E-Paper
Advertisement

ప్రకాష్ రాజ్ తల్లీ మృతి.. సంతాపం తెలిపిన పవన్ కళ్యాణ్.. పోస్ట్ వైరల్!

ప్రకాష్ రాజ్ తల్లీ మృతి.. సంతాపం తెలిపిన పవన్ కళ్యాణ్.. పోస్ట్ వైరల్!
Advertisement

Pawan Kalyan: సినీ నటుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం సోషల్ మీడియా వేదికగా నటుడు ప్రకాష్ రాజ్ కుటుంబానికి తన సానుభూతి ప్రకటించారు. సినీ ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న ప్రకాష్ రాజ్(Prakash Raj) ఇంట తీవ్ర విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. నేడు ఉదయం ప్రకాష్ రాజ్ తల్లి స్వర్ణలత(Swarnalatha) మరణించిన సంగతి తెలిసిందే. ఇలా ఈయన తల్లి మరణ వార్తను తెలుసుకున్న పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ప్రకాష్ రాజ్ తల్లి మరణం పట్ల సానుభూతిని తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

ప్రకాష్ రాజ్ తల్లికి పవన్ కళ్యాణ్ సంతాపం..

ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ పోస్ట్ చేస్తూ.. “ప్రముఖ నటుడు శ్రీ ప్రకాష్ రాజ్ గారి తల్లి గారు శ్రీమతి సువర్ణలత గారు కన్నుమూశారని తెలిసి చింతించాను. శ్రీమతి సువర్ణలత గారు ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. మాతృ వియోగానికి లోనైన శ్రీ ప్రకాష్ రాజ్ గారికి, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అంటూ పవన్ కళ్యాణ్ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇలా ప్రకాష్ రాజ్ తల్లి మరణం పై పవన్ కళ్యాణ్ ట్వీట్ వేయడంతో నేటిజన్స్ సైతం విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

వృద్ధాప్య సమస్యలతో స్వర్ణలత మరణం..

Advertisement

ప్రకాష్ రాజ్ తల్లి స్వర్ణలత 80 సంవత్సరాల వయసులో వయోభారంతో మరణించారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఈమె సోమవారం ఉదయం బెంగళూరులోని తన స్వగృహంలోనే మరణించారు. తల్లి అంటే ఎంతో ప్రేమ గౌరవం ఉన్న ప్రకాష్ రాజ్ సినిమాల షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ తరచూ తన తల్లిని కలుస్తూ ఉంటారు. అయితే తన తల్లి మరణ వార్త తెలియగానే బెంగళూరుకు చేరుకున్నారు. ఇక నేడు సాయంత్రం స్వర్ణలత అంత్యక్రియలు జరగబోతున్నాయి.

Advertisement

ఇలా ప్రకాష్ రాజ్ తల్లి మరణించారనే వార్త తెలియగానే పలువురు ఈ విషయంపై స్పందిస్తూ సానుభూతి తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రకాష్ రాజ్ స్నేహితుడైన పవన్ కళ్యాణ్ సైతం సంతాపం ప్రకటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సినిమాల పరంగా వీరిద్దరూ చాలా మంచి స్నేహితులు వీరిద్దరి కాంబినేషన్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే రాజకీయాల పరంగా వీరిద్దరికీ విభేదాలు ఉన్నప్పటికీ, వాటన్నింటిని పక్కనపెట్టి పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ కుటుంబానికి సానుభూతి తెలియజేయడం విశేషం. ఇక పవన్ కళ్యాణ్ చేసిన ఈ పోస్టుపై అభిమానులు విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

Also Read: విజయ్ దేవరకొండతో నిహారిక పెళ్లి… రూమర్లు పై మెగా డాటర్ షాకింగ్ రియాక్షన్!

Related News

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సల్మాన్ ఖాన్.. వీడియో వైరల్!

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

Big Stories

Advertisement
×