E-Paper
Advertisement

డెంజర్ జోన్‌లో పవన్ కళ్యాణ్ కెరీర్ ? ‘ఉస్తాద్’ డిజాస్టర్ తర్వాత మళ్ళీ అదే తప్పు..

డెంజర్ జోన్‌లో పవన్ కళ్యాణ్ కెరీర్ ? ‘ఉస్తాద్’ డిజాస్టర్ తర్వాత మళ్ళీ అదే తప్పు..
Advertisement

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఇపుడు రెండు పడవల్లో జర్నీ చేస్తు ఫ్యాన్స్ ని టెన్షన్ పెట్టేస్తున్నాడు. ఒకవైపు పొలిటికల్ మీటింగ్స్ తో బిజీగా ఉంటూనే,మరోవైపు OG’, ‘హరిహర వీరమల్లు’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలని కంప్లీట్ చేశాడు. చేసిన మూడింట్లో ఓజి పర్లేదనిపిస్తే ‘హరిహర వీరమల్లు’,‘ఉస్తాద్ భగత్ సింగ్’లు మాత్రం బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయ్. ముఖ్యంగా ఉస్తాద్ డిజాస్టర్ పవన్ మార్కెట్ నే క్వశ్చన్ చేసింది, నేను గనుక సినిమా  చేయడం మొదలెడితే 100 కోట్లు వెరీ కామన్ అన్న పవన్ ఉస్తాద్ తో 50 కోట్లనే కనా కష్టంగా టచ్ చేసిన పరిస్థితి.

భయంతోనే పవన్ సినిమాలకు ఓకే చెబుతున్నారా?

Advertisement

ఇక ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం పవన్  గతంలోనే పలువురు బడా నిర్మాతలకు డేట్స్ ఇచ్చి భారీగా అడ్వాన్సులు తీసుకున్నారు.ఇప్పుడు ఆ ప్రాజెక్టులను పూర్తి చేయకపోతే లీగల్ ఇబ్బందులు తప్పవనే భయంతోనే పవన్ సినిమాలకు ఓకే చెబుతున్నారా? అనే డౌట్స్ రైజ్ అవుతున్నాయ్.నిజానికి పవన్ చేతిలో ప్రస్తుతం కొత్త కథలేవీ లేవు. కానీ గతంలో అనౌన్స్ చేసి అటకెక్కిన సురేందర్ రెడ్డి ప్రాజెక్టును మళ్ళీ తెరపైకి తేవడం వెనుక అసలు కారణం ఇదేనని వినిపిస్తున్న టాక్ .

సైరా కూడా కాస్ట్ ఫెయిల్యూర్

Advertisement

ఇక సురేందర్ రెడ్డి విషయానికే వస్తే స్టైలిష్ డైరెక్టర్ అన్న పేరు ఉన్నప్పటికీ గత సినిమా ఏజెంట్ ఎటు వెళ్ళిపోయిందో తెలీదు. భారీ అంచనాలు పెట్టుకున్న ఈ సినిమా అఖిల్ కి ఒక నైట్ మెర్ లా అయిపొయింది. ఇక అంతకు ముందు వచ్చిన సైరా కూడా కాస్ట్ ఫెయిల్యూర్ అయిన సినిమానే.దీంతో భారీ బడ్జెట్ సినిమాలను హ్యాండిల్ చేయడంలో ఈ స్టైలిష్ డైరెక్టర్ తడబడుతున్నాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయ్.

also read:ప్రభాస్‌ను వదలని టెన్షన్.. ‘ఫౌజీ’ షూటింగ్‌లో హడావిడి.. ప్లాన్ రివర్స్ అయితే పరిస్థితి ఏంటి?

ఆడియన్స్ కాసుల వర్షం కురిపించడం పక్కా

 ఇపుడు ‘వకీల్ సాబ్’, ‘గబ్బర్ సింగ్’ లాంటి సినిమాలు పవన్ మళ్ళీ చేస్తే ఆడియన్స్ కాసుల వర్షం కురిపించడం పక్కా. పవన్ కి కావాల్సింది కూడా అదే.కానీ సురేందర్ రెడ్డి మార్క్ క్లాస్ ఎలిమెంట్స్ ఇప్పుడున్న పొలిటికల్ హీట్‌లో పవన్‌కు ఏమాత్రం సెట్ అవుతాయనేది మెగా ఫ్యాన్స్ ని వేదిస్తున్న ప్రశ్న. ఇక పవన్ ఆటిట్యూడ్, మేనరిజమ్స్‌ ని దృష్టిలో పెట్టుకొని  ‘పవర్‌ఫుల్’ స్క్రిప్ట్ రెడీ చేశామని మేకర్స్ హైప్ ఇస్తున్నారు కాని ఇది ఒక రొటీన్ రివెంజ్ డ్రామా అని, కేవలం పవన్ ఇమేజ్‌ను వాడుకోవడానికే తప్ప కథలో కొత్తదనం ఏమీ లేదని ఇన్ సైడ్ టాక్. కేవలం ‘మాస్ మరియు క్లాస్’ అంటూ ఊరిస్తూ థియేటర్లకు ప్రేక్షకులను రప్పించే పాత ట్రిక్ నే ప్లే చేస్తున్నారా అన్న డౌట్స్ రైజ్ అవుతున్నాయ్.

 క్వాలిటీ లేని సినిమాలు చేయడం వల్ల

ఇకపోతే ఒకవైపు  ఈ సినిమా  జూన్ లేదా జూలైలో మొదలవబోతుంది అని వినిపిస్తుంది.మరో వైపు పవన్ పొలిటికల్ షెడ్యూల్ చూస్తె ఎప్పుడు ఏ జిల్లాలో ఉంటాడో తెలీని పరిస్థితి.మరి ఇలాంటి స్థితిలో సినిమా మొదలైనా సాఫీగా సాగుతుందా అంటే అనుమానమే.కుదిరినప్పుడు రెండు రోజులు షూటింగ్ చేసి మిగతా రోజులు రాజకీయం చేస్తానంటే ఎలా ఉంటుందో ఉస్తాద్ రిజల్ట్ క్లియర్ కట్ గా చూపించింది.దీంతో అంత బిజీగా ఉండి ,గ్యాప్ లో క్వాలిటీ లేని సినిమాలు చేయడం వల్ల ఉన్న మార్కెట్ ని కాస్తా పవన్ తనకి తానుగా డ్యామేజ్ చేసుకుంటున్నాడంటున్నారు ట్రేడ్ పండితులు.

పవర్ స్టార్ కెరీర్ క్లోజ్ అయినట్టేనా 

ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే ఒకప్పుడు  బాక్సాఫీస్ దద్దరిల్లేది, గల్లా పెట్టె గలగల లాడేది. అలాంటిది ఇపుడు పవన్ సినిమాలు వచ్చినా పెద్దగా బజ్ క్రియేట్ కాని పరిస్థితి.ఇక ఇప్పుడు మాత్రం సురేందర్ రెడ్డి సినిమా కూడా ఏ మాత్రం తేడా కొట్టినా పవర్ స్టార్ కెరీర్ క్లోజ్ అయినట్టే అంటూ సెటైర్స్ వేస్తున్నారు యాంటి ఫ్యాన్స్.మరి ఈ సినిమాతో నైనా పవన్ తనని తానూ ప్రూవ్ చేసుకుంటాడా లేక ఆ సినిమాల్లాగే ఇది కూడా అని లైట్ తీసుకుంటాడా చూడాలి !

also read:అనిల్ రావిపూడికి ‘రామాయణం’ పిచ్చి.. అటు వెంకటేష్, ఇటు యానిమేషన్.. అసలు ఏం జరుగుతోంది?

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×