E-Paper
Advertisement

Ustad Bhagat Singh : పవర్ స్టార్ స్టైలిష్ స్వాగ్, ఫస్ట్ సింగిల్ కంప్లీట్ డీటెయిల్స్

Ustad Bhagat Singh : పవర్ స్టార్ స్టైలిష్ స్వాగ్, ఫస్ట్ సింగిల్ కంప్లీట్ డీటెయిల్స్
Advertisement

Ustad Bhagat Singh : ఇప్పుడు సినిమాల మీద ఆసక్తి తగ్గిపోయింది. కానీ ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఒక విపరీతమైన క్రేజ్ ఉండేది. అయితే పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే తన రాజకీయ ప్రస్తానాన్ని మొదలుపెట్టాడో అప్పటినుంచి కొంతమంది ఫ్యాన్ బేస్ కోల్పోయారు. సినిమాలు పరంగా రిలీజ్ అయితే చూసి ఆదరిస్తారు గాని భారీ ఎలివేషన్ మాత్రం ఇవ్వరు.

ఒకప్పుడు పవన్ కళ్యాణ్ కి సినిమాలు మీద ఉండే డెడికేషన్ వేరు. చాలా సందర్భాల్లో ఎడిట్ రూమ్ లో కూర్చుని పని చేసిన రోజులు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక సినిమాకు డేట్స్ ఇవ్వడమే కష్టంగా మారింది. మొత్తానికి వకీల్ సాబ్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇచ్చారు. వకీల్ సాబ్ రియంట్రీ తర్వాత ఒప్పుకున్న సినిమాలన్నీ దాదాపు పూర్తి చేశారు. అన్ని సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద విడుదల అయిపోయాయి.

హరీష్ సినిమా ప్రత్యేకం

Advertisement

హరీష్ శంకర్ దర్శకత్వంలో రాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా 2026 లో విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే పవన్ కళ్యాణ్ ఎంతమంది దర్శకులతో పనిచేసిన కూడా హరీష్ శంకర్ తో పని చేయటం అనేది కొంతమేరకు ప్రత్యేకం. ఎందుకంటే గబ్బర్ సింగ్ వంటి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఇచ్చాడు. హరీష్ అది ఒక రీమేక్ సినిమా అయినా కూడా పవర్ స్టార్ స్టామినా ఏంటో బాక్సాఫీస్ వద్ద ఆ సినిమాతో చూపించాడు.

ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ వస్తుంది అని గతంలో అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆ ఫస్ట్ సింగిల్ డిసెంబర్ నెలలోనే ఉండబోతుంది. అయితే దీనికి సంబంధించిన ప్రోమో తొమ్మిదో తారీఖున విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ఒక పోస్టర్ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.

Advertisement

స్టైలిష్ కళ్యాణ్

ఇకపోతే పోస్టర్ లో పవన్ కళ్యాణ్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. వింటేజ్ పవన్ కళ్యాణ్ స్వాగ్ అంతా కూడా ఆ పోస్టర్ లో కనిపిస్తుంది. పవన్ అభిమానులు కళ్యాణ్ ను ఎలా అయితే చూడాలి అనుకుంటున్నారో అచ్చం అలానే డిజైన్ చేస్తున్నాడు హరీష్ అని ఈ పోస్టర్ చూస్తే అర్థమవుతుంది. ఇక పోస్టర్ చూసిన తర్వాత సాంగ్ మీద మరింత క్యూరియాసిటీ పెరుగుతుంది అనటంలో అతిశయోక్తి లేదు.

Also Read: Rahul Ravindran : అర్జున్ రెడ్డి సినిమాతో ఈ సినిమాకి సంబంధం లేదు, అలా చూపించడానికి కారణం ఇదే..

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×