E-Paper
Advertisement

Papaya Health Benefits: బరువు తగ్గడం నుంచి గుండె ఆరోగ్యం వరకు.. బొప్పాయితో కలిగే అద్భుత ప్రయోజనాలివే!

Papaya Health Benefits: బరువు తగ్గడం నుంచి గుండె ఆరోగ్యం వరకు.. బొప్పాయితో కలిగే అద్భుత ప్రయోజనాలివే!
Advertisement

Papaya Health Benefits: అన్ని సీజన్లలోనూ తక్కువ ధరలోనే అందుబాటులో ఉండే పండ్లలో బొప్పాయి ఒకటి. ఈ ఫ్రూట్ తినడానికి టేస్టీగానే కాదు.. మనకు ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చడంలోనూ ముందుటుంది. అందుకే దీనిని ‘సూపర్ ఫుడ్’ అని వైద్యులు చెబుతుంటారు. దీనిలో మన శరీరానికి అవసరమైన విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్ల సమృద్ధిగా ఉంటాయి. ఈ నేపథ్యంలో రోజుకో కప్పు బొప్పాయి ముక్కలు తిపడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.

ఇమ్యూనిటీకి కేరాఫ్ అడ్రస్..

శీతాకాలంలోనే కాదు అన్ని ఏ సీజన్లో అయినా ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉండాలంటే.. మన శరీరంలో రోగనిరోధక శక్తి బలంగా ఉండాలి. బొప్పాయిలో విటమిన్ సి, ఎ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి.. రోజుకో కప్పు బొప్పాయి ముక్కలు తీసుకున్నా, శరీరానికి ఒక రోజుకు అవసరమైన విటమిన్ సి కంటే రెండింతలు ఎక్కువగా అందుతుంది. ఇది వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా.. రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తూ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

Advertisement

Also Read: ప్రసవం తర్వాత మళ్లీ మునుపటిలా స్ట్రాంగ్‌ అవ్వాలా? అమ్మమ్మల కాలం నాటి ఆ లడ్డూ రహస్యం ఇదే!

కొలెస్ట్రాల్‌కు చెక్..

శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో బొప్పాయి కీలక పాత్ర పోషిస్తుంది. దీనివల్ల గుండెపోటు, స్ట్రోక్ వంటి ముప్పులు తగ్గుతాయని పలు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అలాగే చాలామందిని వేధిస్తున్న మలబద్ధకం సమస్యకు బొప్పాయి చక్కని పరిష్కారం. ఈ పండులో నీటి శాతం ఎక్కువగా ఉండటంతో పాటు, దీనిలోని పీచు పదార్థం పేగు కదలికలను మెరుగుపరుస్తుంది. దీంతో జీర్ణవ్యవస్థ శుభ్రపడి, కడుపు తేలిగ్గా అనిపిస్తుంది.

వెయిట్ లాస్‌కు బెస్ట్ చాయిస్..

Advertisement

బరువు తగ్గాలని కఠినమైన డైట్ పాటించే వారికి బొప్పాయి వరం లాంటిది. దీనిలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి.. దీన్ని తిన్నప్పుడు కడుపు నిండిన భావన కలుగుతుంది. తద్వారా అనవసరమైన చిరుతిళ్లపై మనసు మళ్లదు. బొప్పియి కేవలం బరువు తగ్గించడంలోనే కాదు.. మీ అందాన్ని రెట్టింపు చేయడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. వయసు పెరగడం వల్ల వచ్చే ముడతలను తగ్గించి, చర్మాన్ని కాంతివంతంగా మార్చుతుంది. అలాగే బొప్పాయిలో ఉండే విటమిన్ ఎ కంటి చూపును మెరుగుపరచడమే కాకుండా.. వయసుతో పాటు వచ్చే కంటి సమస్యలను దూరం చేస్తుంది.

Also Read:  పాలకూరను పచ్చిగా తింటే ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారంటే?

 

Related News

ఆటిజం ఉన్న పిల్లలకు ఏకాగ్రత మెరుగుపరిచే టెక్నిక్.. కొత్త అధ్యయనంలో ఆసక్తికర ఫలితాలు

ఆన్‌లైన్‌లో యువతితో ప్రేమ.. ప్రియురాలిని కలవడానికి 1900 కిమీ ప్రయాణం.. ఏఐ దెబ్బకు మైండ్ బ్లాక్

ఘాటు ఘాటుగా మష్రూమ్ పెప్పర్ ఫ్రై.. ఒక్కసారి ఇలా ట్రై చేస్తే టేస్ట్ అద్భుతం!

వంట రాని వాళ్లు కూడా నిమిషాల్లో చేసేయగల సూపర్ టేస్టీ పన్నీర్ భుర్జీ రెసిపీ!

థీమ్ పార్కుకు వెళుతున్నారా? జాగ్రత్త రోలర్ కోస్టర్ రైడ్స్‌తో మెదడుకు ప్రమాదం

పిల్లలు వద్దనుకోవడం స్వార్థమా? సమాజం చేసే విమర్శలకు సమాధానమిదే

భార్యా, తల్లా.. ఇద్దరి మధ్య నలిగిపోకుండా భర్త ఏం చేయాలి?

పిల్లల ఆరోగ్యంతో చెలగాటం వద్దు.. బేబీ ఫుడ్‌లో చక్కెరపై FSSAI కీలక ఆదేశాలు!

Big Stories

Advertisement
×