E-Paper
Advertisement

పవన్ కళ్యాణ్ వేలికి ఉన్న ఆ రింగ్ వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!

పవన్ కళ్యాణ్ వేలికి ఉన్న ఆ రింగ్ వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!
Advertisement

Pawan Kalyan Ring: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లోనైనా, సినిమాల్లోనైనా ఎప్పుడూ ట్రెండ్ సెట్టరే. ఆయన వేసుకునే కాటన్ కుర్తాలు, వాడే పెన్నులు, చదివే పుస్తకాలు.. ఇలా ప్రతి ఒక్కటీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంటాయి. అయితే, గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ కుడిచేతి వేలికి ధరిస్తున్న ఒక ప్రత్యేకమైన ఉంగరం (Ring) అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా ప్రముఖ జర్నలిస్ట్ స్మితా ప్రకాష్‌కు ఇచ్చిన ‘ANI పాడ్‌కాస్ట్’ ఇంటర్వ్యూలో ఆ ఉంగరం వెనుక ఉన్న అసలు రహస్యాన్ని, దాని వెనుక ఉన్న ఆధ్యాత్మిక విశేషాలను పవన్ స్వయంగా వెల్లడించారు.

Read also-Gundeninda GudiGantalu Today episode: రవిపై శృతి సీరియస్.. మీనా కాళ్ళు పట్టుకున్న బాలు.. ప్రభా డ్యాన్స్ కేక..

గురువుగారు

Advertisement

ఇంటర్వ్యూ ముగిసే సమయంలో యాంకర్ స్మితా ప్రకాష్ పవన్ కళ్యాణ్ చేతికి ఉన్న రింగ్ గురించి ప్రత్యేకంగా అడిగారు. అది జ్యోతిష్యానికి సంబంధించినదా? అని ప్రశ్నించగా.. పవన్ ఆసక్తికర సమాధానమిచ్చారు. “ఇది జ్యోతిష్యానికి సంబంధించినది కాదు. నా మనసు చాలా శక్తివంతమైనదని నేను నమ్ముతాను. నాకోసం నిరంతరం ప్రార్థనలు చేసే నా ఆధ్యాత్మిక గురువుగారు.. ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ ఉంగరాన్ని నాకు బహుమతిగా ఇచ్చారు” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

కూర్మావతారం – శ్రీచక్రంల కలయిక

ఆ ఉంగరం డిజైన్ కేవలం అలంకారం కోసం చేసినది కాదు, దాని వెనుక అపారమైన ఆధ్యాత్మిక అర్ధం దాగి ఉంది. అది శ్రీమహావిష్ణువు దశావతారాలలో ఒకటైన కూర్మావతారానికి (తాబేలు) ప్రతీక. అంతేకాదు, ఆ తాబేలు ఆకారంపై ‘శ్రీచక్రం’ కలిసి ఉంటుంది. శ్రీచక్రం ప్రాధాన్యతను వివరిస్తూ.. “శ్రీచక్రం అనేది కేవలం ఒక యంత్రం మాత్రమే కాదు. అది యావత్ విశ్వానికి, మానవ శరీరంలో ఉండే చక్రాలకు (శక్తి కేంద్రాలకు) ఒక సంపూర్ణ ప్రతీక” అని పవన్ వివరించారు.

Advertisement

Read also-Illu Illalu Pillalu Today Episodes: నర్మదా దెబ్బకు ఎస్సై కు మైండ్ బ్లాక్.. ధీరజ్ రిలీజ్.. భద్రకు ప్రేమ మాస్ వార్నింగ్..

ఆధ్యాత్మిక శాస్త్రంలో ‘కూర్మ రింగ్’ విశిష్టత ఏంటి?

ఆధ్యాత్మిక నిపుణుల ప్రకారం.. కూర్మావతార ఉంగరాన్ని ధరించడం వెనుక కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నాయి.

స్థిరత్వం మరియు ఓర్పు: సముద్ర మథనం సమయంలో మందర పర్వతాన్ని మోసి, లోక కల్యాణానికి కారణమైనది కూర్మావతారం. ఇది జీవితంలో ఎంతటి కష్టాలు వచ్చినా తట్టుకునే స్థిరత్వాన్ని, అపారమైన ఓర్పును ఇస్తుందని నమ్ముతారు.

కష్టాల నుంచి రక్షణ: గురువుగారు స్వయంగా మంత్రోచ్ఛారణలు చేసి, శ్రీచక్ర సమేతంగా ఇచ్చిన ఈ ఉంగరం పవన్ కళ్యాణ్‌కు ఒక రక్షా కవచంలా పనిచేస్తుందని ఆధ్యాత్మిక వర్గాలు భావిస్తున్నాయి. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ నిత్యం పూజలు, జపాలు, చాతుర్మాస్య దీక్షలు చేస్తూ అత్యంత నియమబద్ధమైన ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతున్నారు. ఈ క్రమంలో ఆయన ధరించిన ఈ ‘కూర్మ శ్రీచక్ర’ ఉంగరం ఇప్పుడు ఆయన అభిమానుల్లో, సామాన్య ప్రజల్లో తీవ్రమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Related News

నాని ది ప్యారడైజ్ నుంచి బిగ్ అప్డేట్.. టీజర్ విడుదల ఎప్పుడంటే?

జనాలను పిచ్చోళ్లని చేస్తున్నారా.. చెన్నై లవ్ స్టోరీ టీమ్ పై నెటిజన్స్ ఫైర్!

సినిమా తీయాలి.. గివ్ అవేలు ఇవ్వాలి.. ఏమీ టైం సర్ ఇది.. ఏమీ ప్రమోషన్!

రూ.కోటి విలువ చేసే టికెట్లు ఫ్రీగా పంచిపెట్టిన హీరో.. అసలు నిజం తెలిస్తే షాక్!

గౌతమ్ హీరోగా ఇండస్ట్రీ ఎంట్రీ అప్పుడే.. జయకృష్ణ క్లారిటీ!

నరేష్ మాటలకు స్టేజ్ దిగి వెళ్లిపోయిన బ్రహ్మాజీ.. అంత మాట అనేశాడు ఏంటి?

బాలకృష్ణను పరామర్శించిన ఏపీ ముఖ్యమంత్రి!

వివాదంలో చిక్కుకున్న నోలన్ ‘ది ఒడిస్సీ’ మూవీ.. 2వేల కోట్ల మూవీకి 6 లక్షలు ఇవ్వలేరా?

Big Stories

Advertisement
×