E-Paper
Advertisement

అపోలోలో ఐసీయూలో ‘గబ్బర్ సింగ్’ రమేష్.. రంగంలోకి దిగిన పవన్ కళ్యాణ్ టీమ్!

అపోలోలో ఐసీయూలో ‘గబ్బర్ సింగ్’ రమేష్.. రంగంలోకి దిగిన పవన్ కళ్యాణ్ టీమ్!
Advertisement

Gabbar Singh Ramesh:’గబ్బర్ సింగ్’ ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ఎంత పెద్ద హిట్ అయిందో ,ఆ సినిమాలో పోలీస్ స్టేషన్ లో చేసిన అంత్యాక్షరి సీన్ అంతే ఫేమస్ అయింది.ఇక ఆ సీన్ లో కనిపించిన ఆర్టిస్టులు అంతా గబ్బర్ సింగ్ గ్యాంగ్ గా మంచి పేరు తెచ్చుకున్నారు కూడా. అయితే ఈ గ్యాంగ్ లో ఒకరైన గబ్బర్ సింగ్ రమేష్ నిన్న ఇంట్లో ఉన్న సమయంలో బ్రెయిన్ స్ట్రోక్ రావడం, ఆయన్ని ఆస్పత్రికి తరలించడం తెల్సిందే.

రియాక్ట్ అయిన సినీ పవన్ కళ్యాణ్ టీమ్

Advertisement

ఇక గబ్బర్ సింగ్ రమేష్ భార్య ఎలాగైనా తన భర్తని కాపాడాలంటూ పవన్ కళ్యాన్, చిరంజీవి, రామ్ చరణ్ లని వేడుకుంటూ వదిలిన వీడియా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కూడా.అలా గబ్బర్ సింగ్ రమేష్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వెంటనే సినీ ఇండస్ట్రీ వెంటనే రియాక్ట్ అయింది.

రమేశ్‌ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు పవన్ కళ్యాణ్ టీమ్ రంగంలోకి దిగింది. గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్‌తో పవన్ టీమ్ ప్రత్యేకంగా చర్చలు జరిపింది. ఇక ఇదే క్రమంలో పవన్ సూచనల మేరకు దర్శకుడు హరీష్ శంకర్ వెంటనే అపోలో ఆసుపత్రికి చేరుకుని రమేశ్‌ను పరామర్శించారు.ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఆర్థిక సహాయంతో పాటు మెరుగైన వైద్యం అందేలా పవన్ కళ్యాణ్ స్వయంగా బాధ్యత తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

Advertisement

అయితే ప్రస్తుతం ఆయన ఐసీయూలో వెంటిలేటర్‌పై అత్యవసర చికిత్స పొందుతుండగా, పరిస్థితి అత్యంత విషమంగా ఉందని సమాచారం.న్యూరాలజీ నిపుణుల బృందం ఆయనకు నిరంతరం చికిత్స అందిస్తూ ఆరోగ్యాన్ని అబ్జర్వేషన్ లో పెట్టినట్టు తెలుస్తుంది.

‘గబ్బర్ సింగ్’ లో అంత్యాక్షరి సీన్ లో నటించిన రమేష్

ఇక ‘ విషయానికి వస్తే 2012 మే 11న విడుదలై టాలీవుడ్ రికార్డులను తిరగరాసిన ‘గబ్బర్ సింగ్’ చిత్రంలో అంత్యాక్షరి సీన్ లో నటించిన రమేష్ రాత్రికి రాత్రే ‘గబ్బర్ సింగ్ రమేశ్‌’ గా పేరు తెచ్చేసుకున్నాడు. ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో ఆయన పండించిన కామెడీ థియేటర్లలో ఆడియన్స్ ని పొట్ట చెక్కలయ్యేలా నవ్వించింది. ఆ తర్వాత ఆయన 2013లో వచ్చిన ‘అత్తారింటికి దారేది’, ‘రామయ్య వస్తావయ్యా’, అలాగే 2015లో వచ్చిన ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ వంటి ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాల్లో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కూడా.ఇక లేటెస్ట్ గా హరీష్ శంకర్ – పవన్ కళ్యాణ్ కాంబోలో వచ్చిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో కూడా ఆయన కీలక పాత్రలో కనిపించాడు ‘గబ్బర్ సింగ్ రమేశ్‌’

ఏది ఏమైనా తనదైన కామెడీతో నవ్వులు పూయించిన రమేష్ మళ్ళీ తిరిగి కోలుకోవాలని మళ్లీ ఎప్పటిలాగే నవ్వుతూ స్క్రీన్‌పై కనిపించాలని అభిమానులు, సినీ ప్రముఖులు దేవుడిని ప్రార్థిస్తున్నారు.

also read :చెన్నై జ్ఞాపకాలు నెమరువేసుకున్న చిరంజీవి.. ‘చెన్నై లవ్ స్టోరీ’ ఈవెంట్ హైలైట్స్!

Related News

చెన్నై జ్ఞాపకాలు నెమరువేసుకున్న చిరంజీవి.. ‘చెన్నై లవ్ స్టోరీ’ ఈవెంట్ హైలైట్స్!

Jananayagan Twitter Review : ‘ జననాయగన్’ ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

RAW NTR సంచలన నిర్ణయం.. సంస్థ మూసివేత!

సీజేపీ ఉద్యమం.. విద్యార్థులకు అండగా ప్రియా వారియర్, గౌరీ జి కిషన్!

శ్రీవారి సన్నిధిలో మరో వివాదం.. పెద్ది పోస్టర్ తో మహిళా హల్ చల్!

ధురంధర్ నటి ఆయేషా ఖాన్ అరెస్ట్.. అసలేం జరిగిందంటే?

ఇండియాలో 450కి పైగా షోలు.. 59దేశాలలో స్క్రీనింగ్.. కృతజ్ఞతలు చెప్పిన డైరెక్టర్!

Big Stories

Advertisement
×