E-Paper
Advertisement

దురంధర్ పై పవన్ కళ్యాణ్ ఫీలింగ్..ఆ ఒక్కటే నాకు బాగా నచ్చింది..

దురంధర్ పై పవన్ కళ్యాణ్  ఫీలింగ్..ఆ ఒక్కటే నాకు బాగా నచ్చింది..
Advertisement

Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ప్రస్తుతం రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్న పవన్ కళ్యాణ్ తాజాగా జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన విషయం తెలిసిందే.. ఇంటర్వ్యూలో తన గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. కాశ్మీర్ అంశాలు, అలాగే సౌత్-నార్త్ సినీ పరిశ్రమల మధ్య ఉన్న సంబంధాలపై తన అభిప్రాయాలను చెప్పుకొచ్చారు. దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియలను ఆకట్టుకున్న దురంధర్ మూవీ పవన్ కళ్యాణ్ ప్రశంసలు గుర్తించారు. ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను ఆయన పంచుకున్నారు.. ఈ ఇంటర్వ్యూ వీడియో వైరల్ అవ్వడంతో ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ పవన్ కళ్యాణ్ దురంధర్ మూవీ గురించి ఏం చెప్పారు అన్నది ఇప్పుడు మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

దురంధర్ బోల్డ్ నెస్ నచ్చింది…

ఇంటర్వ్యూలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటించిన దురంధర్ మూవీ గురించి మాట్లాడారు. ధైర్యమైన కథనం, ఆ బోల్డ్ నెస్, దర్శకుడి మేకింగ్ స్టైల్, స్క్రీన్ ప్లే ట్రీట్మెంట్ తనకు ఎంతగానో నచ్చాయని చెప్పారు.. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న నేపథ్యంలో ఆయన ఈ సినిమాని పూర్తిగా చూడలేదని చెప్పుకొచ్చారు.. దురంధర్ 2 మూవీని సమయం వచ్చినప్పుడు చూస్తానని ఆయన అన్నారు. ఒక ఉప ముఖ్యమంత్రి, స్టార్ హీరో ఈ సినిమాపై ప్రస్థావించడంతో ప్రస్తుతం ఇది మరోసారి హాట్ టాపిక్ గా మారింది.. అదే విధంగా పవన్ కళ్యాణ్ ‘బారాముల్లా’ సినిమా గురించి సుదీర్ఘంగా మాట్లాడారు.. ఈ మూవీ తనను ఎంతో ప్రభావితం చేసిందని చెప్పారు.

Advertisement

Also Read :Illu Illalu Pillalu Today Episodes: నర్మదా దెబ్బకు ఎస్సై కు మైండ్ బ్లాక్.. ధీరజ్ రిలీజ్.. భద్రకు ప్రేమ మాస్ వార్నింగ్..

పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికొస్తే..

మెగా కాఫౌండ్ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన.. ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ ఒక్కో మెట్టు ఎదుగుతూ అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు.. రాజకీయాల్లోకి రావాలని కోరికతో పార్టీని స్థాపించాడు. జనసేన పార్టీ ఏపీలో జరిగిన గత ఎన్నికల్లో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.. ఈ క్రమంలో ఆయన ఏపీ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం గా బాధ్యతలు స్వీకరించారు. అయితే ఆయన ఎన్నికల్లో పోటీ చేయకముందు కమిటైన సినిమాలను పూర్తి చేశారు.. ప్రస్తుతం సినిమాలపై ఫోకస్ పెట్టినట్లు కనిపించలేదు. త్వరలోనే గోదావరి పుష్కరాలు కూడా ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో సినిమాలకు బ్రేక్ తీసుకున్నట్లు సమాచారం.. ప్రస్తుతం ఆయన రెండు సినిమాలు చెయ్యాల్సి ఉంది.. డైరెక్టర్ సురేందర్ రెడ్డి తో ఓ మూవీ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కథను పూర్తి చేసే పనిలో ఉన్నట్లు టాక్.. ఓజీ 2 మూవీ కూడా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.. దీని తర్వాత సినిమాలకు కంప్లిట్ గా గుడ్ బై చెప్పనున్నాడని టాక్..

Related News

పిల్లలు ఉన్నా.. లేకపోయినా ఒకే అనుకున్నాం..కానీ: సమంత

ఫౌజీ అసలు వస్తుందా? ప్రభాస్ సినిమా చుట్టూ పెరుగుతున్న సస్పెన్స్!

ఫ్యాన్స్ అంటే సెలబ్రేషన్స్ మాత్రమే కాదు..మనసులు గెలిచిన అల్లు అర్జున్ ఫ్యాన్స్!

మనవడి కోసం నాగబాబు సంచలన నిర్ణయం!

అప్పుడే ఏడాది..క్యూట్ పిక్ తో కొడుకుకి స్పెషల్ విషెస్ చెప్పిన వరుణ్ తేజ్ !

ఫ్యాన్స్ కి విజయ్ దేవరకొండ పిలుపు!

నిఖిల్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ‘స్వయంబు’ రిలీజ్ అప్పడే..?

‘సర్దార్ 2’ ట్విట్టర్ రివ్యూ.. కార్తీ అకౌంట్లో హిట్ పడిందా..?

Big Stories

Advertisement
×