E-Paper
Advertisement

పవన్ కళ్యాణ్ కు సర్జరీ.. త్వరగా కోలుకోవాలంటూ అల్లు అర్జున్ పోస్ట్!

పవన్ కళ్యాణ్ కు సర్జరీ.. త్వరగా కోలుకోవాలంటూ అల్లు అర్జున్ పోస్ట్!
Advertisement

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. వరుస పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అయిన అల్లు అర్జున్(Allu Arjun) ప్రస్తుతం రాకా సినిమా(Raaka Movie) షూటింగ్ పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమా 2027 డిసెంబర్లో విడుదల కాబోతుందని సమాచారం. ప్రస్తుతం షూటింగ్ పనులను శరవేగంగా జరుపుకుంటున్నారు. మరికొద్ది నెలలో ఈ సినిమా షూటింగ్ పూర్తి కాబోతుందని తెలుస్తోంది. ఇలా సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నా అల్లు అర్జున్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు.

పవన్ కళ్యాణ్ కు సర్జరీ..

నిత్యం అల్లు అర్జున్ తనకు సంబంధించిన విషయాల గురించి మాత్రమే కాకుండా ఇండస్ట్రీకి సంబంధించిన అంశాల గురించి కూడా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ పోస్టులు చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ తాజాగా పవన్ కళ్యాణ్ హెల్త్ గురించి స్పందిస్తూ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. పవన్ కళ్యాణ్ కు శనివారం హైదరాబాద్ అపోలో హాస్పిటల్ లో సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. ఇలా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు సర్జరీ జరిగిందనే విషయం తెలియగానే అభిమానులతోటి నటీనటులు రాజకీయ నాయకులు కూడా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఆయన క్షేమంగా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Advertisement

పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యంగా ఉండాలి.

అల్లు అర్జున్ సైతం పవన్ కళ్యాణ్ గారు చాలా ఆరోగ్యంగా ఉండాలని ఆయన త్వరగా కోలుకొని, మంచి ఆరోగ్యంతో కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను అలాగే మరింత శక్తివంతంగా, పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకుంటున్నాము అంటూ అల్లు అర్జున్ చేసిన ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు శుక్రవారం ఈయన ఉన్నతాధికారులతో రాజకీయ సమావేశాలలో పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో పవన్ కళ్యాణ్ తీవ్ర అస్వస్థకు గురి కావడంతో తన కార్యకలాపాలన్నింటిని రద్దు చేసి హైదరాబాద్ వెళ్ళిపోయారు.

Advertisement

హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో ఈయనకు సైనస్ సమస్య కారణంగా చిన్నపాటి సర్జరీ జరిగిందని, ఒక వారం రోజులపాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. ఇలా పవన్ కళ్యాణ్ కు సర్జరీ జరిగిందనే విషయం తెలిసిన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆయన మునుపటిలాగే రాజకీయాలలోనూ సినిమాలలో యాక్టివ్ గా ఉండగలరా అంటూ అభిమానులు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక పోతే గత కొద్దిరోజులుగా మెగా హీరోలందరికీ వరుసగా సర్జరీలు జరుగుతున్న నేపథ్యంలో అభిమానులు ఆందోళన చేస్తున్నారు. రామ్ చరణ్ షూటింగ్లో భాగంగా కంటికి సర్జరీ జరగగా వరుణ్ తేజ్ మోకాలికి సర్జరీ జరిగింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి కూడా సర్జరీ జరగడంతో అభిమానులు కంగారు పడుతున్నారు.

Also Read: “మహావతార్ పరుశురామ్” మరో క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన హోంభలే.. ఆకట్టుకుంటున్న పోస్టర్!

Related News

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

Big Stories

Advertisement
×