E-Paper
Advertisement

Ustaad Bhagath Singh Story: ఉస్తాద్ భగత్ సింగ్ కథ ఇదే.. తేరి సినిమా కథను ఇలా మార్చిన దర్శకుడు..!

Ustaad Bhagath Singh Story: ఉస్తాద్ భగత్ సింగ్ కథ ఇదే.. తేరి సినిమా కథను ఇలా మార్చిన దర్శకుడు..!
Advertisement

Ustaad Bhagath Singh Story:పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ప్రస్తుతం టాలీవుడ్‌లో తెగ ట్రెండ్ అవుతూ ఉంది. దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా మార్చి 19న ప్రేక్షకుల.. ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కథలో కొన్ని ఆసక్తికరమైన మార్పులు చేసినట్లు తెలుస్తోంది. మొదట ఈ సినిమా కథకు తమిళంలో వచ్చిన తేరి..సినిమాను ప్రేరణగా తీసుకున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తర్వాత కథను పూర్తిగా మార్చి పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కు సరిపోయేలా రూపొందించారని వార్తలు వస్తున్నాయి.

Advertisement

ఈ సినిమాలో ముఖ్యంగా మహిళల గౌరవం, మహిళల సార్ధకత గురించి బలమైన సందేశం ఉండబోతుందని తెలుస్తోంది. కథలో ఒక అమ్మాయి రేప్ కి.. గురైన తర్వాత హీరో ఎలా ఆమెకు న్యాయం చేస్తాడు అన్న అంశం ప్రధానంగా ఉండబోతుందట. ముఖ్యంగా ఇంటర్వెల్ లో ఆ అమ్మాయి ఎదుర్కొనే సమస్యలను చూపిస్తారని..ఆ తర్వాత హీరో రంగంలోకి దిగే విధానం చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని చెబుతున్నారు.

ఇంటర్వెల్ సీన్ ఈ సినిమాలో హైలైట్ అవుతుందని దర్శకుడు హరీష్ శంకర్ కూడా చెప్పాడు. పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే బెస్ట్ ఇంటర్వెల్ సీన్ ఇదేనని ఆయన చెప్పడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. పవన్ కళ్యాణ్‌ను చాలా పవర్‌ఫుల్‌గా చూపించాలనే తపన తనకు ఉందని కూడా హరీష్ శంకర్ వెల్లడించాడు. అంతేకాకుండా రెండో భాగంలో మహిళల గురించి పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగ్స్ కూడా పవర్ ఫుల్ గా ఉంటాయి అని వినికిడి.

Advertisement

ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రవి శంకర్, నవీన్ యెర్నేని నిర్మిస్తున్నారు. ఇందులో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమిళ నటుడు పార్థిబన్ ప్రధాన ప్రతినాయకుడిగా కనిపించనున్నారు.

సంగీతం విషయానికి వస్తే దేవి శ్రీ ప్రసాద్ మరియు థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. పాటలు మరియు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు మరింత హైలైట్ అవుతాయని చిత్ర యూనిట్ చెబుతోంది.

మొత్తం పైన ఉస్తాద్ భగత్ సింగ్.. సినిమా పవన్ కళ్యాణ్ అభిమానులకు ఒక మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందని తెలుస్తోంది. కథలో చేసిన మార్పులు, పవర్‌ఫుల్ సీన్లు ఈ సినిమాను మరింత ప్రత్యేకంగా మార్చనున్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి.

ALSO READ: Keerthy Suresh: కీర్తి సురేష్ కొత్త మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ప్లానింగ్ అదుర్స్!

Related News

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

Big Stories

Advertisement
×