Producer SKN: సినిమా ఇండస్ట్రీలో హీరోలుగా కొనసాగుతున్న వారికి ఎంతో మంది అభిమానులు ఉంటారు ఈ నేపథ్యంలోనే తమ అభిమాన హీరో పుట్టినరోజు వచ్చింది అంటే అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటూ ఉంటారు. అయితే కొన్నిసార్లు ఇలాంటి వేడుకలలో అపశృతి చోటు చేసుకోవడం వల్ల కొంతమంది అభిమానులు ప్రాణాలను కోల్పోతూ ఉంటారు. తాజాగా పవన్ కళ్యాణ్ అభిమాని కూడా మరణించడంతో తీవ్ర విషాదం నెలకొంది.
సెప్టెంబర్ రెండవ తేదీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావడంతో రెండు తెలుగు రాష్ట్రాలలో అభిమానులు పెద్ద ఎత్తున పవన్ పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే అమలాపురంలోని ఓ కాలేజీ దగ్గర ఫ్లెక్సీ కడుతుండగా కరెంట్ షాక్ తగిలి బెండమూర్లంక గ్రామానికి చెందిన రోళ్ల ప్రేమ్ కుమార్ మరణించారు. ఈ విషయం తెలిసిన పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా పవన్ పుట్టినరోజు వేడుకలలో భాగంగా జరిగిన ఈ అపశృతి తెలిసినటువంటి నిర్మాత ఎస్కేన్ వెంటనే ఈ విషయంపై స్పందిస్తూ ప్రేమ్ కుమార్ కుటుంబానికి అండగా నిలిచారు.
పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలలో భాగంగా అభిమాని మరణించారని విషయం తెలిసిన ఎస్కేన్ సోషల్ మీడియా వేదిక స్పందిస్తూ..”నేను కూడా ఒకప్పుడు బ్యానర్లు కడుతూ, అభిమానిగా మొదలుపెట్టి ఈ స్థాయికి వచ్చాను. అందుకే ఒక అభిమాని బాధ నాకు ఎంత దగ్గరగా ఉంటుందో నాకు తెలుసు.అందులోనూ మన హీరో పుట్టినరోజు రోజునే మన అభిమాని ప్రేమ్ కుమార్ ఇలా అకాలంగా మనకు దూరమవ్వడం ఎంతో బాధ కలిగించింది. ఈ కష్ట సమయంలో నేను ఆయన కుటుంబం పక్కన ఒక అభిమానిగా, ఒక మనిషిగా నిలబడాలని అనుకుంటున్నాను. వారి బాధను తీర్చలేకపోయినా, నా వంతుగా ఒక చిన్న ఆర్థిక సహాయం 2,00,000 అందించడం ద్వారా నా సంఘీభావాన్ని తెలియజేయాలనుకుంటున్నాను.
మన అభిమాని కుటుంబానికి మనమంతా అండగా నిలుద్దాం”అంటూ ఎస్కేన్ తన మంచి మనసును చాటుకుంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.
నేను కూడా ఒకప్పుడు బ్యానర్లు కడుతూ, అభిమానిగా మొదలుపెట్టి ఈ స్థాయికి వచ్చాను. అందుకే ఒక అభిమాని బాధ నాకు ఎంత దగ్గరగా ఉంటుందో నాకు తెలుసు.
అందులోనూ మన హీరో పుట్టినరోజు రోజునే మన అభిమాని Prem Kumar ఇలా అకాలంగా మనకు దూరమవ్వడం ఎంతో బాధ కలిగించింది. 💔
ఈ కష్ట సమయంలో నేను ఆయన కుటుంబం…
— SKN (Sreenivasa Kumar) (@SKNonline) September 2, 2026
ఈ విధంగా పవన్ కళ్యాణ్ అభిమాని మరణించారనే విషయం తెలిసిన ఈయన ఆయన కుటుంబానికి ఏకంగా రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించడంతో నిర్మాత ఎస్కేన్ మంచి మనసు పై సోషల్ మీడియా వేదికగా అభినందనలు వెళ్లవెత్తుతున్నాయి. ఇదివరకు కూడా ఎన్నో సందర్భాలలో ఏ హీరో అభిమానికైనా ఆపద వస్తే ఎస్కేన్ వారికి ఆర్థిక భరోసా కల్పిస్తూ వచ్చారు. తాజాగా ప్రేమ్ కుమార్ కుటుంబానికి కూడా అండగా నిలవడం పట్ల ఈయన మంచి మనసు పై ప్రశంసలు కురిపిస్తున్నారు.ఎస్కేఎన్ విషయానికి వస్తే ఈయన ఇండస్ట్రీలో నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా కొనసాగుతూ మంచి సక్సెస్ అందుకున్నారు. ఇటీవల ఈయన నిర్మాణంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చెన్నై లవ్ స్టోరీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.
Also Read: రజనీకాంత్ జైలర్ 2 వాయిదాపై మేకర్స్ క్లారిటీ..వెనక్కి తగ్గేదేలే!