The Paradise:నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా , శ్రీకాంత్ ఓదెల (Srikanth odela) దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ది ప్యారడైజ్(The Paradise). ఎన్నో రోజులుగా ప్రేక్షకులను ఊరిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి పెద్ద ఎత్తున సిద్ధమవుతోంది. అయితే అభిమానుల కోసం ఒకరోజు ముందుగానే సెప్టెంబర్ 23న రాత్రి ప్రీమియర్ షోలు నిర్వహించనున్నారు. పైగా రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ సంఖ్యలో ప్రీమియర్ షోలకి కూడా ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రికి ఒక అభిమానిగా నాని చేసిన ప్రత్యేక విజ్ఞప్తి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనికి తోడు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth reddy) కూడా తన అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు.
” గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ అనుముల గారు , గౌరవనీయ సినిమాటోగ్రాఫీశాఖ మంత్రి శ్రీ కోమటిరెడ్డి కె.వి.ఆర్ గారు, అలాగే గౌరవనీయ తెలంగాణ పోలీస్ అధికారులకు ఒక సినిమా అభిమానిగా, ముఖ్యంగా చిన్నప్పటి నుంచి సినిమాను ఎక్కువగా ఆస్వాదిస్తున్న వ్యక్తిగా ఒక విజ్ఞప్తి చేసుకుంటున్నాను. నాకు సినిమా అంటే ఎప్పుడూ ఇష్టమే. నాలాగే సినిమాను ప్రేమించే వారితో కలిసి చూడడం ఇంకా ఇష్టం. హైదరాబాదులో ఆ అనుభవానికి ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ లో ఒక ప్రత్యేక స్థానం ఉంది. దయచేసి ది ప్యారడైజ్ సినిమా ప్రీమియర్ షో కోసం ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ లోని థియేటర్ కి వచ్చి, మేము ఎవరి కోసమైతే ఈ సినిమా తీసామో.. ఆ ప్రేక్షకులతో కలిసి ఈ చిత్రాన్ని చూడాలని, వారి ఆనందాన్ని ఆస్వాదించాలని ఎంతగానో కోరుకుంటున్నాను.
ప్రేక్షకుల మధ్య కూర్చొని, సినిమాకు వారి స్పందనను అనుభవించడంలోనే.. సినిమా తీయడంలో అంతిమ సంతృప్తి ఉంటుందని నేను నమ్ముతున్నాను. అవసరమైన అన్ని ఫోటో కాల్, భద్రతా మార్గదర్శకాలను మేము పాటిస్తాము. అదే మా ప్రాధాన్యత. దయచేసి నా అభ్యర్థనను పరిగణలోకి తీసుకుంటారని ఆశిస్తున్నాను” అంటూ ఆర్టీసీ ఎక్స్ రోడ్లో థియేటర్లో తన అభిమానులతో కలిసి సినిమా చూసే అవకాశం తనకు కల్పించండి అంటూ ముఖ్యమంత్రిని కోరారు నాని.
also read:ముఖేష్ ఇంత స్వార్థపరుడా.. పాపం ఏడ్చేసిన దేబ్జానీ!
అయితే నాని ఇంతలా విజ్ఞప్తి చేయడానికి కారణం గతంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 : రూల్ ప్రీమియర్ సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ వద్ద తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అల్లు అర్జున్ సినిమా ప్రీమియర్ కి హాజరైన సమయంలో అభిమానులు పెద్ద ఎత్తున చేరుకోవడం , తొక్కిసలాట జరగడం, ఒక మహిళ మృతి చెందగా .. ఆమె కొడుకు ఇప్పటికీ ప్రాణాలతో పోరాడుతున్నారు. అందుకే ఇక్కడ ప్రీమియర్ షోలు , హీరోల థియేటర్ సందర్శనల విషయంలో భద్రత ఏర్పాట్లపై మరింత దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలోనే నాని ఇప్పుడు ఇదే ప్రాంతంలో సినిమా చూడడానికి అనుమతి కోరడం ఆసక్తికరంగా మారింది.
నాని అభ్యర్థనకు.. తన అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా పంచుకున్నారు. “భద్రతా మార్గదర్శకాల పట్ల మీరు చూపే గౌరవాన్ని మేము చాలా అభినందిస్తున్నాము. నాని అలాగే యువ తెలంగాణ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సజావుగా, జన సమూహ నిర్వహణ, ప్రజా భద్రతను దృష్టిలో పెట్టుకొని, దయచేసి నిర్దేశిత స్థానిక పోలీస్ స్టేషన్లో అధికారిక దరఖాస్తు సమర్పించండి. సంబంధిత బృందం ఆ దరఖాస్తును సమీక్షించి, దాని కనుగుణంగా నిర్ణయం తీసుకుంటుంది” అంటూ ముఖ్యమంత్రి తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
We appreciate your respect for safety guidelines, @NameisNani, and your commitment for the film directed by our talented young Telangana director, @odela_srikanth.
To ensure seamless crowd management and public safety, please submit an official application to the designated… https://t.co/w8NAZOBzsd
— Revanth Reddy (@revanth_anumula) September 23, 2026