E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: నర్మదా దెబ్బకు ఎస్సై కు మైండ్ బ్లాక్.. ధీరజ్ రిలీజ్.. భద్రకు ప్రేమ మాస్ వార్నింగ్..

Illu Illalu Pillalu Today Episodes: నర్మదా దెబ్బకు ఎస్సై కు మైండ్ బ్లాక్.. ధీరజ్ రిలీజ్.. భద్రకు ప్రేమ మాస్ వార్నింగ్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode june 11th: నర్మద ప్రేమలు ఎక్కడికి వెళ్లారు అని ధీరజ్ అడుగుతారు.. వాళ్లు ఉదయం నుంచి ఇంట్లో కనిపించలేదు ఎక్కడికి వెళ్లారు తెలియడం లేదు అని చందు అంటాడు.. అయితే అప్పుడే ఆ స్మగ్లర్ అన్ని తీసుకొని వచ్చి ధీరజ్ కాళ్ళ దగ్గర పడేస్తారు నర్మదా ప్రేమలు. అది చూసిన పోలీసు వీడు దొరికిసచ్చాడే నన్ను కూడా ఇరికించాడు ఏంటో అని కంగారు పడిపోతూ ఉంటారు.. ఎవరు నువ్వు తీసుకొచ్చి వీడే దొంగ అని అంటే నేను నమ్మాలా అంత పిచ్చోళ్ళు ఎవరూ లేరు అని ఎస్ఐ అంటాడు. అయితే వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్ ని చూపించిన సరే ఆ పోలీసు కావాలని అసలు నమ్మడు..

ధీరజ్ ను రిలీజ్ చేసిన ఎస్సై..

ప్రేమ నర్మదలు ఎంతగా చెప్తున్నా సరే అసలు వినకుండా ఏవైనా సాక్ష్యాలు ఉంటేనే మేము చూసుకుంటాము ముందు ఇతని కోర్టులో సబ్మిట్ చేయాలి అని ఎస్ఐ అంటాడు.. అయితే ప్రేమ నర్మదలు వీడియో చూపించి మరీ అతనికి కళ్ళు తెరిపించిన సరే కావాలనే తను దొరికిపోతాడని కోర్టుకు తీసుకెళ్తాను అని అంటారు.. ఇక నర్మదా మేం కూడా సివిల్ సర్వెంట్ మే విన్ని తీసుకుని ఎస్పీ దగ్గరికి వెళ్తాము. అతనికి ఈ వీడియో చూపించి జరిగిన విషయాన్ని చెప్తాము.. ఆ తర్వాత అతని ఎంక్వయిరీ చేయించి ఏం జరిగిందో అన్నది తెలుసుకుంటారు. ఆ తర్వాత ఎంక్వయిరీ స్టార్ట్ చేస్తారు అప్పుడు మీరే అడ్డంగా ఇరుక్కుంటారు అని అనగానే భయపడి పోయిన ఎస్సై ధీరజ్ ని రిలీజ్ చేయమని చెప్తారు. ఆ స్మగ్లర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుంటారు..

ప్రేమ, ధీరజ్ సీన్ కు ఫిదా..

Advertisement

మీరు మీ అబ్బాయిని తీసుకుని వెళ్లొచ్చు అని ఎస్ఐ అనగానే చందు వెళ్లి కారును తీసుకొని వస్తాడు.. ధీరజ్ రిలీజ్ అయ్యాడన్న ఆనందంలో ప్రేమ అక్కడ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయి అతని కౌగిలించుకొని బాధపడిపోతూ ఉంటుంది.. అయితే ప్రేమ చెయ్యికి దెబ్బ తగిలింది అని తెలుసుకొని ధీరజ్ బాధ పడిపోతాడు.. వీరిద్దరికీ ఒకరుంటే ఒకరికి ప్రేమ ఉందని రామరాజు చాలా సంతోషంగా ఉంటాడు.. వీళ్లిద్దరు చేసిన సాహసానికి రామరాజు ఫిదా అవుతాడు.. మీ ఇద్దరూ నా కోడల్ని అనిపించుకున్నారు.. మన ఇంటి గౌరవాన్ని కాపాడారు అని రామరాజు చాలా సంతోషంగా ఉంటారు..

శ్రీవల్లికి మైండ్ బ్లాక్..

వేదవతి తన కొడుకుని రిలీజ్ చేయించిన దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది.. నా మొర ఆలకించి నా కొడుకుని నిర్దోషిగా బయటకు వచ్చేలా చేశారు.. అని దేవుడి దగ్గర కన్నీళ్లు పెట్టుకుంటూ బాధపడిపోతూ ఉంటుంది వేదవతి.. అది చూసిన శ్రీవల్లి మంత్రాలకి ఎక్కడైనా చింతకాయలు రాలుతాయా దేవుడికి దీపం పెట్టి ఇలా మొక్కుకుంటే బయటికి వస్తారా అని వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది.. శ్రీవల్లికి కౌంటర్లు వేస్తూ సుకన్య కూడా మాట్లాడుతూ ఉంటుంది.. అప్పుడే ధీరజ్ వాళ్ళు రావడం చూసి శ్రీవల్లి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇది ఎలా సాధ్యం ఎలా ధీరజ్ బయటకు వచ్చాడు అని శ్రీవల్లి ఆలోచిస్తూ ఉంటుంది.

కొడుకును చూసి వేదవతి హ్యాపీ..

Advertisement

ధీరజ్ వచ్చాడని తెలుసుకున్న వేదవతి పరుగులు పెడుతూ అక్కడికి వెళుతుంది. చిన్నోడా నువ్వు వచ్చేసావా నీ కోసం నేను ఎంత బాధ పడ్డానో తెలుసా.. అనవసరంగా నిన్ను అరెస్ట్ చేశారు నువ్వు రిలీజ్ అవుతావని నాకు తెలుసు రా ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది అని వేదవతి ధీరజ్ని పట్టుకొని కన్నీళ్లు పెట్టుకుంటుంది. బుజ్జమ్మ ఇప్పుడు వాడు వచ్చాడు కదా ఇప్పుడు బాధపడొద్దు అని రామరాజు అంటాడు.. అయితే ధీరజ్ వచ్చాడని ఇంట్లోని వాళ్ళందరూ సంతోషంగా ఉంటే వల్లి మాత్రం షాక్ అవుతూ ఉంటుంది.. ప్రేమ ధీరజ్ నీ లాక్కొని బయటకు వెళ్తుంది..

భద్రకు స్ట్రాంగ్ వార్నింగ్..

ప్రేమ ధీరజ్ని తీసుకుని బయటికి వెళ్ళగానే అందరూ తన వెనకాల వస్తారు.. చాలా ఆవేశంగా భద్రావతి అనే గట్టిగా పిలుస్తుంది ప్రేమ. అది చూసిన వాళ్ళందరూ కూడా.. ఇప్పుడు వాళ్లను ఎందుకు పిలుస్తున్నావు అని అడుగుతున్నా సరే..అసలు వినకుండా వాళ్ళని కావాలని బయటకు పిలిపిస్తుంది ప్రేమ.. నా భర్త ఇక జీవితాంతం జైల్లోనే ఉండాలి నేను నీ ఇంటికి రావాలి అని అన్నావు కదా నా భర్త రిలీజ్ అయ్యి వచ్చేసాడు.. ఇద్దరిని మీరు ఎంతగా విడగొట్టాలని చూసినా సరే మేము అంతకుమించి దగ్గరవుతూ ఉంటాము. నా ప్రాణం తీయాలని చూసిన సరే నేను ధీరజ్ని విడిచిపెట్టను అని ప్రేమ భద్ర కు వార్నింగ్ ఇస్తుంది.. అదేవిధంగా ధీరజ్ కూడా భద్రాసేనలకు వార్నింగ్ ఇస్తాడు..

నర్మదా, ప్రేమల సాహసం..

ఇంట్లోకి వెళ్ళదని అసలు నర్మదా ప్రేమలు ఎంత పెద్ద సాహసం చేసారో తెలుసా అని చెందు చెప్తాడు.. అప్పుడే అక్కడికి వచ్చిన భాగ్యం ఆనందరావు కూడా శివంగిలాగ రెచ్చిపోయారు అని వాళ్ల గురించి గొప్పగా చెప్పడంతో వేదవతి తో పాటుగా.. మిగిలిన వాళ్ళందరూ కూడా చాలా ధైర్యం చేశారు అని పొగడ్తలతో ముంచెత్తుతారు.. వేదవతి మాత్రం నన్ను కూడా తీసుకెళ్లొచ్చు కదా అని అనగానే నర్మదా మిమ్మల్ని తీసుకుని వెళ్తే ఈ రోజుల్లో వచ్చేవాళ్ళం కాదు అని వెటకారంగా మాట్లాడుతుంది. కానీ సాగర్ మాత్రం రామరాజు తన మీద కోపంగా ఉండడం తప్పు అంటూ మళ్ళీ గొడవకు దిగుతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Intinti Ramayanam Today Episode: అయ్యో.. సుబ్బారావు.. పాపం అవని.. మీనాక్షిని ఇరికించేందుకు పల్లవి కుట్ర..

Related News

ఆట మొదలుపెట్టిన షాలిని.. ఇదికదా అసలైన సింపథీ గేమ్!

8 ఏళ్లకే తల్లి మరణం.. ఆపై తండ్రి కూడా..బిగ్ బాస్ కంటెస్టెంట్ జీవితంలో అన్నీ కన్నీళ్లే!

బిగ్ బాస్ హౌస్ నుంచి ఫస్ట్ ఎలిమినేషన్ ఎవరంటే?

Ye devi varamo Neevu : ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. హీరో అవుట్..

Podarillu Manisha : అమ్మబాబోయ్.. మనీష బాగా రిచ్.. హీరోయిన్ల కంటే ఎక్కువే..

Nindu Noorella Saavasam Serial Today Episode September 10th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: బుజ్జమ్మ ఆత్మను వేరు చేసిన ప్రచండ 

సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. శుభం కార్డు పడుతుందా..?

Karthika Deepam 2 Serial Today Episode September 10th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: ఒకరినొకరు కొట్టుకున్న శివనారాయణ, దక్షిణమూర్తి      

Big Stories

Advertisement
×