చాలామంది శరీరం ఫిట్‌గా, చేతులు అందంగా కనిపించాలని కోరుకుంటారు. అయితే పొట్ట కొవ్వు తగ్గినా, చేతులపై పేరుకున్న కొవ్వు మాత్రం త్వరగా తగ్గదు. దీనివల్ల స్లీవ్‌లెస్ దుస్తులు ధరించడానికి కొందరు సంకోచిస్తారు. అందుకే జిమ్‌కు వెళ్లకుండానే రోజుకు కేవలం 10 నిమిషాలు ఈ వ్యాయామాలు చేస్తే చేతులు క్రమంగా బలంగా, ఆకర్షణీయంగా మారవచ్చు. ఇవి జబ్బల కండరాలను కూడా బలోపేతం చేస్తాయి.
ఆర్మ్ సర్కిల్స్ చాలా సులభమైన వ్యాయామం. దీనికి ఎలాంటి పరికరాలు అవసరం ఉండవు. నిటారుగా నిలబడి రెండు చేతులను భుజాల ఎత్తులో చాపాలి. అరచేతులను కిందివైపు ఉంచి చిన్న చిన్న వలయాలుగా 30 సెకన్లు ముందుకు తిప్పాలి. తరువాత మరో 30 సెకన్లు వెనుకవైపు తిప్పాలి. ఇలా ప్రతిరోజూ చేస్తే చేతులు, భుజాల కండరాలు బలపడతాయి.
చేతుల వెనుక భాగంలో ఉన్న కండరాలను బలపరచడానికి ట్రైసెప్ డిప్స్ ఉపయోగపడతాయి. ఒక బలమైన కుర్చీ లేదా బెంచ్‌ను ఉపయోగించండి. కుర్చీకి వెనక్కి తిరిగి నిలబడి చేతులను అంచుపై ఉంచండి. కాళ్లను కొద్దిగా ముందుకు పెట్టి శరీరాన్ని మెల్లగా కిందికి దించండి. తరువాత చేతుల బలంతో మళ్లీ పైకి లేవాలి. 10 నుంచి 12 సార్లు రెండు సెట్లు చేయడం మంచిది.
సాధారణ పుష్ అప్స్ చేయలేని వారికి వాల్ పుష్ – అప్స్ మంచి ఆప్షన్. గోడ ఎదురుగా నిలబడి చేతులను భుజాల ఎత్తులో గోడపై ఉంచాలి. తరువాత మోచేతులను వంచి ఛాతిని గోడకు దగ్గరగా తీసుకెళ్లాలి. మళ్లీ చేతుల బలంతో వెనక్కి రావాలి. రోజుకు ఒకటి నుంచి రెండు నిమిషాలు ఈ వ్యాయామం చేయవచ్చు.
ఈ వ్యాయామం చేతులతో పాటు పొట్ట కండరాలను కూడా బలపరుస్తుంది. పుష్-అప్ స్థితిలోకి వెళ్లి వీపు నిటారుగా ఉంచాలి. ఎడమ చేతితో కుడి భుజాన్ని తాకి, మళ్లీ చేతిని కింద పెట్టాలి. తరువాత కుడి చేత్తో ఎడమ భుజాన్ని తాకాలి. ఇలా ఒక నిమిషం పాటు కొనసాగించాలి. శరీరం ఎక్కువగా ఊగకుండా జాగ్రత్త పడాలి.
గాలిలో బాక్సర్‌లా పంచ్‌లు వేయడం చేతుల కండరాలను చురుకుగా పనిచేయిస్తుంది. ఇది రక్తప్రసరణను మెరుగుపరచడంతో పాటు చేతుల బలం, స్టామినాను కూడా పెంచుతుంది. కాళ్లను భుజాల వెడల్పుతో ఉంచి నిలబడాలి. మోకాళ్లను స్వల్పంగా వంచి చేతులను ఛాతి దగ్గర ఉంచాలి. తరువాత ఒక్కో చేతితో వేగంగా ముందుకు పంచ్‌లు వేయాలి. రోజుకు ఒకటి నుంచి రెండు నిమిషాలు ఈ వ్యాయామం చేయడం మంచిది.
Also Read: మందులు తీసుకుంటున్నా కొలెస్ట్రాల్ పెరుగుతూనే ఉందా? మీరు చేసే ఈ 6 తప్పులే కారణం
ఒక్క వ్యాయామంతోనే ఒక భాగంలోని కొవ్వు పూర్తిగా తగ్గదు. సమతుల్య ఆహారం, తగిన నిద్ర, క్రమం తప్పని వ్యాయామం కలిసి మంచి ఫలితాలు ఇస్తాయి. ఈ 5 వ్యాయామాలను ప్రతిరోజూ చేస్తే చేతుల కండరాలు బలపడటంతో పాటు వాటి ఆకృతి కూడా మెరుగుపడుతుంది. సహనం పాటిస్తూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరిస్తే మంచి మార్పు కనిపిస్తుంది.