BigTV English

OG Movie : పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ హిందీలో శాటిలైట్ రైట్స్‌కు క్రేజీ ఆఫర్.. హిట్ పక్కా..!

OG Movie : పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ హిందీలో శాటిలైట్ రైట్స్‌కు క్రేజీ ఆఫర్.. హిట్ పక్కా..!

OG Movie : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన రీసెంట్ మూవీ హరిహర వీరమల్లు.. ఇటీవల థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ టాక్ ని సొంతం చేసుకుంది.. ఇప్పుడు అందరి ఫోకస్ పవన్ కళ్యాణ్ నటించిన మరో యాక్షన్ మూవీ ఓజీ.. గతంలో ఈ మూవీని ముందుగా థియేటర్లలోకి తీసుకురావాలని అనుకున్నా షూటింగ్ పూర్తి కాకపోవడంతో దీన్ని పోస్ట్ ఫోన్ చేసుకున్నారు.. ప్రస్తుతం దీని కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. గత కొద్ది రోజులగా ఈ మూవీ రెండు పార్ట్ లుగా రాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఇదిలా ఉండగా తాజాగా ఈ మూవీ హిందీ శాటిలైట్స్ రైట్స్ భారీ ధరకు అమ్ముడు పోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి..


భారీ ధరకు హిందీ శాటిలైట్ రైట్స్‌..

డిప్యూటీ సీఏం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ఓజి’ ఇప్పటికే అభిమానుల్లో సాలిడ్ హైప్ ను క్రియేట్ చేసుకుంది. స్టార్ డైరెక్టర్సుజిత్ తెరకెక్కించిన ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాలో పవన్ పవర్‌ఫుల్ లుక్ తో ఆడియన్స్ ను థ్రిల్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇందులో పవన్ కళ్యాణ్ యాక్షన్ రామా వేరే లెవెల్ లో ఉండబోతుందని మేకర్స్ చెబుతున్నారు. అయితే దీనికి తెలుగులో మాత్రమే కాదు అటు హిందీలో కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమాకు హిందీలో కూడా సాలిడ్ బజ్ ఏర్పడింది. దీంతో ఈ చిత్ర హిందీ శాటిలైట్ రైట్స్ కోసం భారీ పోటీ నెలకొంది. ఇక దీన్ని ప్రముఖ హిందీ ఛానెల్ స్టార్ గోల్డ్ టీవీ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్ని కోట్లు చెల్లించిందో త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.


ముంబై గ్యాంగ్స్ స్టర్ గా పవన్ కళ్యాణ్.. 

హీరో పవన్ కళ్యాణ్ గతంలో ఎక్కువగా లవర్ బాయ్ పాత్రలలో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. అయితే ఈ చిత్రంలో మాత్రం ముంబై గ్యాంగ్స్టర్ గా ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. గతంలో ఎప్పుడూ పవన్ కళ్యాణ్ ఇలాంటి పాత్రలో నటించలేదు. దాంతో ఈ సినిమాపై అభిమానులు క్యూరియాసిటీని చూపిస్తున్నారు. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రతి అప్డేట్ కూడా మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. సెప్టెంబర్ 25న భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతుంది. అదే రోజున నందమూరి నటసింహం బాలయ్య నటిస్తున్న అఖండ 2 కూడా రిలీజ్ కాబోతుంది. ఈ రెండు సినిమాలలో దసరా విన్నర్ గా ఏ సినిమా నిలుస్తుందో చూడాలి.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటిస్తున్నాడు.. ఈ మూవీని అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Related News

Anasuya Bharadwaj : అనసూయ మళ్లీ దొరికిందిరోయ్..వీడియో హల్ చల్..

Honey Rose : హనీ రోజ్ నువ్వెక్కడ..? సినిమాలకు గుడ్ బై చెప్పేసిందా..?

War 2 – Ntr: ఎన్టీఆర్ కి ఘోర అవమానం, ఈ కష్టం పగోడికి కూడా రాకూడదు

Rajinikanth: ఎంతమంది జీవితాలతో ఆడుకుంటారు? రజనీ ను చూసి నేర్చుకోండి – సజ్జనర్

Actor Suman: ఆయన దయతోనే రాజకీయాలలోకి వస్తా.. క్లారిటీ ఇచ్చిన సుమన్!

Big Stories

×