E-Paper
Advertisement

హ‌ర్మూజ్ జలసంధిలో అమెరికా సీక్రెట్ ఆపరేషన్..గుట్టు బయటపెట్టిన ట్రంప్, ఇదీ అసలు మేటర్

హ‌ర్మూజ్ జలసంధిలో అమెరికా సీక్రెట్ ఆపరేషన్..గుట్టు బయటపెట్టిన ట్రంప్, ఇదీ అసలు మేటర్
Advertisement

Trump: ప్రపంచంలో చమురు రవాణకు కీలకమైనది హ‌ర్మూజ్ జలసంధి. అసలు అమెరికా బలగాలు అక్కడే ఎందుకు మకాం పెట్టాయి? అక్కడి నుంచి బలగాలు ఎందుకు కదల్లేదు? జలసంధిలో ఏం జరుగుతోంది? గుట్టంతా బయటపెట్టారు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.

హ‌ర్మూజ్ జలసంధిలో అమెరికా సీక్రెట్ ఆపరేషన్

Advertisement

ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. అంతేకాదు సంచలనమైన విషయాలను ఆయన బయటపెట్టారు. హ‌ర్మూజ్ జలసంధిలో తమ సైన్యం సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించిందని వెల్లడించారు.

ఈ ఆపరేషన్‌లో భాగంగా దాదాపు 100 మిలియన్ బ్యారెళ్లకు పైగా చమురును తరలించామన్నారు. ఈ విషయం ఇరాన్‌కు తెలుసన్నారు. తాము చేపట్టిన ఆపరేషన్ ద్వారా అంతర్జాతీయ మార్కెట్లో చమురు సరఫరాకు అంతరాయం కలగకుండా చూశామన్నారు. ఆయిల్ ట్యాంకర్లు, వాణిజ్య నౌకలు ప్రయాణించేందుకు సహకరించాలని సైన్యాన్ని ఆదేశించానని వివరించారు.

Advertisement

గుట్టు బయటపెట్టిన అధ్యక్షుడు ట్రంప్, మావల్లే ధరలు పెరగలేదు

దీని కారణంగా 100 మిలియన్ బ్యారెళ్లకు పైగా చమురు జలసంధిని దాటి బహిరంగ మార్కెట్‌లోకి చేరిందన్నారు. అంతేకాదు 200కు పైగా వాణిజ్య నౌకలు సురక్షితంగా ప్రయాణం చేశాయని తన పోస్టులో పేర్కొన్నారు. ఈ ఆపరేషన్ వల్ల అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు బ్యారెల్‌కు 85-90 డాలర్లు ఉందన్నారు.

ఇరాన్ ఆంక్షల కారణంగా చమురు సరఫరాకు ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు చేపట్టామన్నారు. తాము చేపట్టిన మిషన్‌కు ప్రమాదం కలగకూడదనే ఉద్దేశంతో ఇప్పటివరకు సీక్రెట్ గా ఉంచామన్నారు. ఇరాన్-ఒమన్ మధ్య హ‌ర్మూజ్ జలసంధి ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైనదని ప్రస్తావించారు.

ALSO READ: ఇరాన్‌పై అమెరికా భీకరదాడులు.. హార్ముజ్ జలసంధిని మూసివేసిన ఇరాన్

ప్రపంచవ్యాప్తంగా రవాణా అయ్యే చమురు, గ్యాస్‌లో దాదాపు 20 శాతం దీనిద్వారానే వెళ్తుందన్నారు. ఇప్పటివరకు ఇరాన్‌కు చెందిన 22 నౌకలను ధ్వంసం చేశామన్నారు. వారి వద్ద రాడార్ వ్యవస్థ లేదని, వాటిని నాశనం చేశామన్నారు. ఇప్పటివరకు ఇరాన్‌కు చెందిన 22 నౌకలను ధ్వంసం చేశామన్నారు. వారి వద్ద రాడార్ వ్యవస్థ లేదని, వాటిని నాశనం చేశామన్నారు.

మే నెల ప్రారంభంలో హోర్ముజ్ జలసంధి ద్వారా నౌకలకు రక్షణగా వెళ్లేందుకు ప్రాజెక్ట్ ఫ్రీడమ్ పేరుతో అమెరికా సైనిక చర్యను ప్రారంభించిందన్నారు. మిత్రదేశాల నుంచి మద్దతు లభించకపోవడంతో మరుసటి రోజు దానిని రద్దు చేశారు ట్రంప్. మొత్తానికి ట్రంప్ చెబుతున్న సమాధానాలు చూస్తుంటే మావల్లే ధరలు పెరగలేదని చెప్పే ప్రయత్నం చేశారు.

Related News

13 రోజుల బాంబుల వర్షం తర్వాత క్లైమాక్స్… ట్రంప్ నిర్ణయంతో మారిపోయిన సీన్!

సిరియాలో ఘోర ప్రమాదం.. రెండు బస్సులు ఢీ, 35 మంది మృతి, 30 మందికి పైగానే గాయాలు

కెనడాలోనూ ఉన్మాదమే.. ప్రేయసిని చంపిన ఇండియన్ ప్రియుడు.. ఏం జరిగిందంటే?

ఒకే ఇంట్లో భార్యాభర్తలు.. కానీ 20 ఏళ్లుగా మాటలు కట్.. ఎందుకో తెలిస్తే షాక్!

1100 రోజులుగా జైల్లోనే ఇమ్రాన్ ఖాన్.. ‘మిస్ యూ డాడీ’ అంటూ.. కుమారుడు ఆసక్తికర పోస్ట్!

లగ్జరీ హోటల్‌లో రాత్రి ఏం జరిగింది? సౌదీ ప్రిన్స్ మృతి, వెలుగులోకి కీలక విషయాలు

ఇండియా సహా 60 దేశాలపై అమెరికా టారిఫ్స్ బాంబ్.. నేటి నుంచే అమలు.. అసలు కారణం ఇదే!

ట్రంప్ కొత్త సుంకాలు.. 60 దేశాలపై ప్రభావం, మరి ఇండియా మాటేంటి?

Big Stories

Advertisement
×