E-Paper
Advertisement

ఒంటిమీద బట్టలు లాగేసి ఘోరంగా అవమానించారు – స్టార్ కమెడియన్ ఎమోషనల్!

ఒంటిమీద బట్టలు లాగేసి ఘోరంగా అవమానించారు – స్టార్ కమెడియన్ ఎమోషనల్!
Advertisement

Actor Soori:ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఏ సెలబ్రిటీ అయినా సరే నేడు ఉన్నత స్థాయికి చేరుకున్నారు అంటే.. ఆ స్థాయి వెనుక కష్టం ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఒక హోదా లభించిన తర్వాత తమ జీవితంలో మర్చిపోలేని సంఘటనలను.. ఆ సెలబ్రిటీలు ఒక్కొక్కటిగా చెబుతూ ఉంటే అభిమానులు సైతం ఆశ్చర్యపోతూ ఉంటారు. ఈ క్రమంలోనే అలా ఎంతోమంది హీరోలు, హీరోయిన్లు ఇండస్ట్రీలో తాము ఎదుర్కొన్న అనుభవాలు , అనుభవించిన అవమానాల గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. అలాంటి వారిలో ప్రముఖ కోలీవుడ్ నటుడు సూరి(Soori ) కూడా ఒకరు.

నా జీవితంలో మర్చిపోలేని అవమానకర సంఘటన అదే..

మండాడి సినిమాతో ఇప్పుడు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అయ్యారు. కోలీవుడ్ లో వరుస చిత్రాలతో.. కమెడియన్ గా ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఈయన.. ఈ మధ్యకాలంలో వరుసగా హీరోగా అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిపోయారు. అలా ఆయన నటిస్తున్న చిత్రం మండాడి. తెలుగు, తమిళ్ భాషల్లో సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే సినిమా ప్రమోషన్స్ లో బిజీగా మారిన సూరి.. ఇండస్ట్రీలో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి పంచుకున్నారు.. “నేను ఒక పెద్ద హీరో మూవీ షూటింగ్ కోసం వెళ్లాను. అందులో ఒక పేరు మోసిన కమెడియన్ తో కలిసి నటించే సన్నివేశం చేయమన్నారు. షూటింగ్ పూర్తయిన తర్వాత.. ఆ పెద్ద హీరో , దర్శకుడు కలిసి మానిటర్లో సీన్ చూసుకున్నారు. ఆ తర్వాత వారు నా చొక్కా విప్పేసి.. రికమండేషన్ తో వచ్చిన వేరే వ్యక్తికి ఇవ్వమని చెప్పారు.

Advertisement

also read:ప్రభాస్ తో సుమంత్ ప్రభాస్.. ఒక్కమాటతో రియల్ క్యారెక్టర్ రివీల్!

చొక్కా లాగేసారు.. టవల్ కప్పుకొని బయటకు వచ్చా..

అయితే నేను అది నా చొక్కా కదా.. నేనెందుకు ఇవ్వాలి అని అడిగాను. కానీ వెంటనే నా చొక్కా లాగేసుకొని కాస్ట్యూమ్ వెహికల్ పైకి విసిరేశారు. ఇక ఆ సమయంలో నా ఒంటిపైన బట్టలు లేకపోయేసరికి టవల్ కప్పుకొని.. అవమాన భారంతో నా చొక్కా కోసం వెతికాను. ఇలా నా సినీ ప్రయాణంలో నన్ను అత్యంత మానసిక వేదనకు గురి చేసిన సంఘటన ఇదే.. నా జీవితాంతం ఈ సంఘటనను నేను మర్చిపోలేను” అంటూ సూరి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో మారుతున్నాయి.

మండాడితో ప్రేక్షకుల ముందుకు..

Advertisement

ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో హాస్యనటుడిగా నటించి భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న సూరి.. దర్శకుడు వెట్రిమారన్ దర్శకత్వంలో వచ్చిన విడుదలై అనే చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. తమిళంలో ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత మామన్ , గరుడన్ వంటి చిత్రాలు ఆయనను హీరోగా నిలబెట్టాయి. ఇప్పుడు మండాడి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మరి సూరికి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి. ఈ చిత్రానికి మాతి మారన్ దర్శకత్వం వహిస్తుండగా.. జీ.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

Related News

సాహో ప్రపంచంలోకి ఓజీ..? ఏం ప్లాన్ చేస్తున్నావ్ సుజిత్ ?

మీరే నాకు స్ఫూర్తి… బాబాయ్ కు అబ్బాయ్ విషెస్!

పవన్ అభిమాని మృతి..గొప్ప మనసు చాటుకున్న ఎస్కేఎన్!

నాని ‘ప్యారడైజ్’ అసలు కథ ఇదేనా?

రజనీకాంత్ జైలర్ 2 వాయిదాపై మేకర్స్ క్లారిటీ..వెనక్కి తగ్గేదేలే!

ప్రభాస్ తో సుమంత్ ప్రభాస్.. ఒక్కమాటతో రియల్ క్యారెక్టర్ రివీల్!

నేపాల్ విధ్వంసం.. రంగంలోకి సోనూసూద్.. ప్రజలకు విజ్ఞప్తి!

Big Stories

Advertisement
×