E-Paper
Advertisement

ఏం చెబితిరి ఏం చెబితిరి…! కేంద్రంలో మోడీ బెట‌ర‌ట‌.. జీవ‌న్‌రెడ్డి కామెంట్స్‌పై భ‌గ్గుమంటున్న కాంగ్రెస్‌

ఏం చెబితిరి ఏం చెబితిరి…! కేంద్రంలో మోడీ బెట‌ర‌ట‌.. జీవ‌న్‌రెడ్డి కామెంట్స్‌పై భ‌గ్గుమంటున్న కాంగ్రెస్‌
Advertisement

పార్టీ మారితే అంతే. ఏ పార్టీలో ఉంటే ఆ పాటందుకోవాలె. అదే బ‌తుకుదెరువు. బ‌త‌క‌నేర్చిన తెలివి. జీవ‌న్‌రెడ్డి ఇవాళ ఇలా బీఆరెస్ పార్టీలో చేరుతున్న‌ట్టు ప్ర‌క‌టించుకున్నాడో లేదో.. ఓ ప్ర‌క‌ట‌నైతే తెగ వైర‌ల్ అయిపోతా ఉంది. కేంద్రంలో మోడీ పాల‌న‌ను మెచ్చుకున్నాడు మ‌రి జీవ‌న్‌రెడ్డి.

ఇన్నాళ్లూ కాంగ్రెస్‌లో ఉన్నా ఇసుమంత కూడా జాలి లేదు రాహుల్ మీద జీవ‌న్‌కు అని కాంగ్రెసోళ్లు తెగ ఫైర్ అయిపోతున్నారు ఆయ‌న మీద‌. కేంద్రంలో బీజేపీ బెట‌ర్‌.. ఇక్క‌డ కేసీఆర్ ప‌క్కా అని రెండు పార్టీల గురించి త‌న తాజా ఓపీనియ‌న్ చెప్పేశాడాయ‌న‌. అంటే ఈ రెండు పార్టీలో ఫ్యూచ‌ర్‌లో క‌ల‌వ‌బోతున్నాయ‌ని త‌న‌కు తెల‌సిన నిజాన్ని ఇలా మ‌ర్మంగా, ప‌రోక్షంగా ఉన్న‌దున్న‌ట్టు చెప్పేశావా జీవ‌న్‌రెడ్డి? అని ఆయ‌న‌పై భ‌గ్గుమంటున్నారు కాంగ్రెస్ సానుభూతి ప‌రులు.

Advertisement

పార్టీ మార‌గానే నీ స్టేట్మెంట్ ఇంత‌లా మారుతుంద‌ని అస్స‌లు ఊహించ‌లేద‌న్నా…! అని కూడా సెటైర్లు వేశారు. స‌రే, ఇక్క‌డ రేవంత్‌ను తిట్టిన‌వ్‌.. బాగానే ఉంది. కేసీఆర్‌ను మెచ్చుకున్న‌వ్ బాగానే ఉంది. ఇప్ప‌టికిప్పుడు ఆ కేంద్రంపై నీ కామెంట్ ఎవ‌డ‌డిగిండు? గింత కూడా ఓపిక‌లేక‌పాయె.! మోడీ బెట‌ర్ అనేందుకు నీకు నోరెలా వ‌చ్చింది. మ‌రీ ఇంత దారుణంగా దిగ‌జారి మాట్లాడాలా? అని హితోక్తులు, ఛ‌లోక్తులు వ‌దులుతున్నారు. మ‌రోవైపు ఈ జీవ‌న్‌రెడ్డిని కేటీఆర్ ఓ స‌భ‌లో తుక్కుతుక్కు తిడుతున్న వీడీయోను తీసి వ‌దిలారు నెట్టింట‌.

ఆంధ్రోళ్ల తొత్తు జీవ‌న్‌రెడ్డి అని, రైతుల సాగునీటి ప్రాజెక్టుల‌కు అడ్డం ప‌డుతూ చ‌నిపోయిన వారితో కూడా సంత‌కాలు పెట్టించి కోర్టుల్లో కొట్లాడుతున్నాడ‌ని, ఇదే విష‌యాన్ని స్వ‌యంగా తాను శాస‌న స‌భ‌లో చెప్పాడ‌ని కేటీఆర్ తీవ్రంగా తిట్టిన వీడియో అది. మీకు సిగ్గు లేదు.. ఇలాంటి నేత‌ల‌ను ఎందుకు తీసుకున్నారు మ‌రి… అని పైన కామెంట్లు పెడుతూ ఈ వీడియోను తెగ గింగిరాలు తింపుతున్నారు.

Advertisement

పార్టీ కండువా ఇంకా క‌ప్పుకోక‌ముందే పెద్దాయ‌న క‌ళ్లు బైర్లు క‌మ్మేలా ఆరోప‌ణ‌లు చేస్తూ, సెటైర్లు వేస్తున్నారు కాంగ్రెస్ నాయ‌కులు. మ‌రోవైపు జాగృతి నాయ‌కులు కూడా జీవ‌న్‌రెడ్డి మీద కేటీఆర్‌, బీఆరెస్ ల మీద తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.

Tags

Related News

ఇక దండయాత్రే కాస్కోండి.. నకిరేకల్‌లో సీఎం రేవంత్ రెడ్డి మాస్ స్పీచ్!

ఓలా, ఊబర్, ర్యాపిడో బైక్‌లు సీజ్.. రవాణా శాఖకు ఆటో జేఏసీ డెడ్‌లైన్!

బీజేపీ అంటే చెత్త కుప్ప కాదు..కొండా సురేఖ ఎంట్రీపై మురళీధర్ రావు వైరల్ కామెంట్స్ !

గాంధీ భవన్‌లో బీసీ హక్కుల గర్జన.. కేంద్రంపై కాంగ్రెస్ పార్టీ నెక్ట్స్ ప్లాన్ ఇదే?

SIR దరఖాస్తుదారులకు బిగ్ షాక్.. 50 శాతం మందికి నోటీసులు జారీ!

మేడ్చల్లో తీవ్ర విషాదం.. ఉరివేసుని 11 ఏళ్ల మైనర్ బాలిక ఆత్మహత్య!

ప్రమాదానికి గురైన కేటీఆర్ కారు.. వాహనం సైడు భాగం డ్యామేజ్, అసలు ఎలా జరిగింది?

టీచర్స్‌‌కు సీఎం రేవంత్ శుభవార్త.. పీఆర్సీపై కీలక ప్రకటన, రెండేళ్ల తర్వాత..

Big Stories

Advertisement
×