E-Paper
Advertisement

సోమవారం పుట్టిన వారికి జీవితంలో 25 ఏళ్లకే ఏం జరుగుతుందో తెలుసా..?

సోమవారం పుట్టిన వారికి జీవితంలో 25 ఏళ్లకే ఏం జరుగుతుందో తెలుసా..?
Advertisement

Born on a Monday: మీరు సోమవారం పుట్టారా..? అయితే మీకు 25 ఏళ్లు వచ్చేసరికి ఏం జరుగుతుందో తెలుసా..? మీ లైఫ్‌ ఎలాంటి మలుపులు తిరుగుతుందో తెలుసా..? మీరు ఏ రంగంలో సెటిల్‌ అవుతారో తెలుసా..? మీకు కలిసొచ్చే అంశాలేంటో ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.

సోమవారం జన్మించిన వ్యక్తులపై చంద్రుని ప్రభావం ఎక్కువగా ఉంటుందట. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం  సోమవారానికి అధిపతి చంద్రుడు. చంద్రుడు మనస్సుకు, భావోద్వేగాలకు, సృజనాత్మకతకు, ప్రశాంతతకు కారకుడట. అయితే సోమవారం పుట్టిన వారి జీవితం, భవిష్యత్తు ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

సోమవారం పుట్టిన వారి వ్యక్తిత్వ లక్షణాలు: సోమవారం పుట్టిన వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారట. ఇతరుల బాధలను అర్థం చేసుకునే గుణం వీరిలో ఎక్కువగానే ఉంటుందట. వీరు చాలా సృజనాత్మక ఆలోచనలు చేస్తారట. కవిత్వం, కళలు లేదా కొత్త ఆలోచనల పట్ల ఆసక్తి చూపిస్తారట. అయితే చంద్రుని కళల మాదిరిగానే వీరి ఆలోచనలు కూడా అప్పుడప్పుడు మారుతుంటాయట. స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడంలో కొంత ఇబ్బంది పడతారట. ఇక సోమవారం పుట్టిన వారి మాటలు చాలా మృదువుగా, వినసొంపుగా ఉంటాయట.

సోమవారం పుట్టిన వారి జీవితం ఎలా ఉంటుంది: సోమవారం పుట్టిన వారు ప్రజలతో సంబంధాలు ఎక్కువగా ఉండే రంగాలలో బాగా రాణిస్తారట. వీరు సినిమా రంగం, పెయింటింగ్‌, పోటోగ్రఫీ, సంగీతం, రచయితలుగా బాగా రాణిస్తారట. అలాగే టీచర్స్‌గా కౌన్సెలర్లుగా డాక్టర్లుగా సేవారంగంలో కూడా స్థిరపడే అవకాశం ఉందంట. సోమవారం పుట్టిన వారు ట్రావెల్ అండ్ టూరిజం, ఫుడ్ అండ్ బెవరేజెస్ (హోటల్ వ్యాపారం) వంటి రంగాల్లో బాగా లాభపడతారట.

Advertisement

సోమవారం పుట్టిన వారికి టర్నింగ్‌ పాయింట్‌: సోమవారం పుట్టిన వారి జీవితంలో  24 నుంచి 26 ఏళ్ల వయస్సు మధ్య ఒక ముఖ్యమైన మలుపు వస్తుందట. ఆ సమయంలో వారికి మంచి ఉద్యోగం దొరకడం లేదా ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశం లభిస్తుందట. అలాగే  32 నుంచి 34 ఏళ్ల వయస్సు మధ్యలో వీరు తీసుకునే నిర్ణయాలు వారి జీవితాన్ని ఒక ఉన్నత స్థితికి తీసుకెళ్తాయట. ఆ వయస్సు తర్వాత వీరు సమాజంలో మంచి గుర్తింపును పొందుతారట.

సోమవారం పుట్టిన వారికి కలిసొచ్చే అంశాలు: సోమవారం పుట్టిన వారికి తెలుపు (White), వెండి రంగు (Silver) లేత నీలం (Light Blue) రంగులు  చాలా అదృష్టాన్ని ఇస్తాయట. వీరికి సోమవారం, శుక్రవారం చాలా శుభప్రదమైన రోజులట. అయితే చంద్రుని ప్రభావం వల్ల అప్పుడప్పుడు వీరు మూడ్ స్వింగ్స్ తో బాధపడవచ్చని… ఏ పని చేసినా భావోద్వేగాలకు లోనవ్వకుండా.. ఆత్మవిశ్వాసంతో చేస్తే విజయం లభిస్తుందని పండితులు సూచిస్తున్నారు.

సోమవారం పుట్టిన వారికి పరిహారం:  వీరు ప్రతిరోజూ లేదా ప్రతి సోమవారం శివారాధన చేయడం (శివాలయానికి వెళ్లడం) వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందట

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: జులై లో పుట్టారా..? మీకు 28 ఏండ్లు వచ్చాక ఏం జరుగుతుందో తెలుసా

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×