులో బంధించి దారుణంగా చిత్రహింసలు పెట్టి గత ఏడాది జూన్ 8న హత్య చేశారు.
also read:తెలంగాణ సీఎంకు నాని రిక్వెస్ట్.. ముఖ్యమంత్రి రియాక్షన్?
ఇప్పుడు ఆ హత్య తాలూకా నరకం పవిత్ర గౌడ అనుభవిస్తోంది అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.. ఆరోజు ఆమె అంత కోపం వ్యక్తం చేయకుండా ఉండుంటే.. ఈరోజు ఆమె సంతోషంగా ఉండేది కదా.. రేణుక స్వామి కుటుంబం కూడా సంతోషంగా ఉండేది కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా అతి కోపం మనిషి వినాశనానికి కారణం అవుతుందని ఈ ఘటన నిరూపిస్తోంది అంటూ కూడా తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.