E-Paper
Advertisement

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ తో సినిమాపై క్లారిటీ ఇచ్చేసిన అనిల్ రావిపూడి..!

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ తో సినిమాపై క్లారిటీ ఇచ్చేసిన అనిల్ రావిపూడి..!
Advertisement

Pawan Kalyan: ఇటీవలి కాలంలో సంక్రాంతి సీజన్ అంటే అనిల్ రావిపూడి పేరు తప్పకుండా గుర్తుకు వస్తోంది వస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా ఆయన సంక్రాంతికి తీసుకొచ్చిన సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా గత సంక్రాంతికి విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. అదే ఊపును కొనసాగిస్తూ ఈ సంక్రాంతికి విడుదలైన ‘మన శంకర్ వరప్రసాద గారు’ సినిమాతో మరోసారి విజయాన్ని అందుకున్నారు. దీంతో ఈ సంక్రాంతి సీజన్‌లో బ్లాక్ బస్టర్ దర్శకుడిగా అనిల్ రావిపూడి నిలిచారు.

ఈ విజయాల నేపథ్యంలో అనిల్ రావిపూడి తదుపరి సినిమా గురించి ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌తో ఆయన సినిమా చేస్తారనే వార్తలు సోషల్ మీడియాలో.. ఇండస్ట్రీలో హల్‌చల్ చేశాయి. ఈ విషయంపై తాజాగా అనిల్ రావిపూడి స్వయంగా క్లారిటీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయాలనే కోరిక తనకు ఉందని చెప్పారు. అయితే ఇప్పటివరకు ఆయనను నేరుగా కలవలేదని..ఎలాంటి ఫిక్స్ అయిన ప్లాన్ లేదని స్పష్టం చేశారు.

Advertisement

అనిల్ రావిపూడి మాట్లాడుతూ, “పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా చాలా బిజీగా ఉన్నారు. ఆయన ఇప్పుడు రెగ్యులర్‌గా సినిమాలు చేసే స్టార్ కాదు. ఆయనకు రాజకీయంగా, ప్రజాసేవలో చాలా బాధ్యతలు ఉన్నాయి. ఒకవేళ మా కాంబినేషన్ కుదిరితే అది చాలా సంతోషంగా ఉంటుంది. కానీ ఇప్పటివరకు అయితే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు” అని తెలిపారు.
ఇక తన తదుపరి సినిమాల విషయంలో అనిల్ రావిపూడి కొత్త విధానాన్ని అనుసరిస్తున్నట్టు తెలుస్తోంది. సాధారణంగా హీరోను ముందుగా ఫిక్స్ చేసి, ఆ తర్వాత కథను సిద్ధం చేసే పద్ధతికి భిన్నంగా, ఈసారి ఆయన ‘స్టోరీ ఫస్ట్, హీరో నెక్స్ట్’ అనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. అంటే ముందుగా బలమైన కథను సిద్ధం చేసి, ఆ కథకు సరిపోయే హీరోను తర్వాత ఎంపిక చేయాలని భావిస్తున్నారు.
ఈ కొత్త సినిమా షూటింగ్‌ను ఈ ఏడాది జూన్ లేదా జూలైలో ప్రారంభించాలని అనిల్ ప్లాన్ చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్టే జరిగితే, ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి, అంటే సంక్రాంతి 2027కి విడుదల చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. పవన్ కళ్యాణ్‌తో సినిమా కుదిరినా, కుదరకపోయినా, అనిల్ రావిపూడి మరోసారి ప్రేక్షకులకు వినోదభరితమైన సినిమా ఇవ్వడం మాత్రం ఖాయమనే చెప్పాలి.

ALSO READ: Tamannaah Bhatia తెలుగు సినిమాలకు దూరం పెట్టాలనుకుంటున్న తమన్నా..!

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×