E-Paper
Advertisement

న్యూ జెనరేషన్ i20 వచ్చేస్తోంది.. టీజర్ తో హ్యుందాయ్ సర్ప్రైజ్!

న్యూ జెనరేషన్ i20 వచ్చేస్తోంది.. టీజర్ తో హ్యుందాయ్ సర్ప్రైజ్!
Advertisement

Next-Gen Hyundai i20 Teaser: హ్యుందాయ్ తన పాపులర్ ప్రీమియం హ్యాచ్‌ బ్యాక్ ఐ20 న్యూ జెనరేషన్ మోడల్‌ కు సంబంధించిన తొలి టీజర్‌ను విడుదల చేసింది. ఈ టీజర్‌ లో ఫోర్త్ జెనరేషన్ ఐ20 డిజైన్‌ లో వచ్చే కీ ఛేంజెస్ ను  చూపించింది. ఈ కొత్త కారు 2026 ఫిఫా వరల్డ్ కప్ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా పరిచయం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఆకట్టుకునే డిజైన్..

టీజర్‌ లో కారు ముందుభాగం,వెనుకభాగంలో పూర్తిగా కొత్త లైటింగ్ డిజైన్ కనిపిస్తోంది. ముఖ్యంగా కనెక్టెడ్ LED డేలైట్ రన్నింగ్ లైట్స్(DRLs), కనెక్టెడ్ LED టెయిల్ లైట్స్ ఈ మోడల్‌ కు కొత్త లుక్ ను తీసుకొచ్చాయి. ముందు భాగంలో Y ఆకారంలో ఉన్న LED లైటింగ్ ఎలిమెంట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అలాగే డ్యూయల్ ప్రొజెక్టర్ LED హెడ్‌ ల్యాంప్స్ కూడా మరింత స్టైలిష్‌ గా కనిపిస్తున్నాయి. ప్రస్తుత ఐ20తో పోలిస్తే కొత్త మోడల్ ముందు గ్రిల్ డిజైన్ పూర్తిగా భిన్నంగా ఉండనుంది. హ్యుందాయ్ వెర్నా మాదిరిగా హెడ్‌ లైట్లకు వేరుగా గ్రిల్‌ ను అమర్చే అవకాశం ఉంది. బోనెట్‌ పై కొత్త తరహా హ్యుందాయ్ లోగో ఉన్నట్లు టీజర్‌ లో కనిపించింది.

Advertisement

ఇక వెనుక భాగంలో కూడా డిజైన్‌ లోనూ పలు మార్పులు కనిపిస్తున్నాయి. C ఆకారంలో ఉన్న కొత్త LED టెయిల్ లైట్లు మధ్యలో ఒక LED లైట్ బార్ ద్వారా లింక్ చేసి ఉన్నాయి. దీంతో కారు వెనుక భాగం మరింత ప్రీమియం లుక్‌ను కలిగి ఉంది. ప్రస్తుత మోడల్‌తో పోలిస్తే కొత్త ఐ20 పరిమాణంలో కూడా కొంత పెద్దదిగా ఉండవచ్చని తెలుస్తోంది.

ఇంటీరియర్ గురించి..

ఇంటీరియర్ విషయానికి వస్తే హ్యుందాయ్ ఇంకా అధికారిక వివరాలు వెల్లడించలేదు. ఇటీవల బయటకు వచ్చిన స్పై ఫొటోలు చూస్తే, వెన్యూ మోడల్‌ లో ఉన్నట్లుగా డ్యూయల్ స్క్రీన్ సెటప్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త డిజైన్ స్టీరింగ్ వీల్‌ తో పాటు మరిన్ని ఆధునిక ఫీచర్లు కూడా అందుబాటులోకి రావచ్చు.

భద్రతా ఫీచర్ల గురించి..

Advertisement

భద్రతా అంశాల్లో కూడా హ్యుందాయ్ ఈసారి పెద్ద మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS), 360 డిగ్రీ కెమెరా, మెరుగైన సేఫ్టీ ఫీచర్లు కొత్త ఐ20లో అందించే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఈ కారు తన సెగ్మెంట్‌ లో మరింత పోటీగా మారనుంది.

ఇంజిన్ పరంగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న 1.2 లీటర్ పెట్రోల్, 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్లను కొనసాగించే అవకాశం ఉంది. అదే సమయంలో హ్యుందాయ్ కొత్త 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ ను కూడా అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. ఈ కొత్త ఇంజిన్ ప్రస్తుతం ఉన్న టర్బో మోటార్ కంటే మెరుగైన పనితీరును అందించవచ్చని తెలుస్తోంది. ఇండియన్ మార్కెట్ లోకి కొత్త ఐ20 ఎప్పుడు విడుదల అవుతుందనే ఇంకా వెల్లడించలేదు.

Read Also: హైబ్రిడ్ SUV సెగ్మెంట్‌ లో BYD ఎంట్రీ.. ఏకంగా 1200 కి.మీ రేంజ్ కారు రెడీ!

Related News

జూలైతో పోల్చితే ఆగస్టులో తగ్గిన EV స్కూటర్ అమ్మకాలు.. కారణం ఏంటంటే?

కైనెటిక్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఇప్పుడు ఏకంగా 132 కి.మీ రేంజ్!

టెస్లా సైబర్‌ ట్రక్‌కు ఇండియన్ టచ్.. ఫొటోలు చూస్తే నవ్వు ఆపుకోలేరు!

నెక్సాన్ To కర్వ్.. సెప్టెంబర్ లో టాటా కార్లపై ఊహించని డిస్కౌంట్లు!

మహీంద్రా SUVలపై భారీ డిస్కౌంట్లు.. స్కార్పియో Nపై ఏకంగా రూ.3 లక్షల తగ్గింపు!

ఎలక్ట్రిక్ స్కూటర్లకు సూపర్ డిమాండ్.. 8 నెలల్లోనే 13 లక్షలకు పైగా అమ్మకాలు!

సింపుల్ ఎనర్జీ సూపర్ జోష్.. ఏడాదిలో 10 వేలకుపైగా ఈవీ స్కూటర్ల సేల్!

ఈవీ రంగంలో హీరో దూకుడు.. నంబర్ వన్ కోసం అదిరిపోయే ప్లాన్!

Big Stories

Advertisement
×