OTT Movie : మనుషులను చంపి తినే నరమాంస భక్షకుల గురించి చెప్పుకుంటేనే ఒళ్ళు జలదరిస్తుంది. అలాంటి స్టోరీతో వచ్చిన ఒక సిరీస్ ఎన్నో అవార్డులను గెలిచి, టాప్ రేటింగ్ తో దూసుకుపోయింది. ప్రస్తుతం ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ 2014, 2015లో సాటర్న్ అవార్డ్స్ లో బెస్ట్ నెట్వర్క్ టెలివిజన్ సిరీస్ అవార్డ్ ను గెలుచుకుంది. మ్యాడ్స్ మిక్కెల్సెన్, హ్యూ డాన్సీలకు Best Actor, లారెన్స్ ఫిష్‌బర్న్‌కి Best Supporting Actor (సీజన్ 2), రిచర్డ్ ఆర్మిటేజ్‌కి Best Supporting Actor (సీజన్ 3) అవార్డులు వచ్చాయి. 2014 IGN Award for Best TV Series కూడా గెలుచుకుంది. ఈ సిరీస్ స్టోరీ ఏమిటి ? ఎందులో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే …
మూడు ఓటీటీలలో స్ట్రీమింగ్
‘హన్నిబాల్’ (Hannibal) అమెరికన్ సైకలాజికల్ థ్రిల్లర్ టీవీ సిరీస్. ఇందులో హ్యూ డాన్సీ, మ్యాడ్స్ మిక్కెల్సెన్, ఫిష్‌బర్న్, ఆర్మిటేజ్ ప్రధాన పాత్రలు పోషించారు. బ్రయాన్ ఫుల్లర్ సృష్టించిన ఈ సిరీస్, థామస్ హ్యారిస్ నవల ఆధారంగా, 3 సీజన్లు, 39 ఎపిసోడ్‌లతో NBCలో 2013 ఏప్రిల్ 4 నుంచి 2015 ఆగస్ట్ 29 వరకు ప్రసారమైంది. విల్ గ్రాహం (హ్యూ డాన్సీ) పోరాటం, హన్నిబాల్ మానిపులేటివ్ గేమ్స్ ఈ సిరీస్‌ని కల్ట్ క్లాసిక్‌గా చేశాయి. ప్రస్తుతం Amazon Prime Video, Hulu, Shudderలో హిందీ, ఇంగ్లీష్ ఆడియోతో స్ట్రీమింగ్ అవుతోంది. IMDb లో ఈ సిరీస్ 8.5/10 రేటింగ్ ను పొందింది.
స్టోరీ
విల్ గ్రాహం అసాధారణ సామర్థ్యం గల FBI ఏజెంట్. సీరియల్ కిల్లర్ల మనస్తత్వాన్ని ఊహించి, వాళ్ళు హత్యలను ఎలా చేశారో చెప్పగల సామర్థ్యం ఉన్నవాడు. FBI హెడ్ జాక్ క్రాఫోర్డ్ విల్‌ని మిన్నెసోటాలో ఒక సీరియల్ కిల్లర్ కేసులో సహాయం కోసం తీసుకుంటాడు. ఇతనితో పాటు డాక్టర్ హన్నిబాల్ అనే ప్రముఖ ఫోరెన్సిక్ సైకియాట్రిస్ట్‌తో కూడా జత కడతాడు. హన్నిబాల్ నిజానికి ఒక కానిబల్ సీరియల్ కిల్లర్. FBIని మానిపులేట్ చేస్తూ, విల్‌తో ఒక ఎమోషనల్, సైకలాజికల్ బంధాన్ని ఏర్పరచుకుంటాడు. సీజన్ 1లో విల్, హన్నిబాల్ సహాయంతో గారెట్, జాకబ్ హాబ్స్ వంటి కానిబల్ కిల్లర్లను పట్టుకుంటాడు. కానీ హన్నిబాల్ విల్‌ని తన డార్క్ సైడ్‌కి లాగడానికి ప్రయత్నిస్తాడు. అతన్ని కూడా హత్యలు చేయాడానికి ప్రేరేపిస్తాడు. అలానా, బెవర్లీ కాట్జ్, ఫ్రెడ్డీ వంటి పాత్రలు విల్, హన్నిబాల్ చుట్టూ తిరుగుతాయి. హన్నిబాల్ విల్ మనసుని కంట్రోల్ చేస్తుంటాడు.
సీజన్ 2లో విల్‌కి హన్నిబాల్ ఒక కానిబల్ కిల్లర్ అని అనుమానం వస్తుంది. కానీ హన్నిబాల్ తనని ఫ్రేమ్ చేసి జైలు పంపిస్తాడు. విల్ ఈ సంఘటన నుండి బయటపడి, హన్నిబాల్‌ని ఎదిరిస్తాడు. అబిగైల్ హాబ్స్, మార్గోట్ వెర్గర్ వంటి పాత్రలతో స్టోరీ మరింత ఆసక్తికరంగా మారుతుంది. సీజన్ 3లో హన్నిబాల్ యూరప్‌లో పరారీలో ఉంటాడు. విల్, జాక్, అలానా అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. హన్నిబాల్ యూరప్ ఎస్కేప్, విల్, హన్నిబాల్ మధ్య సంబంధం, విల్‌ని కిల్లర్‌గా మార్చే హన్నిబాల్ ప్రయత్నంతో ఈ సిరీస్ ఉత్కంఠభరితంగా ముగుస్తుంది. చివరికి హన్నిబాల్ ని విల్ పట్టుకుంటాడా ? అతని గురించి ఎలాంటి సీక్రెట్స్ బయటపడతాయి ? ఈ సిరీస్ ఎలా ఎండ్ అవుతుంది ? అనే విషయాలను, ఈ సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్ ను చూసి తెలుసుకోండి.
Read Also : ఇంటి ఓనర్లే ఈ కిల్లర్ టార్గెట్… వీడి చేతికి చిక్కారో నరకమే… క్రేజీ మలయాళ సైకో థ్రిల్లర్